For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bimbisara Business: బింబిసారాకు ఊహించని బిజినెస్.. అన్ని కోట్లు వస్తేనే కల్యాణ్ రామ్‌కు హిట్

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. దీనికి కారణం ఆ కుటుంబం నుంచి ఎన్టీఆర్ తర్వాత చాలా మంది హీరోలుగా పరిచయం అవడమే. అంతేకాదు, అందులో చాలా మంది స్టార్లుగా సత్తా చాటుతున్నారు కూడా. ఇలా బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తర్వాత సక్సెస్ అయిన వాళ్లలో కల్యాణ్ రామ్ ఒకడు. సుదీర్ఘ కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో సందడి చేస్తోన్న ఈ నందమూరి హీరో.. ఇప్పుడు 'బింబిసారా' అనే చిత్రంతో రాబోతున్నాడు. భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ చిత్రంపై అందరూ దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో అసలు కల్యాణ్ రామ్ సినిమా ఎంత బిజినెస్ చేసుకుంది? ఎన్ని కోట్లు వస్తే ఇది హిట్ అవుతుంది? అనేవి చూద్దాం పదండి!

  బింబిసారాగా వస్తున్న కల్యాణ్ రామ్

  బింబిసారాగా వస్తున్న కల్యాణ్ రామ్

  సరైన హిట్ కోసం వేచి చూస్తోన్న కల్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రమే 'బింబిసారా'. మల్లిడి వశిష్ట అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమాను నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ నిర్మించాడు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో కేథరిన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు చేశారు.

  దీప్తి సునైనాకు బిగ్ బాస్ కంటెస్టెంట్ ముద్దులు: నీ ప్రవర్తన ఏంటి అంటూ వీడియో వదిలి మరీ!

   అలాంటి స్టోరీ... తొలిసారి ఆ జోనర్‌

  అలాంటి స్టోరీ... తొలిసారి ఆ జోనర్‌


  నందమూరి కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన 'బింబిసారా' మూవీ సోషియో ఫాంటసీ జోనర్‌లో రాబోతుంది. బింబిసారుడు అనే క్రూరమైన రాజు.. టైం ట్రావెల్ చేసి ప్రస్తుత కాలానికి రావడం.. ఇక్కడి పరిస్థితులు చూసి ఆయనలో పరివర్తన రావడం.. ఆ తర్వాత ఆయన రాజ్యంలో ఎలాంటి పరిపాలన చేశాడు అనే నేపథ్యంతో ఈ సినిమా రూపొందింది.

  ప్రమోషన్స్ షురూ.. యమ సందడి

  ప్రమోషన్స్ షురూ.. యమ సందడి


  కల్యాణ్ రామ్ - మల్లిడి వశిష్ట కాంబినేషన్‌లో రూపొందిన ఈ మూవీ విడుదలకు సమయం దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసేసింది. ఇప్పటికే చాలా ఈవెంట్లు చేసింది. అలాగే, ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలు కూడా చేసుకున్నారు. ఇక, గురువారం సాయంత్రమే అమెరికాలో ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  విచిత్రమైన డ్రెస్‌లో జాన్వీ కపూర్ రచ్చ: వామ్మో మరీ ఇంత దారుణమా!

  అందరి ఆశలు ఈ సినిమా మీదే

  అందరి ఆశలు ఈ సినిమా మీదే


  ఈ ఏడాది తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దగా సక్సెస్‌లు రావడం లేదు. జనవరి నుంచి జూలై వరకూ ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కేవలం నాలుగు తెలుగు సినిమాలు మాత్రమే క్లీన్ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా జూలైలో వచ్చిన భారీ చిత్రాలన్నీ డిజాస్టర్‌గా మిగిలాయి. దీంతో సినీ ప్రియులతో పాటు బాక్సాఫీస్ పెద్దలు బింబిసారిపై ఆశలు పెట్టుకున్నారు.

   ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా

  ఏపీ, తెలంగాణలో బిజినెస్ ఇలా


  కల్యాణ్ రామ్ 'బింబిసారా' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని విధంగా తక్కువగానే బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. నైజాంలో రూ. 5 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో కలిపి రూ. 6.50 కోట్ల బిజినెస్ జరిగింది. అంటే.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కలుపుకుని మొత్తంగా రూ. 13.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది.

  మేకప్ రూంలో తెలుగు హీరోయిన్ హాట్ ట్రీట్: ఆ పార్ట్‌లను హైలైట్ చేస్తూ!

   ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

  ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ ఇలా

  నందమూరి కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసారా' మూవీ థియేట్రికల్ హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు ఏరియాల్లోనూ తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. దీంతో ఓవర్సీస్‌లో ఈ మూవీకి రూ. 1 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.10 కోట్లు బిజినెస్ జరిగినట్లు తెలిసింది. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి మొత్తంగా రూ. 15.60 కోట్లు బిజినెస్ జరిగింది.

  అన్ని కోట్లు వస్తేనే సినిమా హిట్

  అన్ని కోట్లు వస్తేనే సినిమా హిట్


  కొంత కాలంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్దగా హిట్లు రావట్లేదు. దీంతో కల్యాణ్ రామ్ నటించిన 'బింబిసారా' చిత్రానికి ఆశించిన రీతిలో బిజినెస్ జరగలేదనే చెప్పాలి. ఇక, ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 15.60 కోట్లు బిజినెస్ జరుపుకుంది. దీంతో ఈ సినిమా క్లీన్ హిట్ అవ్వాలంటే రూ. 16.20 కోట్లు వసూలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

  English summary
  Nandamuri Kalyan Ram Now Did Bimbisara Movie Under Mallidi Vashist Direction. Lets Know This Movie Pre Release Business Details.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X