twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Kantara 16 days collections దేశవ్యాప్తంగా కంతారా కలెక్షన్ల వేట.. 150 కోట్ల క్లబ్‌లోకి రిషబ్ శెట్టి!

    |

    కన్నడ బాక్సాఫీస్‌ను గత 15 రోజులుగా కుదిపేస్తున్న కంతారా చిత్రం ఇక తన సత్తాను చాటేందుకు ఇండియన్ బాక్సాఫీస్‌పై కన్నేసింది. హిందీలో 14 అక్టోబర్, తెలుగులో 15 అక్టోబర్‌న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే కన్నడలో రికార్డు వసూళ్లను సాధించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొనేందుకు సిద్ధమైంది. ఈ సినిమా గత 15 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు, అలాగే 16వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

     కేజీఎఫ్2, RRR తర్వాత భారీగా

    కేజీఎఫ్2, RRR తర్వాత భారీగా

    కంతారా చిత్రం గత 13 రోజులుగా కన్నడ వెర్షన్‌కు, కన్నడ సినిమా పరిశ్రమకే పరిమితమైంది. ఈ చిత్రానికి అన్ని భాషల ప్రేక్షకుల నుంచి భారీ డిమాండ్ ఏర్పడటంతో పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇండియావైడ్‌గా ఈ చిత్రాన్ని 2500 స్క్రీన్లలో రిలీజ్ చేయడం విశేషంగా మారింది. కేజీఎఫ్2, RRR హిందీ వెర్షన్ల తర్వాత భారీగా రిలీజైన మూడో చిత్రంగా కంతారా రికార్డు క్రియేట్ చేసింది.

     హిందీలో తొలి రోజు..

    హిందీలో తొలి రోజు..

    కన్నడ వెర్షన్, హిందీ వెర్షన్ కంతారా తొలి రోజు భారీగానే వసూళ్లను రాబట్టింది. తొలి రోజు ఈ చిత్రం 1.30 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. 1.2 కోట్లు వసూలు చేసింది. 70 లక్షలు మల్టీ‌ప్లెక్స్‌లో, 50 లక్షలు సింగిల్ స్క్రీన్స్‌లో వసూలు చేసింది. హిందీలో కేజీఎఫ్2 కన్నడ వెర్షన్‌లో 1.50 కోట్లు రాబట్టింది.

    దేశవ్యాప్తంగా రెండు వారాల్లో

    దేశవ్యాప్తంగా రెండు వారాల్లో

    కంతారా దేశవ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి వారం ఈ చిత్రం 30.3 కోట్ల షేర్ సాధించింది. కర్ణాటకలో 30.3 కోట్ల షేర్ నమోదు చేసింది. ఇక రెండోవారం ముగింపుకు వచ్చేసరికి ఈ చిత్రం 42.3 కోట్ల షేర్, 72 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

    15వ రోజు దేశవ్యాప్తంగా

    15వ రోజు దేశవ్యాప్తంగా

    కంతారా 15వ రోజులు బాక్సాఫీస్ జర్నీ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు కన్నడ వెర్షన్‌లోనే ప్రేక్షకులను మెప్పించింది. 15 రోజు నుంచి దేశవ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం 5.46 కోట్ల షేర్, 12 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. కన్నడలో 4.26, హిందీలో 1.2 కోట్ల కలెక్షన్లను నమోదు చేసింది. దీంతో ఈ సినిమా రెండోవారం 42.3 కోట్ల షేర్.. 130 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

    16వ రోజు ఆక్యుపెన్సీ ఇలా..

    16వ రోజు ఆక్యుపెన్సీ ఇలా..

    కన్నడలో కంతారా చిత్రం భారీ ఆక్యుపెన్సీని నమోదు చేసింది. బెంగళూరు, మంగళూరు, గుల్బర్గా, మైసూర్, శివమొగ్గలో 50 శాతానికిపైగా వసూళ్లు, ఈ సినిమా నేపథ్యంగా రూపొందిన ప్రాంతం కుందపుర, మణిపాల్‌లో 90శాతం అక్యుపెన్సీ నమోదు చేసింది. ఇక హిందీలో పలు ప్రాంతాల్లో 20 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తెలుగులో కూడా పలు ప్రాంతాల్లో 35 శాతం వరకు ఆక్యుపెన్సీ కనిపించింది.

    ప్రపంచవ్యాప్తంగా 16వ రోజు అంచనా

    ప్రపంచవ్యాప్తంగా 16వ రోజు అంచనా

    ఇక కంతారా 16వ రోజు అంటే శుక్రవారం అక్టోబర్ 15వ తేదీ విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా 9 కోట్ల షేర్, 16 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టవచ్చని ట్రేడ్ అనలిస్టులు అంచనావేస్తున్నారు. దీంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా 87 కోట్ల షేర్, 150 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

    English summary
    Kannada Star Hero Rishabh Shetty's Kantara movie getting super response in Kannada. Here is the Worldwide box office report after 16 days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X