For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ రెమ్యునరేషన్.. RRR రెమ్యునరేషన్.. వామ్మో.. అంత తేడా ఉందా?

  |

  స్టార్ హీరోల కెరీర్ ఎంత సాఫీగా కొనసాగుతుందో కొన్నిసార్లు అంతే కష్టంగా కూడా ఉంటుంది. ఎంత స్టార్ డమ్ వచ్చినా కూడా కొన్ని సార్లు వారికి వచ్చినట్లుగా జీవించలేకపోవచ్చు. ఇక అపజయాలు ఎదురైతే ఒక్కసారిగా ఆ క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా పడిపోతుంది. ఇక పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఉన్నన్ని రోజులు నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలని ప్రతి ఒక్క నటినటుడు ఆలోచిస్తుంటాడు. ప్రస్తుత కాలంలో స్టార్ హీరోలు రెమ్యునరేషన్స్ అయితే ఊహించని విధంగా ఉంటున్నాయి. ఇక టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అగ్రహీరోల సరసన నిలిచే విధంగా అడుగులు వేస్తున్నాడు. స్టార్ హోదాను పెంచుకోవడంలో నందమూరి వంశానికి తగ్గట్టుగానే తాతగారి పేరును నిలబెడుతున్నాడు.

   ఆ మార్కెట్ ఒక్కసారి క్లిక్ అయితే

  ఆ మార్కెట్ ఒక్కసారి క్లిక్ అయితే

  RRR సినిమా ముందు వరకు కూడా జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ విషయంలో అగ్ర హీరోల కంటే కాస్త తక్కువ స్థాయిలోనే అందుకుంటూ వచ్చాడు. ఇక RRR సినిమా తరువాత అతని స్థాయి మరో లెవల్ కి వెళ్లడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా తర్వాత కూడా రాబోయే సినిమాకు కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరపైకి రాబోతున్నాయి. పాన్ ఇండియా మార్కెట్ ఒక్కసారి క్లిక్ అయితే చాలు హీరోలు దర్శకులు ఏ మాత్రం ఆ దారిని మిస్ చేసుకోవద్దని ఫిక్స్ అయ్యారు. తారక్ కూడా అదే తరహాలో ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నాడు.

  మొదటి సినిమా క్లిక్కవ్వకపోవడంతో

  మొదటి సినిమా క్లిక్కవ్వకపోవడంతో

  ఇక రెమ్యునరేషన్ విషయంలో ఈ హీరోకు సంబంధించిన అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ మొదటి సినిమా 'నిన్ను చూడాలని' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా అయితే సక్సెస్ అవ్వలేదు. మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా క్లిక్కవ్వకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ అప్సెట్ అయ్యారని అంతా అనుకున్నారు. కానీ తారక్ దాన్ని చాలా చాలా స్పోర్టివ్ గా తీసుకుని ముందుకు కదిలాడు.

   మొదటి రెమ్యునరేషన్

  మొదటి రెమ్యునరేషన్

  ఇక ఆది నుంచి అతని విజయాలు ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాయి. అయితే అతని రెమ్యునరేషన్ స్థాయి ఎంత పెరిగినా కూడా మొదటి సినిమాకు అతనికి వచ్చిన రెమ్యునేషన్ ని మాత్రం ఎన్నడూ మర్చిపోడట. ఆ సినిమాకి అతనికి వచ్చిన పారితోషికం కేవలం నాలుగు లక్షలు మాత్రమే. మొదట్లో జూనియర్ ఎన్టీఆర్ ఆ 4లక్షలను ఎంతో జాగ్రత్తగా దాచుకున్నాడట. మొదటిసారి అంత డబ్బు చూసేసరికి ఎన్టీఆర్ కు వాటిని ఎలా దోచుకోవాలో కొన్ని రోజుల వరకు అస్సలు అర్థం అయ్యేది కాలేదట. ఇక ఫైనల్ గా తన తల్లికి డబ్బును ఇచ్చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పాడు.

  RRR రెమ్యునరేషన్

  RRR రెమ్యునరేషన్

  ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ RRR సినిమాకు ఎంత తీసుకుంటున్నాడు తెలిస్తే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. RRR సినిమాకు మొత్తంగా జూనియర్ ఎన్టీఆర్ 60 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నాడు అని ఒక టాక్ అయితే వస్తోంది. ఆ తర్వాత చేయబోయే సినిమాలకు కూడా అదే రేంజ్ లో రెమ్యునరేషన్ అడిగినట్లు సమాచారం.

  RRR First Single Dosti Song Review | Filmibeat Telugu
  బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా..

  బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా..

  ఇక నాలుగు లక్షలకు చూసే ఒకప్పుడు ఎంతగానో ఉప్పొంగిపోయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అంటే ఏ స్థాయికి ఎదిగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతనికి బ్యాక్ గ్రౌండ్ ఎంత ఉన్నా కూడా తన సొంత టాలెంట్ తోనే అభిమానుల మనసు గెలుచుకున్నాడు అని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కమర్షియల్ సినిమాలను పక్కన పెట్టి విభిన్నమైన సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. ఇంకా RRR సినిమా అనంతరం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక యాక్షన్ సినిమాని మొదలు పెట్టనున్నాడు.

  English summary
  Jr ntr first movie remuneration and RRR movie remuneration difference,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X