»   » కుమ్మేస్తున్న జై లవకుశ కలెక్షన్లు.. ఇక టార్గెట్ మెగాస్టార్, మహేశ్

కుమ్మేస్తున్న జై లవకుశ కలెక్షన్లు.. ఇక టార్గెట్ మెగాస్టార్, మహేశ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
NTR's Movie "Jai Lava Kusa" Racing With High Collections

దసరా నేపథ్యంలో వచ్చిన జై లవకుశ చిత్రం పండుగ తర్వాత కూడా కలెక్షన్లపరంగా దుమ్ము లేపుతున్నది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తూ నటించిన ఈ చిత్రం దసరా బరిలో బ్లాక్‌బస్టర్‌గా నిలచింది. తన రికార్డులను తానే అధిగమిస్తూ టాలీవుడ్ అగ్రహీరోల రికార్డులపై గురిపెట్టారు. అయితే ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యథిక కలెక్షన్ల వసూలు చేసిన ఈ చిత్రం డిస్టిబ్యూటర్లకు మాత్రం చుక్కలు చూపిస్తున్నది. పంపిణీదారులందరూ ఇంకా సేఫ్ జోన్‌లోకి రాకపోవడం గమనార్హం.

 140 కోట్ల వసూళ్ల రికార్డు

140 కోట్ల వసూళ్ల రికార్డు

దసరా పండుగ నేపథ్యంలో వచ్చిన ప్రిన్స్ స్పైడర్, శర్వానంద్ మహానుభావుడు చిత్రాల పోటీని తట్టుకొని కలెక్షన్లపరంగా జై లవకుశ అగ్రస్థానాన చేరుకొన్నది. ఇప్పటివరకు ఈ చిత్రం 140 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసినట్టు సమాచారం. గతంలో జనతా గ్యారేజ్ వసూలు చేసిన 134 కోట్ల వసూళ్లను అధిగమించడం విశేషం.

నికరంగా 80 కోట్లు వసూలు

నికరంగా 80 కోట్లు వసూలు

జై లవకుశ గ్రాస్ కలెక్షన్లు భారీగా ఉన్నప్పటికీ నికర వసూళ్లు సుమారు 80 కోట్లు వరకు వసూలు చేసినట్టు తెలుస్తున్నది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చినా తట్టుకొని బ్లాక్ బస్టర్‌గా నిలువడం విశేషం. ఈ సినిమాను మార్కెట్ నిలబెట్టడానికి జై పాత్ర ఒక ప్రధాన కారణం. మిగితా రెండు పాత్రలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడానికి ఓ కారణంగా మారింది.


 నిరాశలోనే డిస్టిబ్యూటర్లు

నిరాశలోనే డిస్టిబ్యూటర్లు

ఓ వైపు జై లవకుశ గ్రాస్ కలెక్షన్లను సాధిస్తున్పపట్టికి డిస్టిబ్యూటర్లు మాత్రం ఇంకా పూర్తిగా బ్రేక్ ఈవెన్‌కు రాలేదనేది ట్రేడ్ వర్గాల విశ్లేషణ. ఇంకా 8 నుంచి 10 కోట్ల వరకు వసూళ్లను సాధిస్తే పెట్టిన పెట్టుబడి వచ్చే అవకాశం ఉందనే సినీ వర్గాలు అభిప్రాయం. కేవలం ఈ వసూళ్లన్నీ 18 రోజులవే కావడం గమనార్హం.


 మెగాస్టార్, మహేశ్ ఇక టార్గెట్

మెగాస్టార్, మహేశ్ ఇక టార్గెట్

ఇక తన రికార్డులు తానే అధిగమించిన ఎన్టీఆర్.. ఇక చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150, ప్రిన్స్ మహేశ్‌బాబు నటించిన శ్రీమంతుడు రికార్డులపై ఎన్టీఆర్ గురిపెట్టాడు. కలెక్షన్ల పరంగా ఇదే ఊపు కొనసాగితే ప్రిన్స్, మెగాస్టార్ల రికార్డులను అధిగమించే అవకాశం ఉంటుంది అంటున్నారు.


 జై లవకుశ అందించిన జోష్‌తో

జై లవకుశ అందించిన జోష్‌తో

ఖైదీ నంబర్ 150 చిత్రం 164 కోట్లు, శ్రీమంతుడు చిత్రం 156 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల రికార్డులను ఎన్టీఆర్ అధిగమించి బాక్సాఫీస్ హీరోగా నిలుస్తాడా లేదా అనే త్వరలోనే స్పష్టమవుతున్నది. ఇక తదుపరి సినిమాకు వస్తే జై లవకుశ అందించిన జోష్‌తో ఎన్టీఆర్.. దర్శకుడు త్రివిక్రమ్ సినిమాకు సిద్ధమవుతున్నాడు.English summary
Young Tiger NTR's movie Jai Lava Kusa racing with high collections even after Festival. This movie collection 140 crores so far. NTR beats Janatha Garrage Collections. This movie is eyeing to beat Chiranjeevi's Khaidi No 150, Prince Mahesh Sri Manthudu movie collections.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu