Bhoot Police ప్రీ రిలీజ్ బిజినెస్: బంపర్ లాభాలతో బయటపడ్డ నిర్మాత.. OTT రిలీజ్ ఎక్కడ? ఎప్పుడంటే!
కోవిడ్19 పరిస్థితుల కారణంగా సినిమా థియేటర్లు మూత పడటంతో నిర్మాతల పరిస్థితి దారుణంగా తయారైంది. కోట్ల రూపాయలు పెట్టి రూపొందించిన పలు చిత్రాలు విడుదలకు నోచుకోలేని వాతావరణం నెలకొన్నది. ఇలాంటి పరిస్థితుల్లో తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసి నష్టాల నుంచి బయటపడేందుకు నిర్మాతల ప్రయత్నిస్తున్నారు. ఆ జాబితాలోనే బూట్ పోలీస్ సినిమా చేరింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, ఓటీటీ రిలీజ్ వివరాల్లోకి వెళితే..
బూట్ పోలీస్ సినిమాలో సైఫ్ ఆలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వలైన్ ఫెర్నాండేజ్, యామీ గౌతమ్ నటించారు. ఈ సినిమాను తొలుత థియేటర్లలో రిలీజ్ చేయాలని అనుకొన్నారు. అయితే ఈ సినిమాను డిస్నీ+హాట్ స్టార్‌లో రిలీజ్ చేయాలని నిర్మాత రమేష్ తౌరానీ నిర్ణయించారు.

బూట్ పోలీస్ సినిమాను సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను రూ.45 కోట్లకు అమ్మారు. ఆ తర్వాత శాటిలైట్ హక్కులను సుమారు రూ.20 కోట్ల మేర జరిగింది. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 65 కోట్లుగా జరిగినట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి. దీంతో నిర్మాత సేఫ్‌గా రూ.20 కోట్ల లాభంతో బయటపడినట్టు సమాచారం. ఇంకా మ్యూజిక్, ఇతర హక్కులతో మరింత లాభం గడించే అవకాశం లేకపోలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
హారర్ కామెడీగా రూపొందిన బూట్ పోలీస్ చిత్రం ఇప్పుడు డిస్నీ+హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నది. అయితే ఈ మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే నిర్మాత రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











