twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF 13 Days Collections: కేజీఎఫ్‌కు భారీ దెబ్బ.. రిలీజ్ తర్వాత తొలిసారి.. టోటల్ కలెక్షన్లు ఎంతంటే!

    |

    కన్నడ చిత్ర పరిశ్రమలో రూపొంది.. దేశంలోని చాలా భాషల్లో విడుదలై.. అన్ని చోట్లా భారీ స్థాయిలో స్పందనను దక్కించుకుని సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రమే 'కేజీఎఫ్ చాప్టర్ 1'. శాండిల్‌వుడ్ స్టార్ హీరో యశ్ - టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో వచ్చిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపించి.. కలెక్షన్లతో పాటు అవార్డులనూ సొంతం చేసుకుంది.

    దీంతో ఆ ఉత్సాహంతోనే దీనికి సీక్వెల్‌గా 'కేజీఎఫ్ చాప్టర్ 2'ను రూపొందించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ఆరంభం నుంచే మంచి రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా కలెక్షన్ల వర్షం కురుస్తోంది. అయితే, మంగళవారం దీనికి భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో 'కేజీఎఫ్ చాప్టర్ 2' 13 రోజుల్లో ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

    రాఖీ భాయ్ ఎంట్రీతో రచ్చ రచ్చే

    రాఖీ భాయ్ ఎంట్రీతో రచ్చ రచ్చే

    రాకింగ్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రమే చిత్రమే'KGF Chapter 2'. ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. ఇందులో విలన్‌గా సంజయ్ దత్ నటించారు. శ్రీనిధి శెట్టి ఇందులో హీరోయిన్‌గా చేసింది. రవి బస్రూర్ సంగీతాన్ని అందించాడు. రవీనా టాండన్ కీలక పాత్రలో కనిపించారు.

    Bigg Boss Non Stop: బాత్రూంలో చూశా నీవి తగ్గిపోయాయి.. బిందుపై అఖిల్ కామెంట్స్‌.. బయటపెట్టిన నాగ్Bigg Boss Non Stop: బాత్రూంలో చూశా నీవి తగ్గిపోయాయి.. బిందుపై అఖిల్ కామెంట్స్‌.. బయటపెట్టిన నాగ్

    ‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

    ‘కేజీఎఫ్ 2' ప్రీ రిలీజ్ బిజినెస్

    విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పరచుకున్న 'KGF Chapter 2' మూవీకి కర్నాటకలో రూ. 100 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 78 కోట్లు, తమిళనాడులో రూ. 27 కోట్లు, కేరళలో రూ. 10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 100 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 30 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ మాస్ మూవీకి రూ. 345 కోట్ల బిజినెస్ జరిగింది.

     13 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    13 రోజు ఎక్కడ ఎంత రాబట్టింది?

    'కేజీఎఫ్ 2' మూవీ ఏపీ, తెలంగాణలో 13వ రోజూ నిరాశ పరిచింది. దీంతో నైజాంలో రూ. 46 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 10 లక్షలు, ఈస్ట్‌లో రూ. 7 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో.. 13వ రోజు రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 94 లక్షలు షేర్, రూ. 1.60 కోట్లు గ్రాస్‌ను మాత్రమే రాబట్టింది.

    SSMB28: మహేశ్ బాబు తండ్రిగా స్టార్ హీరో.. కుంభస్థలాన్నే టార్గెట్ చేసిన త్రివిక్రమ్SSMB28: మహేశ్ బాబు తండ్రిగా స్టార్ హీరో.. కుంభస్థలాన్నే టార్గెట్ చేసిన త్రివిక్రమ్

    13 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    13 రోజులకు కలిపి ఎంతొచ్చింది

    'కేజీఎఫ్ 2'కు 13 రోజుల్లోనూ తెలుగు రాష్ట్రాల్లో భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 39.08 కోట్లు, సీడెడ్‌లో రూ. 10.54 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6.89 కోట్లు, ఈస్ట్‌లో రూ. 5.15 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.22 కోట్లు, గుంటూరులో రూ. 4.21 కోట్లు, కృష్ణాలో రూ. 3.81 కోట్లు, నెల్లూరులో రూ. 2.55 కోట్లతో.. కలుపుకుని రూ. 75.45 కోట్లు షేర్, రూ. 121.30 కోట్లు గ్రాస్ వచ్చింది.

    మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

    మిగిలిన భాషల్లో వచ్చింది ఎంత

    ఏపీ, తెలంగాణలో 13 రోజుల్లో 'కేజీఎఫ్ 2'కు రూ. 75.45 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 83.25 కోట్లు, తమిళనాడులో రూ. 35.85 కోట్లు, కేరళలో రూ. 24.05 కోట్లు, హిందీలో ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 169.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 78.30 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 13 రోజుల్లోనే రూ. 466.25 కోట్లు షేర్‌తో పాటు రూ. 942.75 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

    యాంకర్ మంజూష హాట్ ట్రీట్: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో అందాలన్నీ కనిపించేలా!యాంకర్ మంజూష హాట్ ట్రీట్: స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో అందాలన్నీ కనిపించేలా!

    టార్గెట్ ఎంత.. ఇంకెంత రావాలి?

    టార్గెట్ ఎంత.. ఇంకెంత రావాలి?

    'కేజీఎఫ్ 2' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 345 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగులో ఇది రూ. 78 కోట్లు బిజినెస్ చేసుకుంది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 79 కోట్లుగా నమోదైంది. ఇక, ఇది 11 రోజుల్లోనే రూ. 75.45 కోట్లు రాబట్టింది. అంటే మరో రూ. 3.55 కోట్లు వస్తేనే ఈ సినిమా హిట్ అవుతుంది.

    13వ రోజు కోటి కంటే తక్కువగానే

    13వ రోజు కోటి కంటే తక్కువగానే

    పూర్తి స్థాయిలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'KGF Chapter 2' మూవీకి 13వ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి రూ. 94 లక్షలు మాత్రమే రాబట్టింది. ఫలితంగా విడుదలైన తర్వాత తొలిసారి కోటి మార్కును చేరుకోలేకపోయింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగానూ ఇది రూ. 8.52 కోట్లు సాధించింది. రిలీజ్ తర్వాత ఓవరాల్‌గా ఇదే తక్కువ మొత్తం కావడం గమనార్హం.

    English summary
    Yash Did K.G.F: Chapter 2 Movie Under Prashanth Neel Direction. This Movie Collects Rs 466.25 Cr in 13 Days in Worldwide.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X