Don't Miss!
- News
ప్యాకేజీ స్టార్ దేశభక్తి ఇది.. రిపబ్లిక్ డే సాక్షిగా మళ్ళీ దొరికిన పవన్ కళ్యాణ్!!
- Finance
world economy: ప్రపంచ దేశాల ఆర్థిక ర్యాంకుల్లో మనమెక్కడ ?
- Sports
INDvsNZ : తొలి టీ20లో గిల్ ఆడతాడు.. పృథ్వీ షాకు ఛాన్స్ లేదు: హార్దిక్ పాండ్యా
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Technology
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Vikram 300 కోట్లు.. నా అప్పులన్ని తీర్చేస్తా.. మరికొన్ని దానాలు.. కమల్ హాసన్ షాకింగ్ కామెంట్స్
విశ్వనటుడు కమల్ హాసన్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద విక్రమ్ సినిమాలో సరికొత్త సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. అసలు ఆయన ఈ స్థాయిలో సక్సెస్ సాధిస్తారు అని ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే గతంలో కమల్ ఎలాంటి సినిమా చేసినా కూడా కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి తీసుకు రాలేదు. ముఖ్యంగా తెలుగులో అయితే ఆయన పూర్తిగా మార్కెట్ పై పట్టు కోల్పోవాల్సి వచ్చింది. అయితే విక్రమ్ సినిమాతో మాత్రం మళ్ళీ అంతకంటే ఎక్కువ స్థాయిలో మార్కెట్ ను సంపాదించుకున్నాడు..ఇక సక్సెస్ అందుకున్న సందర్భంగా కమల్ హాసన్ ఇటీవల కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు..

అత్యధిక కలెక్షన్స్
లోకేష్ కనగరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద దాదాపు 300 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. తెలుగులో కూడా ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి కంటే డబుల్ ప్రొఫైల్ వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. కమల్ హాసన్ చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

విలువైన బహుమతులు
అయితే ఈ సినిమా సాధించిన విజయంతో కమల్ హాసన్ ఇప్పటికే దర్శకుడికి 60 లక్షల విలువైన ఒక లగ్జరీ కారును కూడా బహుమానంగా ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించిన మరొక నటుడు సూర్య కోసం 40 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ ను కానుకగా ఇచ్చాడు. ఇక ఈ సినిమాకు పనిచేసిన సహాయ దర్శకులకి అలాగే మరికొంత మంది టెక్నీషియన్స్ కు కూడా ఖరీదైన కానుకలను ఇచ్చారు.

ఆర్థికంగా కూడా..
విక్రమ్ సినిమా విజయానందాన్ని కమల్ హాసన్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు అనే చెప్పాలి. విడుదలైన రెండు వారాల్లోనే సినిమా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా కమల్ హాసన్ ఇబ్బందుల్లో ఉన్నట్లు ఆ మధ్యకాలంలో టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాతో ఆయన మళ్ళీ హ్యాపీ గా ఆర్థికంగా నిలదొక్కుకున్నారు అని చెప్పవచ్చు.

ఎవరు నా మాట నమ్మలేదు
అయితే చెన్నైలో ఇటీవల రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలి అంటే డబ్బు కోసం ఆలోచించని నాయకుడిని ఎన్నుకోవాలి అని గతంలో నేను 300 కోట్లు సంపాదిస్తారు అంటే ఎవరు నా మాటను కొంచెం కూడా నమ్మలేదు. కానీ ఈ సినిమాతో నా మాట నిజమైందిని అన్నారు.
Recommended Video


అప్పులన్ని తీర్చేస్తా
ఇక విక్రమ్ సినిమా విజయంతో నా అప్పులన్నీ కూడా తీర్చేస్తాను అంటూ వీలైతే నా సన్నిహితులకు నా చేతనైనంత సహాయం కూడా చేస్తాను అని ఒకవేళ నా దగ్గర డబ్బులు అయిపోతే మొహమాటం లేకుండా ఇవ్వడానికి ఏం లేదని కూడా చెప్పేస్తానని అన్నారు. అలాగే సహాయం చేయడానికి ఇతరుల నుంచి అప్పు చేసి ఇవ్వడానికి నా మనసు ఒప్పుకోదు అంటూ.. నాకు గొప్ప పేరు ఏమి వద్దని జీవితాంతం కూడా ఒక మనిషి మనిషి గా ఉండాలనుకుంటున్నానని కమల్ హాసన్ తెలియజేశారు