twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Jathi Ratnalu 5 days collections: మిగతా సినిమాలకు చుక్కలు చూపిస్తూ.. సరికొత్త బాక్సాఫీస్ రికార్డ్!

    |

    చిన్న సినిమానే కాదా అని పోటీకి దిగితే ఎఫెక్ట్ తప్పదని చాలా కాలం తరువాత ఋజువయ్యింది. జాతిరత్నాలు సినిమా దెబ్బకు శ్రీకారం, గాలి సంపత్ సినిమాల కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఫాస్టెస్ట్ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెలుతున్న సినిమాగా నిలుస్తోంది. ఇక 5వ రోజు కూడా సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. చూస్తుంటే వీకెండ్ అనంతరం కూడా మంచి వసూళ్లను అందుకునేలా ఉందని అర్ధమయ్యింది.

    తక్కువ థియేటర్స్ లోనే విడుదలైనా..

    తక్కువ థియేటర్స్ లోనే విడుదలైనా..

    వైజయంతి అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ లో రూపొందిన జాతిరత్నాలు సినిమా శివరాత్రి సందర్భంగా మార్చ్ 11న విడుదలైంది. ఒక రకంగా మిగతా సినిమాల కంటే తక్కువ థియేటర్స్ లోనే విడుదల చేశారు. ఇక మొదటి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను టచ్ చేయడంతో సినిమా థియేటర్ల సంఖ్య మరింత పెరిగింది.

    ఓటీటీ ఆఫర్స్ ను లెక్క చేయకుండా

    ఓటీటీ ఆఫర్స్ ను లెక్క చేయకుండా

    నాగ్ అశ్విన్ నిర్మాతగా చేసిన ఈ మొదటి సినిమాకు పిట్టగోడ దర్శకుడు అనుదీప్ దర్శకత్వం వహించాడు. దర్శకత్వ ప్రతిభతో పాటు నవీన్ పొలిశెట్టి నటన కూడా సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. గత ఎడాది విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడడంతో ఇన్నాళ్లు థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు వేయిట్ చేశారు. ఓటీటీ ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా లెక్క చేయలేదు.

    5వ రోజు వచ్చిన షేర్స్

    5వ రోజు వచ్చిన షేర్స్

    జాతిరత్నాలు సినిమాకు 5వ రోజు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. నైజాం 1.44కోట్లు, సీడెడ్ 28లక్షలు, ఉత్తరాంధ్ర 41లక్షలు, ఈస్ట్ 16లక్షలు, వెస్ట్ 12లక్షలు, గుంటూరు 15లక్షలు, కృష్ణ 12లక్షలు, నెల్లూరు 6లక్షలు.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో వచ్చిన మొత్తం షేర్స్ 2.74కోట్లు. గ్రాస్ 4.20కోట్లు

    5రోజుల్లో మొత్తం వచ్చిన కలెక్షన్స్

    5రోజుల్లో మొత్తం వచ్చిన కలెక్షన్స్

    ఇక వరల్డ్ వైడ్ గా 5 రోజుల్లో జాతిరత్నాలు.. శ్రీకారం, గాలి సంపత్ సినిమాలను డామినేట్ చేసి బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసింది. జాతిరత్నాలు 5రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 23.46కోట్ల షేర్స్ ను వసులు చేసింది. గ్రాస్ కలెక్షన్స్ 39కోట్ల వరకు వెళ్లినట్లు సమాచారం. చూస్తుంటే ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ ప్రాఫిట్స్ అందుకున్న సినిమాల్లో జాతిరత్నాలు టాప్ లో ఉండేలా కనిపిస్తోంది.

    ఇప్పటివరకు వచ్చిన లాభం..

    ఇప్పటివరకు వచ్చిన లాభం..

    సినిమాను 10కోట్ల బడ్జెట్ లోపే తెరకెక్కించారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 11.5కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రంగంలోకి దిగింది. ఇక ఇప్పటివరకు అందుకున్న కలెక్షన్స్ తో సినిమా 11.96కోట్ల వరకు ప్రాఫిట్స్ లో ఉంది. చూస్తుంటే ఈ వారం కలెక్షన్స్ డోస్ తో మరిన్ని లాభాలు అందుకునేలా ఉంది. మొత్తంగా సినిమా అయితే 50కోట్ల టార్గెట్ ను ఈజీగా అందుకుంటుందని చెప్పవచ్చు.

    English summary
    It has long been proven that the effect is inevitable if it is a short film or not. Collections of Jathi ratnalu movie debacle and Gaali Sampath movies have fallen badly. It stands as the fastest box office record-breaking movie ever.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X