»   » 'ఖైదీ నంబర్‌ 150': టికెట్‌పై 92% డిస్కౌంట్,కలెక్షన్స్ తగ్గాయా, ఫేక్ కలెక్షన్స్ అంటూ ప్రచారం

'ఖైదీ నంబర్‌ 150': టికెట్‌పై 92% డిస్కౌంట్,కలెక్షన్స్ తగ్గాయా, ఫేక్ కలెక్షన్స్ అంటూ ప్రచారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాస్‌ ఈజ్‌ బ్యాక్‌' అంటూ మెగాస్టార్‌ చిరంజీవి దాదాపు తొమిదిన్నర సంవత్సరాల తర్వాత నటించిన సినిమా 'ఖైదీ నంబర్‌ 150'. ఈ సినిమా ఊహించినట్టుగానే భారీ కలెక్షన్లను రాబడుతోంది. మొదటిరోజు నుంచీ భారీ వసూళ్లతో రికార్డులు సృష్టిస్తున్నది. దేశవ్యాప్తంగా బుధవారం విడుదలైన ఈ సినిమాకు అన్ని సెంటర్లలో మంచి వసూళ్లు దక్కుతునట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.

అలాగే అదె వరసలో ..ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్స్ సాధించినట్టు సినిమావర్గాలు చెబుతుంటే మరోవైపు అమెరికాలో డిస్కౌంట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను అమెరికాలోనూ విడుదల చేయగా, దాదాపు అన్ని థియేటర్లలోనూ డిస్కౌంట్ ఆఫర్‌తో టికెట్లను విక్రయించారు.

అమెరికాలోనూ ఈ సినిమా కలెక్షన్ల తుఫాన్‌ సృష్టించిందని ప్రముఖ బాలీవుడ్‌ ట్రెడ్‌ అనాలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌లో తెలిపారు. అమెరికాలో మంగళవారమే విడుదలైన ఈ సినిమా 12 లక్షల 51 వేల 548 డాలర్లు (రూ. 8.56 కోట్లు) వసూలు చేసిందని ఆయన వెల్లడించారు. మిడ్‌వీక్‌లో విడుదలైనప్పటికీ ఈ సినిమా అమెరికాలో అద్భుతమైన ఓపెనింగ్స్‌ సాధించిందని తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. అయితే ఈ డిస్కట్ల వ్యవహారం ఇప్పుడు అంతటా ఆశ్చర్యంగా మారింది.

 అంత డిస్కౌంటే...

అంత డిస్కౌంటే...

అమెరికాలోని చాలా రాష్ట్రాల్లోని తెలుగువారు ఫండాంగో వెబ్ సైట్ ద్వారా సినిమా టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. టెక్సాస్ ఆస్టిన్‌లో ఉంటున్న తెలుగువారు చాలామంది 25 డాలర్లు పెట్టి టికెట్ కొనుగోలు చేయగా, వారికి 23 డాలర్ల డిస్కౌంట్ లభించింది.

 అంత తక్కువ రేటుకే కొన్నట్లు

అంత తక్కువ రేటుకే కొన్నట్లు


25 డాలర్ల రేటుకు 23 డాలర్ల డిస్కౌంట్ అంటే సినిమా ఒక టికెట్ కేవలం 2 డాలర్లకే కొనుగోలు చేశారన్నమాట. మరో వ్యక్తి కాలిఫోర్నియాలోని సెంచురీ గ్రేట్ మాల్ అండ్ ఎక్స్ డి థియేటర్‌లో సినిమా కోసం టికెట్ బుక్ చేయగా డిస్కౌంట్ పోను 2 డాలర్లకే టికెట్ లభించింది.

 ముందు డిస్కౌంట్ ఇవ్వలేదు కానీ..

ముందు డిస్కౌంట్ ఇవ్వలేదు కానీ..


సినిమా అమెరికాలో విడుదలకు ముందు కొనుగోలు చేసిన టికెట్లపై ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వలేదని, విడుదల అయిన తర్వాతే ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేశారని అక్కడి వారు చెబుతున్నారు. పలువురు ప్రవాసులు తమ డిస్కౌంట్ టికెట్లను సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. ఈ డిస్కౌంట్ల మహిమేమో... ఓవర్సీస్ కలెక్షన్ల గురించి సరైన లెక్కలు చెప్పడం లేదన్న మాట వినిపిస్తోంది.

 అరవింద్ ఇలా..

అరవింద్ ఇలా..

ఈ సినిమా కలెక్షన్ల విషయంలో గీతా ఆర్ట్స్ అధినేత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఒక అడుగు ముందుకేసి ఖైదీ నెంబర్ 150 తొలిరోజు కలెక్షన్లు చూసిన తర్వాత చిరంజీవితో 151వ సినిమా తీయాలంటే భయమేస్తోందని కూడా చెప్పారు. తొలిరోజు ఖైదీ నెం. 150 సినిమాకు 47 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని ఆయన తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 30 కోట్లు వచ్చిందని, ఓవర్సీస్ కలెక్షన్లు కూడా బాగున్నాయని అన్నారు.

 రికార్డ్ సృష్టించిందని

రికార్డ్ సృష్టించిందని

తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్రల్లోనే కాకుండా అమెరికాలో కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తోందని ఆ సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు.

భోగి ముందు రోజు, భోగి రోజు సినిమా థియేటర్లలో కలెక్షన్లు తగ్గుతాయని, అయితే అందుకు భిన్నంగా తమ సినిమా భోగి ముందు రోజు తెలంగాణలో 2.50 కోట్ల షేర్‌ వసూలు చేసిందన్నారు. అలాగే రూ.4.50 కోట్ల గ్రాస్‌ కలెక్షన్‌ సాధించి రికార్డు సృష్టించిందన్నారు.

 బాహుబలిని దాటేసిందని

బాహుబలిని దాటేసిందని

మరో ప్రక్క కలెక్షన్లలో ఖైదీ నంబర్ 150 గత రికార్డులన్నింటినీ నిజంగానే బద్దలు కొట్టిందని, తొలిరోజు కలెక్షన్స్‌లో బాహుబలి వసూళ్లను అధిగమించిందని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో కూడా భారీ వసూళ్లను సాధించిందని, ఈ సినిమా ఒక్క రోజులో 47 కోట్లకు పైగా వసూళ్లు సాధించిపెట్టినట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బాహుబలి తొలి రోజు 35 కోట్లతో సరిపెట్టుకోగా ఖైదీ నంబర్ 150, ఆ రికార్డ్ ను దాటి కొత్త చరిత్ర సృష్టించినట్టు కూడా బహిరంగంగా ప్రకటించారు.

 సెలబ్రెటీలంతా..

సెలబ్రెటీలంతా..


ఇదిలా ఉంటే... దాదాపు పదేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి ట్విట్టర్‌లో అభినందనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. తాజాగా మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మోహన్‌బాబు, అక్కినేని అఖిల్‌ చిరంజీవికి అభినందనలు తెలిపారు. చిరంజీవి సినిమా ఘనవిజయం సాధించాలని నాగార్జున ఆకాంక్షించారు.

 నిజమా...

నిజమా...


సంక్రాంతి పండగ సందర్భంగా ప్రముఖ పీఆర్ఓ, ఇండస్ట్రీ హిట్ అధినేత అయిన బిఎ రాజు తన సోషల్ మీడియాలో స్పందిస్తూ 'ఖైదీ నంబర్ 150' మరియు 'గౌతమీపుత్ర శాతకర్ణి' కలెక్షన్స్ ను వివరించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు కేరాఫ్ అడ్రస్ అయిన వైజాగ్ లో తోలి రోజు 156 ఉన్న స్క్రీన్లు రెండవ రోజు చేరుకునే సమయానికి 97కు చేరుకున్నాయి.
స్క్రీన్లు తగ్గడంతో యధావిధిగా ఈ ప్రభావం కలెక్షన్స్ పైన పడి తొలి రోజుతో పోలిస్తే. 3వ వంతుకు పడిపోయాయి. అలాగే మూడవ రోజు కూడా అదే స్క్రీన్లతో కలెక్షన్స్ వివరాలను పోస్ట్ చేసిన బిఎ రాజు, కాసేపటికే ఆ ట్వీట్ ను తొలగించడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది.

హ్యాక్ చేసి మరీ ట్వీట్స్

హ్యాక్ చేసి మరీ ట్వీట్స్

మెగా అభిమానుల లెక్క ప్రకారం ఉత్తరాంధ్రలో రెండు, మూడు రోజులలో కోటికి పైగా షేర్ రాగా, బిఎ రాజు ట్వీట్ ప్రకారం ఆ సంఖ్య 78 మరియు 85 లక్షలకే పరిమితమైంది. దీంతో "ఫేక్ మెగా కలెక్షన్స్" అంటూ మెగా సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ ను ఉదహరిస్తూ. సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. పండగ నాడు బిఎ రాజు గారు చేసిన ఒక్క ట్వీట్ నందమూరి అభిమానుల పాలిట ఆయుధంగా మారడంతో, మెగా కలెక్షన్స్ ను ఏకరువు పెడుతున్నారు. అయితే ఆ ట్వీట్ హ్యాక్ చేసిందని వినపడుతోంది.

 కలెక్షన్స్ ప్రకటనతో సమస్యలు

కలెక్షన్స్ ప్రకటనతో సమస్యలు


ఈసినిమాకు సంబంధించి చిరు రెమ్యూనరేషన్ మినహాయిస్తే.. ఈ సినిమాకు పెట్టి ఖర్చు దాదాపు రూ.30 కోట్లు అని ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజునే రూ.47 కోట్ల షేర్ వచ్చేసిందని చెబుతున్నారు. ఇప్పుడు ఇదే న్యూస్ రామ్ చరణ్ ను ఐటీ సమస్యలలోకి నెడుతుందా ? అంటూ కొందరు సందేహాలు మరికొందరు అనుమాలు వ్యక్తం చేస్తున్నారు.

 ఆ రెండింటితోనే..

ఆ రెండింటితోనే..


ప్రస్తుతం ఓవర్సీస్ ప్రేక్షకుల దృష్టి 'శాతకర్ణి' 'శతమానం భవతి' సినిమాల వైపు మళ్ళడంతో 'ఖైదీ' కి రావాల్సిన కలక్షన్స్ లో ప్రభావం పడినట్లు తెలుస్తోంది. 'ఖైదీ' రెండవ ఓవర్సీస్ కలక్షన్స్ 65 వేల డాలర్లు వస్తే మూడవ రోజుకు 'ఖైదీ' బాగా తగ్గాయని , అయితే ప్రక్క సినిమాల ప్రభావమే అది అంటున్నారు

 ఇదే సమస్య

ఇదే సమస్య

యుఎస్ లో వారానికి ఒక సినిమా విడుదలైతే దానిని మొదటి వీకెండ్‌ వరకు విధిగా చూసేసే యుఎస్‌ జనం, మూడు చెప్పుకోతగ్గ సినిమాలు రిలీజ్‌ అయితే మూడింటినీ ఒకే వీకెండ్‌లో కవర్‌ చేయడానికి చూడరు. మూడిట్లో తమకేది కావాలో సెలక్ట్‌ చేసుకుని అదొక్కటీ చూసి మిగతావి వదిలేస్తారు. దీని వల్ల వారంలో వచ్చే కలక్షన్‌ మొత్తం డివైడ్‌ అయిపోయి దేనికీ అద్భుతమైన వసూళ్లు రావు. ప్రస్తుతం యుఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద ఇదే జరుగుతోంది అని ట్రేడ్ లో విశ్లేషిస్తున్నారు.

English summary
Chiranjeevi’s Khaidi No 150 which took a amazing start on Tuesday collecting $1.29 Million , has failed to maintain the tempo on the first day of its release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu