»   » ఫస్ట్ వీక్ కేక, సెకండ్ వీక్ బోనస్‌గా సీన్లు (జనతా గ్యారేజ్ ఏరియా వైజ్ రిపోర్ట్)

ఫస్ట్ వీక్ కేక, సెకండ్ వీక్ బోనస్‌గా సీన్లు (జనతా గ్యారేజ్ ఏరియా వైజ్ రిపోర్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన గత సినిమాలు మిర్చి, శ్రీమంతుడు విడుదలైన కొన్ని రోజుల తర్వాత కొత్త సీన్లు కలపడం లాంటివి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా 'జనతా గ్యారేజ్' సినిమా విషయంలోనూ అదే చేస్తున్నారు.

సినిమాకు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి కొన్ని సీన్లను కలుపుతామని కొరటాల శివ ఇంతకు ముందు ప్రకటించిన సంగతి తెలిసిందే. బక్సాఫీసు వద్ద 'జనతా గ్యారేజ్' దుమ్మురేపుతుండటంతో పక్కన పెట్టిన సీన్లను మళ్లీ కలిపారు.


సినిమాలో ఎలాంటి పరిచయం లేకుండా పాటతో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే.... తాజాగా కలిపిన సీన్లలో ఇంట్రడక్షన్ సీన్ ఉంది. మొక్కల ప్రాధాన్యం గురించి తెలుపుతూ సాగుతుందా పరిచయ సన్నివేశం ఉంది. ఆల్రెడీ అమెరికాలో ఈ సీన్లు యాడ్ చేసారు. ఇండియన్ స్క్రీన్లలో కూడా ఈ సీన్ సెకండ్ వీక్ నుండి యాడ్ చేసారు. ఎన్టీఆర్, సమంత కాంబినేషన్లో వచ్చే మరిన్ని కొన్ని సీన్లను కూడా కలిపారట.


ఈ సినిమా తొలి వారంలో ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి బాహుబలి తర్వాతి స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. మరి ఇందులో డిస్ట్రిబ్యూటర్ల షేర్ ఎంత? ఏరియా వైజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం...


నైజాం ఏరియాలో

నైజాం ఏరియాలో

నైజాం ఏరియాలో సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేసారు. దీంతో తొలి వారం జనతా గ్యారేజ్ కలెక్షన్లు అదిరిపోయాయి. తొలి 7రోజుల్లో రూ. 14.70 కోట్ల రూపాయల షేర్ వసూలైంది.సీడెడ్ ఏరియాలో...

సీడెడ్ ఏరియాలో...

సీడెడ్ ఏరియాలో ఎన్టీఆర్, నందమూరి హీరోల సినిమాలు బాగా ఆడతాయి. జనతా గ్యారేజ్ మూవీ హిట్ టాక్ రావడంతో సీడెడ్ జిల్లాల్లో కూడా సినిమా వసూళ్లు అదరగొడుతోంది. తొలివారం ఈ చిత్రం రూ.8.43 కోట్లు వసూలు చేసింది.


ఉత్తరాంధ్ర ఏరియా...

ఉత్తరాంధ్ర ఏరియా...

ఉత్తరాంధ్ర ఏరియాలో ఎన్టీఆర్ సినిమా అదరగొడుతోంది. తొలి వారం రోజుల్లో ఈ చిత్రం ఇక్కడ రూ. 5.46 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. ఇక్కడ ఇది ఆల్ టైమ్ రికార్డ్.ఈస్ట్ గోదావరి ఏరియాలో..

ఈస్ట్ గోదావరి ఏరియాలో..

ఈస్ట్ గోదావరి ఏరియాలో మామూలు సినిమాలే ఓ రేంజిలో ఆడేస్తాయి. మరి జనతా గ్యారేజ్ లాంటి హిట్ సినిమాకు వసూళ్లు రాకుండా ఉంటాయా? ఈ సినిమా ఇక్కడ తొలి వారం రూ. 3.85 కోట్ల రూపాయలు వసూలు చేసింది.


వెస్ట్ గోదావరి ఏరియాలో....

వెస్ట్ గోదావరి ఏరియాలో....

ఈస్ట్ కు పోటా పోటీగా.... వెస్ట్ గోదావరి ఏరియాలో వసూళ్లు ఉంటాయి. తాజాగా జనతా గ్యారేజ్ విషయంలో కూడా అలానే ఉన్నాయి. ఈ చిత్రం ఇక్కడ తొలి వారం రూ. 3.33 కోట్లు వసూలు చేసింది.


కృష్ణ ఏరియాలో కూడా...

కృష్ణ ఏరియాలో కూడా...

ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ చిత్రానికి కృష్ణ ఏరియాలోనూ వసూళ్ల పంటపండుతోంది. ఎన్టీఆర్ తాతగారి జిల్లా అయిన ఇక్కడ ఆయనకు ఫాలోయింగ్ బాగానే ఉంది. ఈ చిత్రం ఇక్కడ తొలి వారం రూ. 3.49 కోట్లు వసూలు చేసింది.


గుంటూరు ఏరియాలో...

గుంటూరు ఏరియాలో...

గుంటూరు టెర్రిటరీలోనూ జనతా గ్యారేజ్ ఊపు మామూలుగా లేదు. తొలి వారం ఈ చిత్రం ఇక్కడ రూ. 4.66 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తం బిజినెస్ పూర్తయ్యేలోపు మరో మూడు నాలుగు కోట్లు వసూలవుతాయని అంచనా.


కోటిన్నర దాటింది

కోటిన్నర దాటింది

నెల్లూరు ఏరియాలో జనతా గ్యారేజ్ వసూళ్లు తొలివారం పూర్తయ్యేసరికి రూ. 1.66 కోట్లు వసూలు చేసింది.


తెలుగు రాష్ట్రాల్లో...

తెలుగు రాష్ట్రాల్లో...

ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి జనతా గ్యారేజ్ తొలి వారం రూ. 45.6 కోట్ల షేర్ సాధించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.


వరల్డ్ వైడ్ షేర్

వరల్డ్ వైడ్ షేర్

జనతా గ్యారేజ్ చిత్రం వరల్డ్ వైడ్ ఇప్పటి వరకు ఓవర్సీస్ కలెక్షన్లు, రెస్టాఫ్ ఇండియా, ఇతర రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ మొత్తం కలిపి రూ. 63.3 కోట్లు వసూలు చేసింది.


English summary
Young Tiger NTR's Janatha Garage has finished its first week run at the box office. The movie had collected around 63.3 Crore Share Worldwide in this One week run and even setup an All Time Record in Uttarandhra.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu