»   » ఎంత నష్టం?: 'జిల్‌' టోటల్ కలెక్షన్స్....జరిగిన బిజినెస్

ఎంత నష్టం?: 'జిల్‌' టోటల్ కలెక్షన్స్....జరిగిన బిజినెస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : గోపీచంద్‌, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం 'జిల్‌'. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాధాకృష్ణ అనే యువ దర్శకుడు ఈ చిత్రంతో దర్శకుడుగా అరంగ్రేటం చేసారు. మీడియాలో బాగుందని అనిపించే రివ్యూలు వచ్చినా ...కలెక్షన్స్ మాత్రం బాగుండటం నిర్మాతలను నిరాశపరిచాయి. రిలైజైన కొత్తలో మార్కెట్లో మరో సినిమా లేకపోవటం ఈ సినిమాకు ప్లస్ అవుతుందేమో అని భావించారు. అయితే అదీ పెద్దగా కలిసిరాలేదు. ఇది లాస్ వెంచర్ గా ట్రేడ్ వర్గాలు తేల్చాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం టోటల్ కలెక్షన్స్... చేసిన బిజినెస్ జరిగిందో పరిశీలిద్దాం.

అందుతున్న సమచారాన్ని బట్టి ఈ చిత్రం గోపిచంద్ గత చిత్రం లౌక్యం ఎఫెక్టు తో ...జిల్ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగింది. అందులోనూ యువీ క్రియేషన్స్ బ్యానర్ వ్యాల్యూ కూడా కలిసి వచ్చింది. ప్రీ రిలీజ్ థియోటర్ బిజినెస్ 16 కోట్లు అని తెలిసింది. అయితే ఈ చిత్రం కేవలం 12.50 మాత్రమే రెవిన్యూ సాథించింది. దాంతో డిస్ట్రిబ్యూటర్స్ బాగా నష్టపోయారని తెలుస్తోంది.


ఏరియా...కలెక్షన్స్ షేర్


జిల్ టోటల్ కలెక్షన్స్ :
నైజాం -4.40 కోట్లు


సీడెడ్ -1.50 కోట్లు


ఉత్తరాంధ్ర -1.00 కోట్లు


గుంటూరు -0.91 కోట్లు


తూర్పు గోదావరి -0.79 కోట్లు


పశ్చిమగోదావరి -0.60 కోట్లు


కృష్ణా - 0.68 కోట్లు


నెల్లూరు -0.56 కోట్లు
----------------------------
ఆంధ్రప్రదేశ్ & నైజాం- 10.44 కోట్లు
----------------------------
కర్ణాటక - 0.80 కోట్లు


భారత్ లో మిగిలిన ప్రాంతాలు - 0.25


ఓవర్ సీస్ - 1.05
--------------------------------------------
ప్రపంచం వ్యాప్త షేర్ - 12.54 కోట్లు


గమనిక: పైన చెప్పబడిన లెక్కలు కేవలం ట్రేడ్ లో చెప్పబడుతూ, ప్రచారంలో ఉన్నవి మాత్రమే.


Jil Total Collections: A Loss Venture!


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


చిత్రం గురించి...


''ఈ చిత్రానికి 'జిల్‌' అనే పేరు పెట్టడానికి చాలా కారణాలున్నాయి. హీరోయిన్ ని చూడగానే.. హీరోకి హృదయం 'జిల్‌'మంటుంది. హీరోని చూడగానే విలన్ కీ అదే భావన. అందుకే ఆ పేరు పెట్టాం'' అంటున్నారు దర్శకుడు రాధాకృష్ణయ


'ప్రతి ఫైర్‌మెన్‌లోనూ నాకు ఓ హీరో కనిపిస్తాడు. ఎక్కడైనా మంటలు రేగితే... అందరూ పారిపోతారు. కానీ వాళ్లు మాత్రం మంటల్ని వెదుక్కొంటూ వెళ్తారు. అందుకే.. హీరోని ఫైర్‌మెన్‌ చేశాను అన్నారు. 'ప్రేక్షకుల వూహలకు అతీతంగా సాగే సినిమాలంటే నాకిష్టం. నేనూ అలాంటి కథల్ని ఎంచుకొంటా' అంటున్నారు రాధాకృష్ణ.


ఇక... చంద్రశేఖర్‌ యేలేటి గారి దగ్గర నాలుగు సినిమాలకు పనిచేశాను. 'ఒక్కడున్నాడు' సమయంలోనే గోపీచంద్‌ గారికి ఈ కథ చెప్పా. 'బాగుంది.. మనం చేద్దాం' అన్నారు. అప్పటి నుంచీ ఈ కథపైనే దృష్టిపెట్టాను. గోపీచంద్‌ని చాలా స్త్టెలిష్‌గా చూపించావ్‌.. అని అందరూ అంటున్నారు. కథ రాసుకొన్నప్పుడే ఆయన పాత్రని అలా వూహించుకొన్నా అన్నారు.


అలాగే ...'కె.విశ్వనాథ్‌, రాఘవేంద్రరావు, రాజమౌళి, చంద్రశేఖర్‌ యేలేటి నా అభిమాన దర్శకులు. ఓ సినిమా సాంకేతికంగా ఎంత ఉన్నతంగా ఉండాలి అనే విషయాన్ని యేలేటి సార్‌ దగ్గర నేర్చుకొన్నా. స్టార్ హీరోల కోసం కథలు సిద్ధం చేసుకొన్నా' అని అన్నారు.


చిత్రం కథేమిటంటే...


జై(గోపీచంద్) ఓ సిన్సియర్..ఫైర్ ఆఫీసర్. కుటుంబంతో హ్యాపీగా జీవిస్తున్న అతని జీవితంలోకి సావిత్రి(రాసిఖన్నా) వస్తుంది. ఆమెతో సరదా,సరదాగా గడుస్తున్న సమయంలో కథలో ట్విస్ట్ వస్తుంది. ఊహించని విధంగా అండర్ వరల్డ్ డాన్ ఛోటా నాయక్ (కబీర్) ...జై కోసం వెతకటం మొదలెడతాడు. ఎందుకంటే...జై తన ఉద్యోగ భాధ్యతల్లో భాగంగా రంగనాధ్ (బ్రహ్మాజి) అనే వ్యక్తిని ఓ సారి ఫైర్ యాక్సిడెంట్ లో కాపాడే ప్రయత్నం చేస్తాడు.అతనికీ విలన్ వెనక పడటాని కీ లింక్ ఏమిటీ అంటే... ఆ రంగనాథ్ మరెవరో కాదు..ఆ డాన్ దగ్గర నుంచి వెయ్యి కోట్లు డబ్బు కొట్టేసి పారిపోయినవాడు. అయితే మన హీరో రక్షించినప్పుడు ...రంగనాథ్ చివరి క్షణాల్లో మాట్లాడతాడు. దాంతో మన హీరోకు ఆ డబ్బు వివరాలు చెప్పాడని విలన్ కు డౌట్ వస్తుంది. అయితే జై కి ఆ వివరాలు ఏమీ తెలియదు. ఆ విషయాన్ని డాన్ ఎంత చెప్పినా నమ్మడు. అప్పుడేం జరిగింది. డాన్ నుంచి జై ఎలా తప్పించుకున్నాడు. ఆ డబ్బు ఏమైంది వంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


చిత్రంలో చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణ మురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబీ అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.


ఈ చిత్రానికి కాస్ట్యూబ్ డిజైనర్: తోట విజయభాస్కర్, ఆర్ట్ : డైరెక్టర్: ఎఎస్ ప్రకాష్, యాక్షన్: అనల్ అరసు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, శక్తి శరవణన్, మ్యూజిక్: ఘిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.అశోక్ కుమార్ రాజు, ఎన్.సందీప్, ప్రొడ్యూసర్స్: వి.వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, స్టోరీ-స్క్రీన్ ప్లే-డైలాగ్స్-దర్శకత్వం: రాధాకృష్ణ కుమార్

English summary
Pre-release Theatrical Business of 'Jil' is over Rs 16 crore. But, The film has collected just around Rs 12.50 crore before getting replaced by new releases.
Please Wait while comments are loading...