»   » నవ్వినోళ్లు ఏడుస్తున్నారా?... 100 కోట్ల క్లబ్‌లో ‘ఖైదీ నెం 150’(5 డేస్ రిపోర్ట్)

నవ్వినోళ్లు ఏడుస్తున్నారా?... 100 కోట్ల క్లబ్‌లో ‘ఖైదీ నెం 150’(5 డేస్ రిపోర్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నవ్వినోళ్లకు చెప్పు ఏడ్చే రోజు వస్తుందని..... ఖైదీ నెంబ‌ర్ 150లో చిరంజీవి చెప్పిన డైలాగ్ ఇపుడు హాట్ టాపిక్ అయంది. ఎందుకు కంటే ఆ డైలాగ్ ఇపుడు అక్షరాల నిజం అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా రంగాన్ని విడిచి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఎలాంటి పరస్థితులు ఎదురయ్యాయో అందరికీ తెలిసిందే.

అయితే దాదాపు పదేళ్ల సినిమా రంగానికి దూరం అయిన మెగాస్టార్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నాడంటే.... అభిమానులు సంబర పడ్డప్పటకీ, కొందరు మాత్రం అదోలా చూసారు. 60 ఏళ్ల వయసు పైబడి వృద్ధుల జాబితాలో చేరిన చిరంజీవి ఇప్పుడొచ్చి హీరోగా ఏం సాధిస్తాడని ఎగ‌తాళి చేసిన వారూ ఉన్నారు.

అలాంటి వారికి తగిన సమాధానం చెప్పాలనుకున్నాడో ఏమో....సినిమాలో అందుకు తగిన విధంగా పవర్ ఫుల్ డైలాగులు పెట్టించారు. స‌ముద్రం వెన‌క్కి వెళ్లింది క‌దా అని దానిముందు నిల‌బ‌డి డాన్సులేయ‌కూడ‌దు.. తిక్క‌రేగితే తొక్కుడే.. న‌వ్వినోళ్ల‌కు చెప్పు వాళ్ల‌కు న‌న్ను చూసి ఏడ్చే రోజు వ‌స్తుంద‌ని.... అంటూ చిరంజీవి చెప్పిన డైలాగులు అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపాయి.

ఆ డైలాగులను నిజం చేస్తూ..... 'ఖైదీ నెం 150' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము రేపింది. తొలి రోజే రూ. 47 కోట్ల గ్రాస్ సాధించి ఇండస్ట్రీ రికార్డు క్రియేట్ చేసింది. సినిమా 5 రోజులు పూర్తయ్యేలోగా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది.

ఐదురోజుల్లో 106.12 కోట్ల గ్రాస్

ఐదురోజుల్లో 106.12 కోట్ల గ్రాస్

ఖైదీ నెం 150 చిత్రం రూ. 100 కోట్ల క్లబ్ లో చేరింది. సినిమా విడుదలైన తొలి 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ. 106.12 కోట్ల గ్రాస్ సాధించింది. ఇందులో రూ. 72.51 కోట్ల షేర్ వచ్చింది.

నైజాం షేర్

నైజాం షేర్

నైజాం ఏరియాలో ‘ఖైదీ నెం 150' చిత్రం తొలి 5 రోజుల్లో రూ. 15.7 కోట్ల షేర్ సాధించింది. ఫుల్ రన్‌లో వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది.

సీడెడ్ షేర్

సీడెడ్ షేర్

సీడెడ్ ఏరియాలో ‘ఖైదీ నెం 150' చిత్రం తొలి 5 రోజుల్లో రూ. 8.58 కోట్ల షేర్ సాధించింది. ఇంత తక్కువ సమయంలో ఇంత సాధించడం రికార్డే.

నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో ఖైదీ నెం 150 తొలి 5 రోజుల్లో రూ. 2. 04 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇక్కడ అనుకున్న దానికంటే ఎక్కువే వసూలు చేసింది.

గుంటూరు

గుంటూరు

గుంటూరు ఏరియాలో ఖైదీ నెం 150 చిత్రం తొలి 5 రోజుల్లో రూ. 4.67 షేర్ కోట్లు వసూలు చేసింది. గుంటూరు ఏరియాలో చిరంజీవికి ఎంత ఫాలోయింగ్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.

కృష్ణ

కృష్ణ

కృష్ణ జిల్లా ఏరియాలో తొలి 5 రోజుల్లో ఈచిత్రం తొలి 5 రోజుల్లో 3.34 కోట్లు షేర్ వసూలు చేసింది.

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి ఏరియాలో ‘ఖైదీ నెం 150' చిత్రం తొలి 5 రోజుల్లో రూ. 4.19 కోట్లు షేర్ వసూలు చేసింది.

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి ఏరియాలో ‘ఖైదీ నెం 150' చిత్రం కలెక్షన్ల పరంగా దుమ్ము రేపింది. తొలి 5 రోజుల్లో ఈచిత్రం ఇక్కడ రూ. 5.37 కోట్ల షేర్ వసూలు చేసింది.

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర

ఉత్తరాంధ్ర ఏరియాలో తొలి ఐదు రోజుల్లో ఖైదీ నెం 150 చిత్రం రూ. 81.8 కోట్ల షేర్ సాధంచింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 52.07 కోట్ల షేర్ సాధించింది.

ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్

ఇతర రాష్ట్రాలు, ఓవర్సీస్

కర్నాటకలో ఖైదీ మూవీ రూ. 7.05 కోట్ల షేర్ సాధించింది. రెస్టాఫ్ ఇండియా 1.20 కోట్ల షేర్ వచ్చింది. ఓవర్సీస్ లో రూ. 12.19 కోట్ల షేర్ వచ్చింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ రూ. 72. 51 కోట్ల షేర్ సాధించింది.

English summary
Khaidi No 150 movie 5 dyas collection report details out. The movie collected Rs 106.12 cr gross around the world.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu