»   » ‘ఖైదీ నెం 150’ ఇండస్ట్రీ రికార్డ్: కలెక్షన్స్ ప్రకటించిన అల్లు అరవింద్

‘ఖైదీ నెం 150’ ఇండస్ట్రీ రికార్డ్: కలెక్షన్స్ ప్రకటించిన అల్లు అరవింద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి కంబ్యాక్ మూవీ 'ఖైదీ నెం 150' తొలి రోజు కలెక్షన్ల విషయంలో ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసిందని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ప్రకటించారు. గురువారం సాయంత్రం 'ఖైదీ నెం 150' వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాలతో ఆయన మీడియా ముందుకొచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం తొలి రోజు రూ. 47 కోట్ల 7 లక్షల రూపాయల గ్రాస్ సాధించినట్లు తెలిపారు. తొలిరోజు ఇంత వసూలు కావడం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారి, తెలుగు సినిమా మార్కెట్ రేంజి ఇంత పెరిగిందని తెలిసి ఇండస్ట్రీ వారంతా సంతోష పడతారు... ఈ సంతోష కరమైన విషయం తెలియజేయడానికే నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినట్లు అల్లు అరవింద్ తెలిపారు.

తెలుగు సినిమాను అభిమానించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందనడానికి ఈ వసూళ్ల లెక్కలే నిదర్శనం, చిరంజీవి సినిమాల్లోకి తిరిగిరావడాన్ని ఎంత మంది ప్రేక్షకులు బలంగా కోరుకుంటున్నారో చెప్పడానికి 'ఖైదీ నెం 150' వసూళ్లే నిదర్శనం అని అరవింద్ తెలిపారు.

'ఖైదీ నెం 150' చిత్రం ఏరియాల వారిగా ఎంత వసూలు చేసిందేనే విషయాన్ని కూడా అరవింద్ తెలిపారు. అందకు సంబంధించిన విషయాలు క్రింద ఇవ్వబడ్డాయి.

 తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో

తెలుగు రాష్ట్రాల్లో ‘ఖైదీ నెం 150' చిత్రం తొలి రోజు రూ. 30 కోట్ల 45 వేల కలెక్షన్ సాధించినట్లు అల్లు అరవింద్ ప్రకటించారు.

 కర్నాటకలో

కర్నాటకలో

కర్నాటకలో ‘ఖైదీ నెం 150' చిత్రం తొలి రోజు రూ. 4 కోట్ల 70 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు.

 ఓ వర్సీస్ మార్కెట్

ఓ వర్సీస్ మార్కెట్

ఓవర్సీస్ మార్కెట్లో కేవలం యూఎస్ఏలోనే రూ. 8 కోట్ల 90 లక్షలు, ఇతర దేశాలన్నింటిలో కలిపి రూ. 2 కోట్ల 12 లక్షలు వసూలైనట్లు అరవింద్ తెలిపారు.

 రెస్టాఫ్ ఇండియాలో

రెస్టాఫ్ ఇండియాలో

ఒరిస్సాలో రూ. 12 లక్షలు, తమిలనాడులో రూ. 20 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో 58 లక్షలు వసూలు చేసినట్లు అల్లు అరవింద్ తెలిపారు.

 వారి ది తక్కువ, మనది ఎక్కువ అని కాదు

వారి ది తక్కువ, మనది ఎక్కువ అని కాదు

చిరంజీవిగారు తిరిగి సినిమాల్లోకి తిరిగి వస్తున్న తరుణంలో మన సినిమా ఎక్కవు, మరొకరి సినిమా తక్కువ అనే తారతమ్యాలు వద్దు. కేవలం మన ఇండస్ట్రీ స్టామినా పెరిగిందనే సంతోషకరమైన విషయం చెప్పడానికే తాను వచ్చానని అరవింద్ తెలిపారు.

 మొత్తం సుమారు 2 వేల థియేటర్లు

మొత్తం సుమారు 2 వేల థియేటర్లు

తొలి రోజు సుమారుగా 2 వేల స్క్రీన్లలో సినిమా ప్రదర్శితం అయినట్లు అల్లు అరవింద్ తెలిపారు. నిన్న సాయంత్రం వరకే 1800 స్క్రీన్లు అని తెలిసింది. తర్వాత కొన్ని పెరిగాయి. సుమారుగా మొత్తం 2 వేల స్క్రీన్లు అనుకోవచ్చని తెలిపారు.

వివి వినాయక్ గారు క్షమించాలి

వివి వినాయక్ గారు క్షమించాలి

ఈ మాట అంటున్నందుకు వివి వినాయక్ గారు క్షమించాలి. ఇన్ని వసూళ్లు రావడానికి ప్రధాన కారణం చిరంజీవిగారి పై అభిమానం ఉధృతం అయినందు వల్లే అని అనుకుంటున్నారు. వివాదం లేని మనిషి, అందరితోనూ సౌమ్యంగా ఉండే మనిషి. అటువంటి ఆయన తిరిగి పదేళ్ల తర్వాత ఇండస్ట్రీకి వస్తున్నాడంటే అందరూ ఆనంద పడ్డారు అని అరవింద్ తెలిపారు.
ఈ రోజుల్లో ఫస్ట్ డే గ్రాస్

English summary
After keeping his fans with bated breaths, Tollywood megastar Chiranjeevi is back to the silver silver with Khaidi No 150, which also marks his 150th film. The film, which opened to positive reviews from critics and fans alike, has got a stupendous opening on its first day. Acording to Mega producer Allu Aravind he Chiranjeevi-starrer has earned Rs 47.07 cr world wide.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu