»   »  'ఓం' 3D కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

'ఓం' 3D కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రెండేళ్ల గ్యాప్ తర్వాత కళ్యాణ్ రామ్ రొటీన్ కు భిన్నంగా కొత్త లుక్ తోపాటు 3D టెక్నాలజీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సునీల్ రెడ్డి దర్శకత్వంలో తొలి యాక్షన్ 3డీ చిత్రంగా రూపొందిన 'ఓం' చిత్రం మొన్న శుక్రవారం (జూలై 19) విడుదలైంది. హాలీవుడ్ లో అవతార్, ఫైనల్ డెస్టినేషన్ లాంటి చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేయడం, విడుదలకు ముందే ప్రమోషన్ తో సినీ అభిమానుల్లో 'ఓం' చిత్రం అంచనాలు పెంచింది. అయితే అంచనాలు అందుకోలేకపోయింది.


టెక్నికల్ గా చిత్రం బాగుందని టాక్ తెచ్చుకున్నా...ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విఫలమైంది. రిలీజ్ రోజు మార్నింగ్ షోకే నెగిటివ్ టాక్ తెచ్చుకోవటంతో కలెక్షన్స్ పై కూడా ఆ ప్రభావం పడింది. దానికి తోడు ఎడతెగని వర్షాలు కూడా దెబ్బ కొట్టాయి. వీకెండ్ రెండు రోజులూ మల్టి ప్లెక్స్ లు, 3డి థియోటర్స్ లో కలెక్షన్ బాగానే ఉన్నా మిగతా చోట్ల పూర్తిగా డ్రాప్ అయ్యాయని ట్రేడ్ వర్గాల సమాచారం.


పూర్తి రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రంలో లెక్కకు మించి మలుపులు, ట్విస్ట్ లు ప్రేక్షకుడిని కన్ ఫ్యూజ్ కు గురి చేశాయి. అనేక ట్విస్ట్ల్ లతో అసలేం ఏం జరుగుతోంది అనే సందేహం ప్రేక్షకుల్లో కలుగడం జరిగింది. పాతకాలం నాటి కథకు 3డీ టెక్నాలజీని జోడించాలనే దర్శకుడి ఆలోచన ఉపయోగం లేకుండా చేసింది. కథలో దమ్ము లేకపోవడం, పేలవమైన స్క్రీన్ ప్లేతో దర్శకుడు బోర్ కొట్టించాడు.

అసలు ఇలాంటి కథను ఎంచుకోని 3డీ చిత్రంగా రూపొదించడమే పెద్ద సాహసం అని అంతటా విమర్శలు వినిపించాయి. సరియైన ప్లానింగ్ లేకపోవడంతో నిర్మాత, దర్శకుల సాహసం బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలింది. దానికి తోడు నటనకు స్కోప్ ఉన్న పాత్రలు లభించినా.. అందిన అవకాశాన్ని నిలబెట్టుకోవడంలో ఇద్దరు హీరోయిన్లు విఫలమయ్యారు. అటు గ్లామర్ పరంగానూ,ఇటు నటనా పరంగానూ వారు పనికిరాకుండా పోయారు. అయితే కొత్తదనం చూపించాలన్న కళ్యాణ్ రామ్ తాపత్రయాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం.

English summary

 Kalyan Ram’s OM 3D Movie result
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu