»   » 'డిక్టేటర్' కు కర్ణాటక లో ఊహించని దెబ్బ

'డిక్టేటర్' కు కర్ణాటక లో ఊహించని దెబ్బ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రేపు అంటే జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలకృష్ణ సినిమా 'డిక్టేటర్'. ఈ చిత్రం భారీగా రిలీజ్ చేయటానికి ఓ ప్రక్కన ఏర్పాట్లు చేస్తూంటే... కర్ణాటకలో మాత్రం ఓ రేంజిలో దెబ్బ తగిలినట్లు సమాచారం.ఎగ్రిమెంట్ చేసుకున్న కర్ణాటక డిస్ట్రిబ్యూటర్ ఒకరు చివరి నిముషంలో ధియోటర్స్ దొరికే అవకాసం లేదని చేతులు ఎత్తేసారని తెలుస్తోంది.

దాంతో నిర్మాతలు ఈరోస్ వారే స్వయంగా రంగంలోకి దిగి అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట కర్ణాటకలో కుమార్ ఫిల్మ్స్ వారు చేస్తానన్నారు..తర్వాత కాదంటే ఎస్ ఎల్ వి మూవీ మేకర్స్ వారు చేస్తామన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ ప్రక్కకు తప్పుకోవటంతో ఈరోస్ వారే సీన్ లోకి వచ్చి చేస్తున్నారు.


సంక్రాతి బరిలో నాలుగు తెలుగు సినిమాలు బరిలో ఉన్నాయి. అవి నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్నినాయనా, అండ్.. ఎక్స్ ప్రెస్ రాజా. ఆల్రెడీ ఈ నాలుగుమూవీల ట్రైలర్స్, ప్రోమోస్ పబ్లిక్ లోకి వచ్చి క్రేజ్ తెచ్చేసాయి. వీటిలో నాన్నకు ప్రేమతో సినిమాకే ఎక్కు డిమాండ్ ఉంది.


Karnanataka distributors ditched Dictator

బాలయ్యబాబు డిక్టేటర్ మూవీకి బి,సీ సెంటర్లలో బాగా డిమాండ్ కనిపిస్తోందట. మొత్తానికి డిక్టేటర్ తో పాటు జనవరి13, 14, 15 తేదీల్లో వరుసగా నాన్నకు ప్రేమతో, ఎక్స్ ప్రెస్ రాజా, సోగ్గాడే చిన్ని నాయనా, సినిమాలు రిలీజ్ అవుతుండటంతో ఆడియెన్స్ తోపాటు బాక్సాఫీస్ కూడా యమా ఖుషీగా ఉండబోతుందన్నమాట.


బాలకృష్ణ మాట్లాడుతూ...ఎప్పుడూ నా సినిమాలే నాకు పోటీ అని భావిస్తుంటాను. నాకు మరెవ్వరూ పోటీ కాదు. నేను బతికున్నంతవరకు సినిమాలు చేస్తూనే ఉంటా. నా వారసత్వంగా నా కొడుకు కూడా సినిమాలు చేస్తాడు, అన్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన ‘డిక్టేటర్‌' పాటల విజయోత్సవం సందర్బంగా చెప్పిన మాటలు ఇవి.

English summary
One of the distributors ditched Dictator in the last minute and Eros International will release on its own in Karnataka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu