పలు భాషల్లో విడుదలైన కన్నడ చిత్రం కేజీఎఫ్ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. వారాంతంలో బ్రహ్మండమైన కలెక్షన్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. బీ, సీ సెంటర్లలో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన రావడంతో శనివారం, ఆదివారాల్లో కలెక్షన్లు ఊపందుకొన్నాయి. కన్నడ క్రేజీ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి నటించిన చిత్రానికి సంబంధించి తొలి మూడు రోజుల వసూళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలో వసూళ్లు
కర్ణాటకలో కేజీఎఫ్ తొలిరోజే అదరగొట్టే కలెక్షన్లు సాధిచించింది. మొదటి రోజు రూ.14 కోట్లు సాధించిన ఈ చిత్రం రెండో, మూడో రోజున 12 కోట్లు సాధించడంతో వసూళ్ల మొత్తం రూ.26 కోట్లకు చేరుకొన్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు
రిలీజ్‌కు ముందు భారీ అంచనాలు పెంచిన కేజీఎఫ్ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా స్పందన కనిపించలేదు. గత మూడు రోజుల్లో కేవలం రూ.3.8 కోట్లు మాత్రమే వసూళు చేసింది. అలాగే కేరళ, తమిళనాడులో ఈ చిత్రం కేవలం రూ.1.8 కోట్లు మాత్రమే రాబట్టం జరిగింది.
ఉత్తరాదిలో కేజీఎఫ్
ఉత్తరాది చిత్ర పరిశ్రమలో కేజీఎఫ్ కొంత సానుకూలత కనిపించింది. మూడు రోజుల్లో ఈ చిత్రం రూ.10.5 కోట్లు సాధించింది. తొలి రోజు కలెక్షన్ల వేగం మందగించినా గత రెండు రోజుల్లో భారీ కలెక్షన్లు సాధించింది. హిందీలో డబ్బింగ్ చిత్రంగా రిలీజైన కేజీఎఫ్ ఫర్వాలేదనిపిస్తున్నది.
యూఎస్ బాక్సాఫీస్ వద్ద
యూఎస్ మార్కెట్‌లో కూడా కేజీఎఫ్ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. గత మూడు రోజుల్లో రూ.2 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. గతంలో విదేశీ మార్కెట్‌లో అత్యధికంగా వసూళ్లను సాధించిన తరంగా చిత్ర రికార్డు రూ.2.21 కోట్లకు చేరువైంది.
ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ చిత్రం రూ.44.3 కోట్లు సాధించింది. సోమ, మంగళ, బుధ వారాల్లో కూడా సెలవుల ప్రభావం కనిపిస్తున్నందున మరిన్ని కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి నటించిన ఈ చిత్రం డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకువ వచ్చిన సంగతి తెలిసిందే.
Yash and Srinidhi Shetty's KGF has earned around Rs 44.3 crore at the worldwide box office in three days first weekend. Yash and Srinidhi Shetty-starrer KGF opened to earth-shattering opening by grossing over Rs 14 crore and has estimated to have added Rs 12 crore in the next two days to take its three-day total to Rs 26 crore in Karnataka.
Story first published: Monday, December 24, 2018, 13:43 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more