twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'వూపిరి' రిజల్ట్ ట్విస్ట్: ప్లాఫా.. కార్తీ గోలెత్తిపోతున్నాడు?, మహేష్ మాట్లాడాడు

    By Srikanya
    |

    హైదరాబాద్: అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్లుగా మారిందిట కార్తి పరిస్దితి. తన క్యారక్టర్, చిత్రం కాన్సెప్టు విని ఖచ్చితంగా ఈ సినిమా తమిళంలో ఊపుతుందని భావించాడు కార్తీ. అయితే అక్కడ మార్నింగ్ షో నుంచి నెగిటివ్ టాక్ నడుస్తోంది. యావరేజ్ సినిమా అన్నట్లు ట్రేడ్ లో అన్నారు.

    అయితే ఒక రోజు గడిచేసరికి తమిళ వెర్షన్ ఓవర్ సీస్ లో ఫ్లాఫ్ అని తేల్చి చేప్పేసారు. ఇది విని కార్తి ఖంగుతిన్నాడట. తెలుగు ఆడియన్స్ కు నచ్చినట్లు, తమిళ ఆడియన్స్ అసలు నచ్చలేదట. ముఖ్యంగా డబ్బింగ్ కుదరలేదని అంటున్నారు. కార్తీ మనకు అలవాటు పడి క్రేజ్ తెచ్చుకున్నట్లుగా నాగ్ కు అక్కడ క్రేజ్ లేకపోవటం కూడా మరో కారణం అంటున్నారు.

    నేను తప్పు అని నిరూపించాడు: 'ఊపిరి'పై రాజమౌళి కామెంట్నేను తప్పు అని నిరూపించాడు: 'ఊపిరి'పై రాజమౌళి కామెంట్

    దీంతో కార్తీ కు ఈ సిట్యువేషన్ అర్దం కావటంలేదని చెప్తున్నారు. రెండు చోట్లా వేరు వేరు రిజల్ట్ లు రావటం, అదీ తను వరస ఫ్లాఫ్ ల నుంచి ఈ సినిమాతో బయిట పడతానని భావించే ఏరియాలో నెగిటివ్ టాక్ రావటం భాధాకరంగా ఉందని చెప్తున్నారు. దీనికి భిన్నంగా కార్తీకు తెలుగులో మంచి ప్రశంసలు వచ్చాయి.

    తెలుగు వెర్షన్ కు మాత్రం దీనికి భిన్నంగా సూపర్ హిట్ టాక్ నడుస్తోంది. వీకెండ్స్ ఫ్యామిలీలతో హౌస్ ఫుల్స్ అయ్యాయి. ఓవర్ సీస్ లో కూడా మనం చిత్రాన్ని బీట్ అవుట్ చేసే అవకాసం ఉందని అంటున్నారు. నాగార్జున అయితే ఈ సినిమా విషయమై చాలా ఆనందంగా ఉన్నారు.

    Oopiri Photo Gallery

    పీవీపి పతాకంపై నాగార్జున, కార్తీ, తమన్నా ముఖ్య తారలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పరమ్ వి.పొట్లూరి, కెవిన్ అన్నే నిర్మించిన చిత్రం 'ఊపిరి'. ఈ చిత్రం ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. సినిమాకు ప్రశంసలు లభిస్తున్న నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు.

    ఈ నేపధ్యంలో కార్తీ, నాగార్జున, నిర్మాతలు పివీపి వారు మీడియాతో మాట్లాడారు..వారు మాట్లాడింది స్లైడ్ షో లో చూడండి....

    అదే నిజమైంది

    అదే నిజమైంది

    ‘‘మేమంతా ప్రేమతో చేసిన సినిమా ‘వూపిరి'. సెట్లో ఉన్నప్పుడే ‘ఈ సినిమా ట్రెండ్‌ను సృష్టించేలా కాకుండా నా జీవితాన్ని మార్చేసే సినిమా అవుతుంది'అని అనుకొన్నా. ఇప్పుడదే నిజమైంది'' అన్నారు నాగార్జున.

    ఎదుదెబ్బలే

    ఎదుదెబ్బలే

    నాగార్జున మాట్లాడుతూ... ‘‘ఇమేజ్‌ను నమ్ముకొని సినిమా చేసిన ప్రతిసారీ ఎదురు దెబ్బలే తినాల్సి వచ్చింది. ఇమేజ్‌ను నమ్ముకొని సినిమాలు చేస్తే చేసిన కథలే మళ్లీ మళ్లీ చేయాల్సి వస్తుంది. నా కథలు నాకే బోర్‌ కొట్టేవి. ఇప్పుడు నా ప్రయాణం చాలా బాగుంది.

    మహేష్ 20 నిముషాలు

    మహేష్ 20 నిముషాలు

    ‘వూపిరి' చూసిన చాలామంది ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. మహేష్‌బాబు 20 నిమిషాలు మాట్లాడాడు. ‘ఇక నేనేం చూపించాలి?' అని నవ్వుతూ అడిగాడు.

    ఇంట్లో అందరికీ

    ఇంట్లో అందరికీ

    అమల, నాగచైతన్య, అఖిల్‌కూ సినిమా చాలా బాగా నచ్చింది అన్నారు నాగార్జున.

    అందుకే ఇంత పెద్ద సక్సెస్...

    అందుకే ఇంత పెద్ద సక్సెస్...

    కార్తికీ, నాకూ మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యం. అది పండితేనే సినిమా అనుకొన్నా. నిజంగా మా ఇద్దరి మధ్య సన్నివేశాలు చాలా బాగా కుదిరాయి. అందుకే ఇంత పెద్ద విజయం'' అన్నారు.

    ఫీలవలేదు..

    ఫీలవలేదు..

    ఈ సినిమాలో మీకన్నా కార్తీ పాత్రకే స్పాన్ ఎక్కువ ఉందని చాలా మంది అన్నారు.అయినా అలా ఫీలవ్వడానికి కార్తీ ఎవరో కాదు. నా తమ్ముడే కదా. నిజంగా మా ఇద్దరి మధ్యా అలాంటి అనుబంధం ఉంది కాబట్టే సినిమాలో మా మధ్య కెమిస్ట్రీ వర్కవుట్ అయింది.

    ఆ జాబితాలో

    ఆ జాబితాలో

    ఎంతకాలం ఇమేజ్‌ను పట్టుకుని వేలాడతాం.'గీతాంజలి', 'శివ' చిత్రాల జాబితాలో 'ఊపిరి' ఉంటుంది'' అని చెప్పారు.

    కార్తి మాట్లాడుతూ...

    కార్తి మాట్లాడుతూ...

    తమిళనాడులో మొదట ఈ సినిమాని ఎవరూ అంత సీరియస్‌గా తీసుకోలేదు. ఇప్పుడు సినిమాని చూసి ఆస్వాదిస్తున్నారు.

    నిజాయితీ...

    నిజాయితీ...

    80వ దశకంలో వచ్చిన సినిమాల్లోని భావోద్వేగాలు, నిజాయతీ ఈ సినిమాలో కనిపించిందని అంటున్నారు. ఈ సినిమాని ఒక స్ఫూర్తిగా తీసుకొంటున్నా అని కార్తీ అన్నారు.

    ఆ స్దాయి

    ఆ స్దాయి

    అలాగే ‘బాహుబలి' తర్వాత మరో ట్రెండ్‌ని సృష్టించిన సినిమా ‘వూపిరి'నే అనుకోవచ్చు'' అని కార్తి చెప్పుకొచ్చారు.

    వదిన ఫోన్ చేసింది..

    వదిన ఫోన్ చేసింది..

    ''మా వదిన (జ్యోతిక) ఇంతకు ముందే ఫోన్ చేసి, నన్ను అభినందించారు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని ఆమె అన్నారు'' అని కార్తీ చెప్పారు. '

    వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ...

    వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ...

    ‘‘మాకు ‘వూపిరి' విజయం అందించిందనడం కంటే గౌరవం తెచ్చిపెట్టిందంటా. ఈ సినిమా చూశాక నాకు ఫోన్‌ చేయని దర్శకులు లేరు, హీరోలు లేరు అన్నారు.

    మొదట భయపడ్డా

    మొదట భయపడ్డా

    సినిమా చేస్తున్నప్పుడే ఈ సినిమాను జాగ్రత్తగా తీస్తే క్లాసిక్‌ అవుతుందన్నారు నాగార్జున. ఆయన నమ్మకం చూసి మొదట భయపడ్డాను అన్నారు దర్శకుడు.

    బాలచందర్ ...

    బాలచందర్ ...

    తమిళనాడులోనూ సినిమాకి మంచి స్పందన లభిస్తోంది. బాలచందర్‌గారి సినిమాలు చూసిన అనుభూతి కలిగిందంటున్నారు ప్రేక్షకులు. కానీ అంత గొప్ప ప్రశంసకి నేను అర్హుడిని కాదు. మనసు పెట్టి ఒక మంచి సినిమాని తీశాం'' అన్నారు వంశీ.

    నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ....

    నిర్మాత ప్రసాద్‌ వి.పొట్లూరి మాట్లాడుతూ....

    ‘‘రెండేళ్ల ప్రయాణం విజయవంతంగా ముగిసింది. బృందమంతా కలిసి ఒక ల్యాండ్‌మార్క్‌ సినిమాకి పనిచేశాం అన్నారు.

    ఆ సంస్దలతో పోలిక

    ఆ సంస్దలతో పోలిక

    ''విజయా వాహిని సంస్థకు 'మాయాబజార్', జగపతి సంస్థకు 'దసరా బుల్లోడు' ఎలానో మీ సంస్థకు 'ఊపిరి' అలా అని ఒక వ్యక్తి నాకు మెసేజ్ చేశారు. అది మాకు దక్కిన గొప్ప ప్రశంసగా భావిస్తున్నాఅన్నారు ప్రసాద్‌ వి.పొట్లూరి.

    గొప్ప గౌరవం..

    గొప్ప గౌరవం..

    ‘వూపిరి' సినిమానే పరిశ్రమకి తొలి విజయం కాదు, ఇదే చివరి విజయమూ కాదు. కానీ ఈ సినిమాతో ఒక గొప్ప గౌరవం దక్కింది. ‘వూపిరి'కి ముందు, తర్వాత అని మాట్లాడుకొనేలా ఈ సినిమా ఉంది'' అని నిర్మాత చెప్పుకొచ్చారు.

    English summary
    Tamil audience didn’t like Oopiri that much as Telugu audience. Tamil version Thozha response is poor and will not recover expenses also in some locations in overseas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X