»   » 'కాటమరాయుడు' : షోలు రద్దు...ఫ్యాన్స్ నిరసన, స్వల్ప లాఠీ ఛార్జి

'కాటమరాయుడు' : షోలు రద్దు...ఫ్యాన్స్ నిరసన, స్వల్ప లాఠీ ఛార్జి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన 'కాటమరాయుడు' సినిమా మ‌రికొన్ని గంట‌ల్లో అభిమానుల‌కు క‌నుల విందు చేయ‌టానికి రెడీ అయ్యిపోయింది. కాట‌మ‌రాయుడు బెనిఫిట్ షో చూసేందుకు అభిమానులు ఓ రేంజిలో ఎగ్జైట్ అవుతున్నారు. అయితే హైదరాబాద్ అభిమానులుకు మాత్రం నిరాశే ఎదురైంది.

'కాటమరాయుడు' చిత్రం మిడ్ నైట్ షోలకు హైదరాబాద్ పోలీసులు ఫర్మిషన్ ఇవ్వలేదు. ధియోటర్స్ వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు పోగు అవటం, హంగామా..ఇబ్బందిగా మారతాయని చివరి నిముషంలో ... ఈ బెనిఫిట్ షోల రద్దు నిర్ణయం తీసుకుని ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా ఎందుకు బెనిఫిట్ షోలు రద్దు చేసారని తెలపలేదు.

katamarayudu

ఇక ఈ స్పెషల్ షోలు హైదరాబాద్ లోని కూకట్ పల్లిలోని భ్రమరాంభ-మల్లికార్జున.. మూసాపేటలోని శ్రీరాములు,ఎర్రగడ్డ గోకుల్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 35 ఎంఎం థియేటర్లలో బెనిఫిట్ షో ప్లాన్ చేసారు. దీంతో ఎంత రేటు పెట్టైనా స్పెషల్ షో చూడాలనుకున్న అభిమానులు ఈ ధియోటర్స్ వద్ద వెయిట్ చేస్తున్నారు.

అయితే చివరి నిముషంలో పోలీస్ ఫర్మిషన్ రాకపోవటంతో, షోలు కాన్సిల్ కావటంతో అభిమానులు నిరాశతో పోలీస్ లకు వ్యతిరేకంగా, పవన్ కు అనుకూలంగా స్లోగన్స్ చేసారు. తమ నిరసన వ్యక్తం చేస్తూ...రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు కొందరు వీరాభిమానులు. దాంతో స్పవలంగా లాఠీ ఛార్జీ చేసి పరిస్దితి యధాస్దితికి తెచ్చి, ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు సమాచారం అందుతోంది.

ఇదిలా ఉంటే మరో ప్రక్క పొరుగు రాష్ట్రమైన బెంగళూరులో పదుల సంఖ్యలో 'కాటమరాయడు' బెనిఫిట్ షోలు పడుతున్నాయి. తమిళనాడులోని చెన్నైలో సైతం పెద్ద ఎత్తున్న ఫ్యాన్స్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే చిన్న చిన్న టౌన్లు మొదలుకుని పెద్ద సిటీల వరకు అన్ని చోట్లా బెనిఫిట్ షోలు పడుతున్నాయి. కానీ తెలంగాణలో మాత్రం బెనిఫిట్ షోల కాన్సిల్ అవటంతో అబిమానులు నిరాస చెందుతున్నారు .

English summary
The benefit shows of Pawan Kalyan's Katamarayudu have been cancelled in Hyderabad. Police have denied permission to the midnight shows of the film that triggered panic outside theatres as large number of fans gathered.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu