For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'జులాయి' ఫస్ట్ డే కలెక్షన్స్

  By Srikanya
  |

  హైదరాబాద్: అల్లు అర్జున్, ఇలియానా కాంబినేషన్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న రొమాంటిక్ ఎంటర్టనర్ 'జులాయి'. మొన్న గురువారం రిలీజ్ అయిన మొదటి రోజు ఈ చిత్రం వరల్డ్ వైజ్ గా 11 కోట్లు(గ్రాస్) వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో 2.5 కోట్లు(గ్రాస్)వచ్చింది. నైజాం ఏకియాలో 2.5 కోట్లు వసూలు చేసిందని ఓ ఇంగ్లీష్ దిన పత్రికకు తెలియచేసారు. అలాగే చెన్నై లో 30 దియోటర్స్ లో రిలీజ్ చేసారని,85 % వసూలు చేసిందని రాసుకొచ్చారు.

  ''హీరోగా నేనేం చేసినా... ఎంత పేరు తెచ్చుకొన్నా కేవలం అది దర్శకుల వల్లే. సినిమా అనేది సమష్టి కృషే అయినా... దర్శకుడి కష్టమే ఎక్కువ. 'జులాయి' విషయంలో కూడా త్రివిక్రమ్‌ ఎంతో శ్రమించారు''అని చెప్పారు అల్లు అర్జున్‌. ఇక తానిప్పటివరకు నటించిన చిత్రాలన్నింటికీ తొలిరోజు డివైడ్‌ టాక్‌ వచ్చిందని, ఏరోజైనా సినిమా హిట్‌ అన్న స్పందన మొదటి రోజు వినాలని ఎదురుచూశానని, ఆ బాధను జులాయి చిత్రం తీర్చిందని అల్లు అర్జున్‌ అన్నారు.

  ''ఈ రోజే ప్రేక్షకుల మధ్య కూర్చుని సినిమా చూశా. చాలా బాగుంది''అని దేవిశ్రీ ప్రసాద్‌ చెప్పారు. మలయాళంలో ఈనెల 17న విడుదల చేయనున్నామని, త్వరలో ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక కూడా జరుపుతామని, ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని నిర్మాతలు డివివి.దానయ్య, రాధాకృష్ణ తెలిపారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్‌, సోనుసూద్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌.

  ''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్‌ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్‌ శైలి సంభాషణలు, అర్జున్‌ నృత్యాలు అలరిస్తాయి''అన్నారు నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ. అలాగే... జీవితాన్ని ఆస్వాదించడం ఎలాగో చాలామందికి తెలీదు. పరుగులు తీసే వయసులో చదువు, ఉద్యోగం.. అంటూ ముందర కాళ్లకు బంధమేసుకొంటారు. అన్నీ అందాక... ఇక పరిగెట్టే ఓపిక ఉండదు. అందుకే జోష్‌ ఉన్నప్పుడే జల్సా చేయాలి... అన్నది ఆ కుర్రాడి సిద్ధాంతం. జులాయి, దేశముదురు అని పిలుస్తారేమో అన్న బెంగలేదు. ఈ బిరుదులుంటేనే అమ్మాయిలు సులభంగా ప్రేమలో పడిపోతారనేది అతని నమ్మకం. అదే నిజమైంది. ఓ అందాల భామ ఈ జులాయికి మనసిచ్చేసింది. ఆ తరవాత ఏం జరిగిందో తెరపైనే చూడాలి.

  English summary
  Allu Arjun's Julayi has garnered hit talk in all the centers and trade reports say that the movie's 1st day collections have created a new record in the actor's career. Reports say that the Trivikram-directed film's one day (first day) worldwide collections were around 11 crores (gross) and 6.32 crores (share) in Andhra Pradesh. These are the highest collections in Allu Arjun's career and official sources confirm that only Nizam area has registered around 2.5 crores collections on the opening day of the release.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X