Don't Miss!
- News
ఆర్థిక వ్యవస్థ గుట్టుమట్లు బహిర్గతం- కీలక సర్వే: ఇంకొన్ని గంటల్లో..!!
- Sports
INDvsNZ: టీమిండియాకు సంప్రదాయ వెల్ కమ్.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ
- Finance
it news: TCS రికార్డుల మోత.. 22 కంపెనీలను వెనక్కి నెట్టి అగ్రస్థానం కైవసం
- Automobiles
ఎట్టకేలకు హైరైడర్ CNG విడుదల చేసిన టయోటా.. ధర ఎంతంటే?
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Vikram 27 Days Collections: 27వ రోజూ షాకింగ్ కలెక్షన్స్.. విక్రమ్‌కు లాభం ఎన్ని కోట్లో తెలిస్తే!
విలక్షణమైన నటన, విభిన్నమై చిత్రాలతో దాదాపు నలభై ఏళ్లుగా సినీ ప్రియులను అలరిస్తూ సౌతిండియాలోనే బడా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు విశ్వనాయకుడు కమల్ హాసన్. సుదీర్ఘ కాలంగా భారతీయ సినిమాపై తనదైన ముద్రను వేసిన ఆయన.. కొన్నేళ్లుగా ఒక్కటంటే ఒక్క హిట్‌ను కూడా అందుకోలేకపోయారు. దీంతో ఈ సారి ఎలాగైనా భారీ సక్సెస్‌ను కొట్టాలన్న పట్టుదలతో 'విక్రమ్' అనే సినిమాలో నటించారు. మాస్ యాక్షన్ మూవీగా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన దీనికి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఫలితంగా ఇది ఆరంభం నుంచే కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో 'విక్రమ్' 27 రోజుల్లో ఎంత వసూలు చేసిందో మీరే చూడండి!

విక్రమ్‌గా కమల్ హాసన్ విశ్వరూపం
కమల్ హాసన్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీనే 'విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రల్లో కనిపించి సందడి చేశారు. ఇక, ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.
Jr NTR: గొప్ప మనసు చాటుకున్న ఎన్టీఆర్.. నేరుగా అభిమానికి ఫోన్.. మొబైల్ నెంబర్ వైరల్

భారీ స్థాయిలోనే సినిమా బిజినెస్
క్రేజీ కాంబోలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'విక్రమ్' మూవీకి తమిళం సహా పలు ఏరియాల్లో రూ. 93 కోట్ల వరకూ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉండడంతో ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 7 కోట్లకు హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 100 కోట్ల మేర బిజినెస్‌ను జరుపుకుంది.

27వ రోజు ఎక్కడ? ఎంతొచ్చింది?
మిగిలిన ప్రాంతాల మాదిరిగానే 'విక్రమ్' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మంచి టాక్ వచ్చింది. ఫలితంగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన దక్కింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా అత్యధికంగా వస్తున్నాయి. దీంతో రెండు వారల్లోనే లాభాల బాటను అందుకుంది. ఈ నేపథ్యంలో 27వ రోజు మాత్రం దీనికి రూ. 10 లక్షలు కలెక్ట్ అయ్యాయి.
హాట్ షోలో హద్దు దాటిన దీపికా పదుకొనె: ఆమెనిలా చూసి తట్టుకోవడం కష్టమే!

27 రోజులకూ కలిపి ఎంతొచ్చింది
ఆంధ్రా,
తెలంగాణలో
27
రోజుల్లోనూ
'విక్రమ్'
భారీగా
రాబట్టింది.
ఫలితంగా
నైజాంలో
రూ.
7.05
కోట్లు,
సీడెడ్‌లో
రూ.
2.24
కోట్లు,
ఉత్తరాంధ్రలో
రూ.
2.43
కోట్లు,
ఈస్ట్
గోదావరిలో
రూ.
1.27
కోట్లు,
వెస్ట్
గోదావరిలో
రూ.
84
లక్షలు,
గుంటూరులో
రూ.
1.16
కోట్లు,
కృష్ణాలో
రూ.
1.37
కోట్లు,
నెల్లూరులో
రూ.
60
లక్షలతో..
రెండు
రాష్ట్రాల్లో
రూ.
16.96
కోట్లు
షేర్,
రూ.
29.70
కోట్లు
గ్రాస్
దక్కింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిందిలా
తెలుగు
రాష్ట్రాల్లో
27
రోజుల్లో
రూ.
16.96
కోట్లు
కొల్లగొట్టిన
'విక్రమ్'
ప్రపంచ
వ్యాప్తంగానూ
సత్తా
చాటింది.
దీంతో
కర్నాటక
ప్లస్
రెస్టాఫ్
ఇండియా,
ఓవర్సీస్,
హిందీ
తమిళనాడులో
కలిపి
ఈ
సినిమా
27వ
రోజు
రూ.
90
లక్షలు
షేర్‌ను
రాబట్టింది.
వీటితో
కలిపి
27
రోజుల్లోనే
ప్రపంచ
వ్యాప్తంగా
కమల్
సినిమాకు
రూ.
196.20
కోట్లు
షేర్‌తో
పాటు
రూ.
395
కోట్లు
గ్రాస్
వసూలైంది.
హీరోయిన్ దారుణమైన ఫొటో వదిలిన వర్మ: ఆమె బాడీలో ఏ పార్ట్ బాలేదు అంటూ!

బిజినెస్ టార్గెట్.. లాభం ఎంత?
'విక్రమ్' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్లు మేర బిజినెస్ జరిగింది. అందులో తెలుగులో నితిన్ దీన్ని రూ. 7 కోట్లకు కొన్నాడు. ఇక, ఈ సినిమాకు 27 రోజుల్లోనే రూ. 196.20 కోట్లు వచ్చాయి. అంటే రూ. 95.20 కోట్లు వరకూ లాభాలొచ్చాయి. అలాగే, తెలుగులో రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 16.86 కోట్లు రావడంతో అప్పుడే దీనికి రూ. 9.46 కోట్లు ప్రాఫిట్ వచ్చేసింది.