»   » జై లవకుశలో ఎన్టీఆర్ అద్భుతం.. రాంచరణ్.. సౌత్‌లో యంగ్ టైగర్ ఒకే ఒక్కడు

జై లవకుశలో ఎన్టీఆర్ అద్భుతం.. రాంచరణ్.. సౌత్‌లో యంగ్ టైగర్ ఒకే ఒక్కడు

Written By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  వరుస విజయాలతో దూసుకెళ్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలెక్షన్ల పరంగా ఓవర్సీస్, లోకల్ అనే తేడా లేకుండా రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జై లవకుశలో ఎన్టీఆర్ నటనపై మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రశంసలు కురిపించడం చర్చనీయాంశమైంది. జై లవకుశకు సంబంధించి గత 10 రోజుల వసూళ్లు ట్రేడ్ అనలిస్టులను షాక్ గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 50.56 కోట్ల రూపాయల షేర్ సాధించిన చిత్రంగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. గత పదిరోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

  ఎన్టీఆర్‌కు రాంచరణ్ ప్రశంస

  ఎన్టీఆర్‌కు రాంచరణ్ ప్రశంస

  సినీ హీరోల అభిమానుల మధ్య ఎలాంటి విభేదాలు ఉన్నా తమ మధ్య మరోసారి ఎలాంటి పొరపొచ్చాలు లేవని నిరూపించారు ఎన్టీఆర్, రాంచరణ్. జై లవకుశ చిత్రాన్ని చూసిన రాంచరణ్.. ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించారు. జై పాత్ర తనను యంగ్ టైగర్ అద్భుతంగా చేశాడని రాంచరణ్ పేర్కొన్నారు. ఈ చిత్రం చూసిన తర్వాత రాంచరణ్, ఎన్టీఆర్ ఫొటోలు దిగారు. ఆ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా అది వైరల్‌గా మారింది.

  10 రోజు కలెక్షన్లు సూపర్

  10 రోజు కలెక్షన్లు సూపర్

  కలెక్షన్ల విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్‌కు ప్రేక్షకులు బ్రహ్మరధంపడుతున్నారు. పదవ రోజున జై లవకుశ చిత్రం నైజాంలో 50 లక్షలు, సీడెడ్‌లో 50 లక్షలు, ఉత్తరాంధ్రలో 36 లక్షలు, తూర్పు గోదావరిలో 16 లక్షలు, పశ్చిమ గోదావరిలో 11 లక్షలు, కృష్ణాలో 19 లక్షలు, గుంటూరు 23 లక్షలు, నెల్లూరు 10 లక్షల రూపాయలను వసూలు చేసింది.

   130 కోట్లు గ్రాస్

  130 కోట్లు గ్రాస్

  తొలుత డివైడ్ టాక్‌ను సొంతం చేసుకొన్న జై లవకుశ వారాంతంలో పుంజుకొన్నది. పండుగ సెలవుల నేపథ్యంలో ఈ చిత్రానికి కలెక్షన్ల పంట పండింది. దీంతో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల్లో కలిపి 50.56 కోట్లుగా నమోదైంది. సోమ, ఆదివారాలు కూడా సెలవు రోజులగా ఉండటంతో మరింత కలెక్షన్ల రాబట్టే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

  యూఎస్‌లో 1.5 మిలియన్స్

  యూఎస్‌లో 1.5 మిలియన్స్

  అమెరికాలో కూడా జై లవకుశ చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్ము లేపుతున్నది. సెప్టెంబర్ 21న రిలీజైన ఈ చిత్రం 1.5 మిలియన్ల మార్క్‌ను దాటేసింది. ఈ కలెక్షన్లు ఓవర్సీస్ మార్కెట్‌లో యంగ్ టైగర్ స్టామినాకు అద్దం పడుతున్నాయి.

  ఎన్టీఆర్ అరుదైన రికార్డు..

  ఎన్టీఆర్ అరుదైన రికార్డు..

  అమెరికాలో యంగ్ టైగర్ రికార్డు బ్రహ్మండంగా నమోదవుతున్నది. అమెరికాలో వరుసగా మూడుసార్లు 1.5 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసిన ధక్షిణాది సినీ పరిశ్రమలో ఒకే ఒక హీరోగా నిలిచాడు. గతంలో నాన్నకు ప్రేమతో 2 మిలియన్ డాలర్లు, జనతా గ్యారేజ్ 1.8 మిలియన్ డాలర్లు, తాజాగా జై లవకుశ 1.5 మిలియన్ డాలర్లు వసూలు చేసింది.

  English summary
  Jr. NTR’s Jai Lava Kusa has emerged as a blockbuster and having already grossed over Rs 130 crore, the film has won over audiences from all quarters. The latest person to fall in love with the film is none other than Ram Charan and the Magadheera star couldn’t stop gushing about the film. After he recently watched the film, Ram Charan called Jr NTR and congratulated him on delivering another memorable film.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more