For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bimbisara 8 Days Collections: కలిసొచ్చిన హాలీడే.. 8వ రోజు వసూళ్లు డబుల్.. లాభమెంతో తెలిస్తే!

  |

  నందమూరి కల్యాణ్ రామ్.. తెలుగు సినీ ప్రియులకు అస్సలు పరిచయం చేయనవసరం లేని పేరిది. అంతలా అతడు దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోగా, నిర్మాతగా టాలీవుడ్‌లో హవాను చూపిస్తూ దూసుకుపోతోన్నాడు. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే కల్యాణ్ రామ్ 'బింబిసార' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన స్పందన వస్తోంది. ఫలితంగా కలెక్షన్లు పోటెత్తాయి. ఈ క్రమంలోనే 8వ రోజు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో 'బింబిసార' 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

   బింబిసారగా వచ్చిన కల్యాణ్ రామ్

  బింబిసారగా వచ్చిన కల్యాణ్ రామ్

  నందమూరి కల్యాణ్ రామ్ - మల్లిడి వశిష్ట కలయికలో వచ్చిన చిత్రమే 'బింబిసార'. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలను పోషించారు. కీరవాణి దీనికి సంగీతం అందించారు. టైమ్ ట్రావెల్ కథతో వచ్చిన ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు.

  ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

  బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్

  బింబిసార మూవీ బిజినెస్ డీటేల్స్


  కల్యాణ్ రామ్ మార్కెట్‌‌‌, అంచనాల ప్రకారం 'బింబిసార' మూవీకి నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 6.50 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా రెండు రాష్ట్రాల్లో రూ. 13.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1 కోట్లతో కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

   8వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?

  8వ రోజు ఎక్కడ? ఎంత వచ్చింది?


  'బింబిసార' మూవీకి 8వ రోజు ఏపీ, తెలంగాణలో వసూళ్లు డబుల్ అయ్యాయి. ఫలితంగా నైజాంలో రూ. 36 లక్షలు, సీడెడ్‌లో రూ. 31 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 23 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 1.13 కోట్లు షేర్, రూ. 1.80 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

  రష్మిక మందన్నా హాట్ సెల్ఫీ వైరల్: ఈ పిక్‌లో ఆమెను చూస్తే తట్టుకోలేరు

  8 రోజులకు కలిపి ఎంత వచ్చింది?

  8 రోజులకు కలిపి ఎంత వచ్చింది?


  8 రోజులకి కలిపి 'బింబిసార' మూవీకి వసూళ్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 8.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 5.30 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 3.50 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.48 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 1.09 కోట్లు, గుంటూరులో రూ. 1.72 కోట్లు, కృష్ణాలో రూ. 1.25 కోట్లు, నెల్లూరులో రూ. 71 లక్షలతో కలిపి రూ. 23.45 కోట్లు షేర్‌, రూ. 36.85 కోట్లు గ్రాస్ వచ్చింది.

   ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది

  ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చింది


  ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 8 రోజుల్లో రూ. 23.45 కోట్లు కొల్లగొట్టిన కల్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.53 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 1.87 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే ఎనిమిది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 26.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 44.4 కోట్లు గ్రాస్ వచ్చింది.

  Karthikeya 2 Twitter Review: నిఖిల్ మూవీకి అలాంటి టాక్.. బాహుబలి తర్వాత ఇదే.. క్లైమాక్స్ మాత్రం!

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. లాభం ఎంత?


  టైం ట్రావెల్ కథతో వచ్చిన 'బింబిసార' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 15.60 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 16.20 కోట్లుగా నమోదైంది. ఇక, 8 రోజుల్లోనే దీనికి రూ. 26.85 కోట్లు వచ్చాయి. అంటే దీనికి క్లీన్ హిట్ స్టేటస్‌తో పాటు రూ. 10.65 కోట్లు లాభాలు కూడా సొంతం అయ్యాయి.

  కలిసొచ్చిన హాలీడే.. వసూళ్లు డబుల్

  కలిసొచ్చిన హాలీడే.. వసూళ్లు డబుల్


  'బింబిసార' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి ఏడవ రోజు కేవలం రూ. 63 లక్షలు మాత్రమే వసూలు అయిన విషయం తెలిసిందే. అయితే, ఎనిమిదో రోజు రాఖీ పండుగ సెలవు ఉండడంతో ఈ సినిమాకు ఆదరణ రెట్టింపు అయిపోయింది. ఫలితంగా యాభై శాతం కంటే ఎక్కువ పెరిగి 8వ రోజు రూ. 1.13 కోట్లు వచ్చాయి. దీంతో దీనికి లాభాలూ భారీగా పెరిగిపోయాయి.

  English summary
  Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. This Movie Collect 26.85 Cr in 8 Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X