»   » ‘దడ’ను డామినేట్ చేస్తూ కలెక్షన్స్ కురిపిస్తున్న కందిరీగ...’

‘దడ’ను డామినేట్ చేస్తూ కలెక్షన్స్ కురిపిస్తున్న కందిరీగ...’

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత వారం నాగ చైతన్య దడ, రామ్ కందిరీగ రిలీజ్ తో ధియేటర్లు సందడిగానే ఉన్నాయి. దడ గత గురువారం విడుదల కాగ, కందిరీగ శుక్రవారం రిలీజ్ అయ్యింది. వరుసగా 4 రోజులు సెలవలు ఉండటంతో రెండు సినిమాలకి ఓపెనింగ్ కలెక్షన్స్ బాగానే వచ్చాయి. రెండిటిలోనూ కథ రొటీనే. అయితే దడ నెగిటివ్ టాక్ తో సాగుతుండటంతో కందిరీగ వీకెండ్ అయిపోయిన తరువాత కూడా మంచి కలెక్షన్స్ సంపాదిస్తుంది.

అయితే ఈ రెండు సినిమాలలో కామన్ ఫ్యాక్టర్ ఒకటుంది. రెండు సినిమాలలోనూ హీరోయిన్లుకు బ్యాడ్ టాక్ ఉంది. దడ లో కాజల్, కందిరీగలో హన్సిక అంత అందంగా కనిపించలేదు. ఓవరాల్ గా కొన్ని వారాలుగా నిస్తేజంగా ఉనా తెలుగు ప్రేక్షకులకు ఈ రెండు సినిమాలు కాస్త ఊపు తెచ్చాయి. వీటి హవా మొదలవడంతో కాంచన, రంగం, నాన్న డబ్బింగ్ సినిమాల జోరు తగ్గింది. ఇక ఈ శుక్రవారం సంతోష్ సివన్ దర్శకత్వం వహించిన “ఉరిమి", మిస్టర్ రాస్కెల్, ముగ్గురు అనే సినిమాలు విడుదల అవుతున్నాయి.

English summary
The Tollywood Box-office will see three releases this week. Naga Chaitanya’s movie Dhada which is competing with another young star Ram’s movie Kandireega is currently leading the race with more screening across the state. Ram new film Kandireega is declared like a big hit in A, B centers and overseas. This movie is mainly directed at mass and family audience has hit the bull’s eye.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu