»   » అంచనాలు రివర్స్: ‘జనతా గ్యారేజ్’ అక్కడ భారీ ప్లాప్.... ఎందుకలా?

అంచనాలు రివర్స్: ‘జనతా గ్యారేజ్’ అక్కడ భారీ ప్లాప్.... ఎందుకలా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్'..... బాక్సాఫీసు వద్ద రికార్డుల మోత మోగిస్తోందని, బాహుబలి తర్వాత అత్యంత వేగంగా రూ. 100 కోట్లు సాదించిన చిత్రంగా రికార్డుల కెక్కిందని రెండు మూడు రోజులుగా వార్తలు వింటూనే ఉన్నాం. ఈ విషయం ఎంత నిజమో.... ఈ సినిమాను నమ్ముకుని నష్టపోయిన వారూ ఉన్నారనేది అంతే నిజం!

సినిమా విడుదలైన తొలి రోజు టాక్ కాస్త అటూ ఇటుగా వచ్చినా.... రివ్యూలు కొంచెం తేడా కొట్టినా బాక్సాఫీసు వద్ద మాత్రం ఈ చిత్రం తిరుగులేని వసూళ్లు సాధిస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఫస్ట్ వీక్ కలెక్షన్ల విషయంలో వైజాగ్ ఏరియాలో అయితే బాహుబలి రికార్డును సైతం బద్దలు కొట్టి ఆల్ టైం రికార్డు క్రియేట్ చేయడం విశేషం.

సినిమా విడుదలైన దాదాపు అన్ని ఏరియాల్లో ఈ చిత్రం డిస్ట్రిబ్యూటర్లకు పెట్టుబడి తిరిగి ఇవ్వడంతో పాటు లాభాలు వచ్చేలా చేసింది. అయితే ఇదంతా తెలుగు వెర్షన్ కు సంబంధించిన విషయం. కేరళలో మాత్రం అంచనాలు తలక్రిందులయ్యాయి.

అంచనాలు తప్పాయి

అంచనాలు తప్పాయి

మళయాలం సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని కేరళలోనూ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ సినిమాకు మంచి లాభాలు వస్తాయని ఆశించారు. కానీ ఈ విషయంలో అందరి అంచనాలు తప్పాయి.

చాలా తక్కువ వసూళ్లు

చాలా తక్కువ వసూళ్లు

తొలివారం కేరళలో జనతా గ్యారేజ్ కేవలం రూ. 3.22 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది. అంటే కేవలం 40 శాతం మాత్రమే రికవరీ అయింది. సెకండ్ వీక్ లో థియేటర్లన్నీ వెలవెల పోతున్నాయి. సో ఫస్ట్ వీక్ లో వచ్చిన కలెక్షన్లలో సగం కూడా వచ్చే అవకాశం కనిపించడం లేదు.

బన్నీ బెటర్

బన్నీ బెటర్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు' చిత్రం ఇటీవల కేరళలో ‘యోధవు' పేరుతో రిలీజైంది. ఈ చిత్రం అక్కడ తొలివారం 4.14 కోట్లు వసూలు చేసింది. దీన్ని బట్టి కేరళలో బన్నీ స్టామినా ఏ రేంజిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

కేరళ బిగ్గెస్ట్ స్టార్ నటించినా

కేరళ బిగ్గెస్ట్ స్టార్ నటించినా

అయితే జనతా గ్యారేజ్ చిత్రంలో కేరళ బిగ్గెస్ట్ స్టార్ మోహన్ లాల్ నటించినా.... ‘యోధవు' రికార్డులను అధిగమించక పోవడం గమనార్హం. ఎందుకు ఇలా అయింది? కేరళ జనాలకు ఈ సినిమా నచ్చలేదా? ఇలాంటి మాస్ సినిమాలు అక్కడ పెద్దగా ఆడవా? అనేది అర్థం కావడం లేదు.

నష్టం ఎంత

నష్టం ఎంత

ఫుల్ బిజినెస్ లో టోటల్ వసూళ్లు 5 కోట్లుకు చేరే అవకాశం ఉంది..... ఈ సినిమా కేరళ రైట్స్ రూ. 8 కోట్లకు అమ్మేసారు. అంటే డిస్ట్రిబ్యూటర్ కు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టాలు తప్పవని తేలిపోయింది.

English summary
Janatha Garage has minted only Rs 3.22 gross in Kerala, barely 40% recovery in its first week. The movie might earn at most Rs 2 Cr more in Kerala and it will still remain a loss venture as the film's Kerala rights were pocketed for Rs 8 Cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X