»   » బాక్సాఫీస్ రిపోర్ట్: ‘కబాలి’ ఫస్ట్ డే కలెక్షన్

బాక్సాఫీస్ రిపోర్ట్: ‘కబాలి’ ఫస్ట్ డే కలెక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రజనీకాంత్ నటించిన 'కబాలి' మూవీ శుక్రవారం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజై బాక్సాపీసు వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. తమిళంతో పాటు తెలుగు, హిందీతో పాటు మరికొన్ని బాషల్లో కూడా సినిమా రిలీజైంది. శుక్రవారం సౌతిండియాలోని థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.

సినిమా ఎలా ఉంది? అనే సంగతి పక్కన పెడితే విడుదల ముందు నుండే భారీ హైప్ ఉండటం, సినిమాకు ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకోవడానికి నిర్మాతలు వరల్డ్ వైడ్ దాదాపు 4500 స్క్రీన్లలో రిలీజ్ చేయడం, అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగడంతో ఓపెనింగ్స్ పరంగా కలిసొచ్చింది. ఫస్ట్ డే బిజినెస్ అంచనాలను దాటిపోయింది.


'కబాలి' మూవీ తొలి రోజు వరల్డ్ వైడ్ ఇప్పటి వరకు వచ్చిన అన్నిఇండియన్ సినిమాల రికార్డులను బద్దలు కొట్టింది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా అందరి అంచనాలను మించి పోయింది. ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ ఇండియన్ సినిమా ఓపెనర్ గా రికార్డు క్రియేట్ చేసింది.


తొలి రోజు కబాలి వరల్డ్ వైడ్ రూ. 40 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా. రజనీకాంత్ సినిమాల్లో తొలి రోజు ఇంత పెద్ద మొత్తం వసూలు చేయడం ఇదే తొలిసారి. కబాలి కలెక్షన్ల గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ స్పందిస్తూ కబాలి (తెలుగు, తమిళం) ప్రీమియర్ షోల ద్వారా కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది. యూఎస్ఏ-కెనడాలో $ 1,925,379 [రూ 12.93 కోట్ల] వసూలు చేసింది. సూపర్బ్ అంటూ ట్వీట్ చేసారు.


స్లైడ్ షోలో మరిన్ని వివరాలు...


హైప్, భారీ బిజినెస్

హైప్, భారీ బిజినెస్

రూ. 100 కోట్ల బడ్జెట్ తో ‘కబాలి' సినిమాను తెరకెక్కించారు. రిలీజ్ ముందే థియేట్రికల్ రైట్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్నీకలిపి రూ. 225 కోట్లకు అమ్ముడు పోయాయి.


రిలీజ్ తర్వాత

రిలీజ్ తర్వాత

అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత పరస్థితి పూర్తిగా మారింది. సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.


డౌటే

డౌటే

సినిమా విడుదల ముందు హైప్ చూసి ఫుల్ రన్ లో రూ. 500 కోట్లు వసూలు చేస్తుందని భావించారు. అయితే రిలీజ్ తర్వాత సినిమాపై ఉన్న హైప్ ఒక్కసారిగా పడిపోయింది.


వారం తర్వాతే...

వారం తర్వాతే...

తొలి వారం రోజులు సినిమాకు కీలకం. ఈ గ్యాపులో సినిమా వసూలు చేసే దాన్ని బట్టే లాభనష్టాలు అంచనా వేయడానికి వీలుంటుంది.


English summary
Rajinikanth's star power has worked big time as "Kabali" has got an earth-shattering opening. The Tamil movie made a record-breaking collection at the box office on its first day.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu