KGF Chapter 2 Collections.. 500 కోట్ల క్లబ్‌కు చేరువగా రాకీ భాయ్.. బాహుబలి2 రికార్డుపై కన్నేసిన ప్రశాంత్ నీల్

సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన కేజీఎఫ్2 చిత్రం హిందీ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్నది. విడుదలైన మొదటి రోజు నుంచే ఆల్‌టైమ్ రికార్డులతో హోరెత్తిస్తున్న ఈ చిత్రం సరికొత్తగా మరో మైలురాయిని దాటింది. త్వరలోనే ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని క్రియేట్ చేయడానికి సిద్దమవుతున్నది. హిందీ వెర్షన్ కేజీఎఫ్2 సినిమా రికార్డులు, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

1100 కోట్ల క్లబ్‌పై నజర్

1100 కోట్ల క్లబ్‌పై నజర్


KGF2 మూవీ బాలీవుడ్‌లో వసూళ్ల పరంగా పరుగులు పెడుతున్నది. కేవలం మూడు వారాల్లోనే 1000 కోట్ల రూపాయలను సాధించింది. అయితే ఈ సినిమా నిలకడగా కలెక్షన్లను వసూలు చేస్తుండటంతో RRR చిత్రం కలెక్షన్లను అధిగమించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల రూపాయల కలెక్షన్లను నమోదు చేసే అవకాశం ఉంది.

హిందీలో 400 కోట్ల క్లబ్‌లోకి

హిందీలో 400 కోట్ల క్లబ్‌లోకి

KGF Chapter 2 హిందీ వెర్షన్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి వారంలో 268.63 కోట్లు, రెండోవారంలో 80.18 కోట్లు, మూడో వారంలో 49.14 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 397.95 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా రికార్డును సొంతం చేసుకొన్నది. త్వరలోనే ఈ సినిమా 400 కోట్ల వసూళ్లను సాధించే అవకాశం ఉంది.

23 రోజున కలెక్షన్లు

23 రోజున కలెక్షన్లు

KGF Chapter 2 చిత్రం నాలుగో వారంలో కూడా భారీ కలెక్షన్లను నమోదు చేసింది. 22వ రోజున 6.30 కోట్లు రాబట్టిన ఈ చిత్రం 23 రోజున 5 కోట్ల వరకు వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం 401 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. అయితే హాలీవుడ్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ 2 చిత్రాన్ని కూడా ఎదుర్కొని మంచి కలెక్షన్లను రాబట్టడం విశేషంగా మారింది.

500 కోట్ల క్లబ్‌పై దృష్టి

500 కోట్ల క్లబ్‌పై దృష్టి

KGF Chapter 2 మూవీ బాక్సాఫీస్ జైత్రయాత్ర ఇలాగే కొనసాగితే.. మరికొన్ని రోజుల్లో ఈ చిత్రం 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం ఉంది. కన్నడ డబ్బింగ్ చిత్రంగా రూపొందిన కేజీఫ్2 ఈ రేంజ్ కలెక్షన్లను సాధించడం ఓ రికార్డుగా మారింది.

బాహుబలి రికార్డుపై గురి

బాహుబలి రికార్డుపై గురి

బాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా బాహుబలి2 ఉంది. గతంలో బాహుబలి చిత్రం 511 కోట్ల రూపాయలను వసూలు చేసి నంబర్‌వన్ స్థానంలో నిలిచింది. అయితే ఈ కలెక్షన్లను అధిగమిస్తుందా లేదా అనే విషయం హిందీ ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. అయితే బాలీవుడ్‌లో భారీ చిత్రాల రిలీజ్‌లు లేవు కనుక.. ఈ సినిమా 500 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశం స్పష్టంగా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X