»   » వరల్డ్ వైడ్ 120 కోట్లు: యూఎస్ఏలో జనతా గ్యారేజ్ డాలర్స్ లెక్క ఇదీ...

వరల్డ్ వైడ్ 120 కోట్లు: యూఎస్ఏలో జనతా గ్యారేజ్ డాలర్స్ లెక్క ఇదీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో విడుదలైన 'జనతా గ్యారేజ్‌' చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ లాభాలు నమోదు చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈచిత్రానికి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్లో ఎన్టీఆర్ సినిమాలకు పెద్దగా బిజినెస్ అయ్యేది కాదు. అయితే టెంపర్ సినిమా తర్వాత పరిస్థితి మారింది. ఆ తర్వాత విడుదలైన నాన్నకు ప్రేమతో చిత్రం కూడా యూఎస్ఏలో మంచి వసూళ్లు సాధించింది.

తాజాగా 'జనతా గ్యారేజ్' మూవీ అమెరికాలో వసూళ్ల పరంగా డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం శనివారానికి మొత్తం 1.8 మిలియన్‌ డాలర్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

జనతా గ్యారేజ్

జనతా గ్యారేజ్

థర్డ్ వీకెండ్ శుక్రవారం (5,629 డాలర్లు), శనివారం (14,824 డాలర్లు) మొత్తం వసూళ్లు 1,777,542 డాలర్లు (రూ. 11.92 కోట్లు) రాబట్టినట్లు ట్వీట్‌ చేశారు తరణ్ ఆదర్శ్.

15 రోజుల్లో 120 కోట్లు

15 రోజుల్లో 120 కోట్లు

సినిమా విడుదలైన తొలి 8 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం సెకండ్ వీక్ మరో 20 కోట్లు వసూలు చేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 15 రోజుల్లో రూ. 120 కోట్లకు చేరుకుంది.

ఇండియాలో 106 కోట్లు

ఇండియాలో 106 కోట్లు

సినిమా మొత్తం 120 కోట్ల గ్రాస్ లో రూ. 106 కోట్లు ఇండియాలోనే వసూలయ్యాయి. ఏపీ, తెలంగాణలో కలిపి రూ. 81.4 కోట్లు వచ్చాయి. కర్నాటకలో ఈ సినిమాకు రూ. 16 కోట్ల వరకు గ్రాస్ వసూలయినట్లు తెలుస్తోంది.

అక్కడ నష్టాలే...

అక్కడ నష్టాలే...

సినిమా విడుదలైన దాదాపు అన్ని ఏరియాల్లో ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడి తిరిగి ఇవ్వడంతో పాటు లాభాలు వచ్చేలా చేసింది. అయితే ఇదంతా తెలుగు వెర్షన్ కు సంబంధించిన విషయం. కేరళలో మాత్రం అంచనాలు తలక్రిందులయ్యాయి. మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని కేరళలోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ సినిమాకు మంచి లాభాలు వస్తాయని ఆశించారు. కానీ ఈ విషయంలో అందరి అంచనాలు తప్పాయి. ఈ చిత్రాన్ని 8 కోట్లకు కొనుగోలు చేయగా ఇప్పటి వరకు కేవలం రూ. 4 కోట్లు మాత్రమే వచ్చాయి.

English summary
Janatha Garage, starring Jr NTR and Mohanlal, is consistently riding high on numbers and has emerged as the third biggest hit in Telugu cinema history.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu