twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bimbisara 5 Days Collections: మళ్లీ పెరిగిన వసూళ్లు.. లాభమే అన్ని కోట్లు.. 3వ స్థానంలో బింబిసార

    |

    తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబం ఎంతో ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. దానికి కారణం నందమూరి తారక రామారావు అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తర్వాత అదే ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చారు. అందులో బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత గుర్తింపును అందుకుంది కల్యాణ్ రామ్ ఒక్కడే.

    Recommended Video

    బింబిసార బాక్స్ ఆఫీస్ గెలుపుకు ప్రజల పొగడ్తలే బహుమానాలు *Entertainment | Telugu OneIndia

    చాలా కాలం క్రితమే హీరోగా పరిచయమైన అతడు.. కొన్ని విజయాలను మాత్రమే అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవలే 'బింబిసార' అనే సినిమాను చేశాడు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో 'బింబిసార' 5వ రోజు కలెక్షన్లు మరింత పెరిగాయి. మరి ఈ మూవీ బాక్సాఫీస్ రిపోర్టును చూద్దామా!

     బింబిసారగా కల్యాణ్ రామ్ సందడి

    బింబిసారగా కల్యాణ్ రామ్ సందడి

    నందమూరి కల్యాణ్ రామ్ - మల్లిడి వశిష్ట కలయికలో వచ్చిన సినిమానే ‘బింబిసార'. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ చిత్రాన్ని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు.

    Bigg Boss 6: షోలోకి ముగ్గురు యాంకర్లు.. లీకైన కంటెస్టెంట్ల పేర్లు.. తెలుగు భామలకు లక్కీ ఛాన్స్Bigg Boss 6: షోలోకి ముగ్గురు యాంకర్లు.. లీకైన కంటెస్టెంట్ల పేర్లు.. తెలుగు భామలకు లక్కీ ఛాన్స్

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

    నందమూరి కల్యాణ్ రామ్ మార్కెట్‌ ప్రకారమే ‘బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్ల బిజినెస్ జరిగింది.

    ఐదో రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    ఐదో రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?

    ఆంధ్ర, తెలంగాణలో ‘బింబిసార' మూవీకి 5వ రోజూ వసూళ్లు పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 90 లక్షలు, సీడెడ్‌లో రూ. 62 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 37 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 15 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 12 లక్షలు, గుంటూరులో రూ. 15 లక్షలు, కృష్ణాలో రూ. 13 లక్షలు, నెల్లూరులో రూ. 8 లక్షలతో కలిపి రూ. 2.52 కోట్లు షేర్, రూ. 4.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

    బిగ్ బాస్ దివి పరువాల విందు: వామ్మో ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే!బిగ్ బాస్ దివి పరువాల విందు: వామ్మో ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే!

    5 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    5 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

    ‘బింబిసార' మూవీకి 5 రోజులకి కలిపి భారీ వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 7.45 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.58 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.98 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.31 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 96 లక్షలు, గుంటూరులో రూ. 1.57 కోట్లు, కృష్ణాలో రూ. 1.13 కోట్లు, నెల్లూరులో రూ. 64 లక్షలతో కలిపి రూ. 20.62 కోట్లు షేర్‌, రూ. 28.20 కోట్లు గ్రాస్ వచ్చింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

    5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రూ. 20.62 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.65 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 23.62 కోట్లు షేర్‌తో పాటు రూ. 39.00 కోట్లు గ్రాస్ వచ్చింది.

    పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

    టైం ట్రావెల్ కథతో వచ్చిన ‘బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 5 రోజుల్లోనే దీనికి రూ. 23.62 కోట్లు వచ్చాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 7.42 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

    మూడో స్థానానికి చేరిన బింబిసార

    మూడో స్థానానికి చేరిన బింబిసార

    ‘బింబిసార' మూవీకి 5వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 2.52 కోట్లు వసూలు అయ్యాయి. దీంతో 5వ రోజు ఎక్కువ వసూలు చేసిన టైర్ 2 హీరోల చిత్రాల్లో ఇది మూడో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో విజయ్ దేవరకొండ ‘గీతా గోవిందం' మూవీ రూ. 4.66 కోట్లతో మొదటి స్థానంలో, నాని ‘ఎంసీఏ' చిత్రం రూ. 3.51 కోట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాయి.

    English summary
    Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Collect 23.62 Cr in 5 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X