»   » ఫైనల్ గా 'కళ్యాణ్ రామ్ కత్తి' పరిస్దితి ఏమైంది?

ఫైనల్ గా 'కళ్యాణ్ రామ్ కత్తి' పరిస్దితి ఏమైంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

టైటిల్ వివాదంతో పబ్లిసిటీ తెచ్చుకున్న కళ్యాణ్ రామ్ కత్తి చివరకు పత్తా లేకుండా పోయింది. విడుదలై వారం కూడా కాకముందే అప్పుడే ధియోటర్స్ వెలాతెలా పోయాయి. మొదటి రోజు యావరేజ్ అని టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం వారాంతరంలో కూడా కలెక్షన్స్ ను రప్పించుకోలేకపోయింది. కల్యాణ్ రామ్ వరస ఫ్లాప్ లు ఈ చిత్రం కలెక్షన్స్ డ్రాప్ కు కారణమంటున్నారు. బాగా పాత కథ, కథనం ఈ చిత్రాన్ని సగం దెబ్బతీస్తే, మిగతా సగం పోస్టర్స్ నాశనం చేసాయని విశ్లేషిస్తున్నారు. పోస్టర్స్ పై యాక్షన్ సీక్వెన్స్ అన్నట్లు కళ్యాణ్ రామ్ రెండు చేతుల్లో రెండు పెద్ద పెద్ద కత్తులు పట్టుకున్నట్లు వేసారు. తీరా ధియోటర్ లోకి వెళ్తే ఫక్తు సెంటిమెంట్ చిత్రానికి యాక్షన్ పూత పూసారు. ఇక హీరోయిన్ సనాఖాన్ కూడా ఈ చిత్రానికి మరో మైనస్ గా మారిందని విసుక్కుంటున్నారు. దర్శకుడు మల్లి యాభైల నాటి కథకి ఎనభైల నాటి ట్రీట్మెంట్ ఇచ్చాడని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. సిద్దార్ద బావ చిత్రానికి కళ్యాణ్ రామ్ కత్తికి పెద్ద తేడా లేదంటున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu