»   »  ‘ఖైదీ నెం 150’....ఇన్‌కం టాక్స్‌లో రామ్ చరణ్ చూపిన లాభాల లెక్కలు ఇవే?

‘ఖైదీ నెం 150’....ఇన్‌కం టాక్స్‌లో రామ్ చరణ్ చూపిన లాభాల లెక్కలు ఇవే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఖైదీ నెం 150' చిత్రం రూ. 100 కోట్లు వసూలు చేసినట్లు సినిమా విడుదలైన వారం రోజులకే గొప్పగా ప్రకటించుకుంది మెగా ఫ్యామిలీ. ఆ సినిమా రూ. 100 కోట్లుకు వసూలు(గ్రాస్) చేసిన మాట నిజమే కానీ.... నిర్మాత రామ్ చరణ్ చేతికి రూ. 100 కోట్లు(షేర్) రాలేదనేది తాజాగా తేలిన వాస్తవం.

తెలుగు సినిమా పరిశ్రమలో ఏదైనా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా పేరు తెచ్చుకుందంటే... వెంటనే ఇన్ కం టాక్స్ అధికారులు ఆయా సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెడతారు. అందులో భాగంగా సంక్రాంతికి విడుదలైన ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలపై కూడా ఇన్ కం టాక్స్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆల్రెడీ శాతకర్ణి సినిమాపై నిర్మాతలను, డిస్ట్రిబ్యూటర్లను ఇప్పటికే ప్రశ్నించారు. ఇపుడు వారు ఖైదీ నెం 150 సినిమా నిర్మాత రామ్ చరణ్ తమ విధినిర్వహణలో భాగంగా టార్గెట్ చేసారు.

ఇన్ కం టాక్స్ అధికారులు రామ్ చరణ్ ను ప్రశ్నించగా....తమ సినిమా రూ. 100 కోట్లు వసూలు చేయలేదని, కేవలం రూ. 75 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు తెలిపినట్లు సమాచారం. దీంతో పాటు సినిమా బడ్జెట్, చిరంజీవి, వినాయక్ రెమ్యూనరేషన్ వివరాలు కూడా అధికారులకు రామ్ చరణ్ వివరించినట్లు తెలుస్తోంది.

 బడ్జెట్ ఎంత, లాభం ఎంత?

బడ్జెట్ ఎంత, లాభం ఎంత?

‘ఖైదీ నెం 150' చిత్రాన్ని తాను రూ. 60 కోట్లతో నిర్మించినట్లు ఇన్ కం టాక్స్ అధికారులకు రామ్ చరణ్ వెల్లడించినట్లు సమాచారం. ఈ సినిమాకు రూ. 75 కోట్లు కలెక్షన్ వచ్చినట్లు, ఈ సినిమా వల్ల తనకు రూ. 15 కోట్లు లాభం చేకూరినట్లు వెల్లడించినట్లు తెలుస్తోంది.

 చిరు, వినాయక్ రెమ్యూనరేషన్

చిరు, వినాయక్ రెమ్యూనరేషన్

ఇన్ కం టాక్స్ అధికారులకు సమర్పించిన లెక్కల్లో రామ్ చరణ్ ‘ఖైదీ నెం 150' సినిమాకు గాను చిరంజీవికి రెమ్యూనరేషన్ గా రూ. 20 కోట్లు, వినాయక్ కు రెమ్యూనరేషన్ గా రూ. 10 కోట్లు ఇచ్చినట్లు నిర్మాత రామ్ చరణ్ చూపించినట్లు సామాచారం.

 అసలు నిజం?

అసలు నిజం?

రామ్ చరణ్ లెక్కల్లో అలా చూపినప్పటికీ... కొడుకు వద్ద నుండి చిరంజీవి ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకుని ఉండరు, వినాయక్ కూడా అంత చార్జ్ చేసిన ఉండక పోవచ్చు... కేవలం టాక్స్ లెక్కల కోసమే అలా అంకెల గారడీ చూపించి ఉంటారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

 తెలివిగా ప్రవర్తించిన చరణ్?

తెలివిగా ప్రవర్తించిన చరణ్?

దీంతో పాటు ఇన్ కం టాక్స్ విషయంలో రామ్ చరణ్ చాలా తెలివిగా ప్రవర్తించారని, సినిమాను తాను ఎవరికీ అమ్మలేదని, తానే స్వయంగా రిలీజ్ చేసినట్లు తెలిపారట. ఎవరితోనూ ఎలాంటి బిజినెస్ డీల్స్ పెట్టుకోలేదని రామ్ చరణ్ ఇన్ కం టాక్స్ అధికారులకు తెలిపినట్లు సమాచారం. ఎగ్జిబిటర్ల నుండి ఫైనల్ కలెక్షన్ చార్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు వారికి వెల్లడించారట.

 పబ్లిసిటీ గిమ్మిక్కే అని చెప్పారా?

పబ్లిసిటీ గిమ్మిక్కే అని చెప్పారా?

ఆ మధ్య అల్లు అరవింద్, వివి వినాయక్ ప్రెస్ మీట్ పెట్టి కలెక్షన్ల వివరాలపై ప్రకటన చేసిన అంశాన్ని ఇన్ కం టాక్స్ అధికారులు ప్రశ్నించగా... అది సినిమా పబ్లిసిటీ కోసం చేసిందే, నేను అఫీషియల్ గా చేసింది కాదని రామ్ చరణ్ తెలిపారట.

English summary
“When the tax officials met Ram Charan, he told them that Khaidi No. 150 collected only Rs 75 crore and showed them a budget of Rs 60 crore" says Film Nagar the source.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu