»   » 2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘ఖైదీ నెం 150’, షాకిచ్చే రేటుకు శాటిలైట్ రైట్స్!

2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘ఖైదీ నెం 150’, షాకిచ్చే రేటుకు శాటిలైట్ రైట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి త్వరలో 'ఖైదీ నెం 150' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్ల తర్వాత ఆయన మళ్లీ సినిమాల్లోకి హీరోగా రీ ఎంట్రీ ఇస్తుండటంతో సినిమాపై హైప్ ఓ రేంజిలో ఉంది. ఇటీవల యూట్యూబులో విడుదలైన ఈచిత్రం పాటలకు వచ్చిన రెస్పాన్సే ఇందుకు నిదర్శనం.

ఇక సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ అంచనాలకు మించేలా జరుగుతోంది. తాజాగా శాటిలైట్ రైట్స్ కూడా ఎవరూ ఊహించని రేటుకు అమ్ముడు పోయాయి. ఓ ప్రముఖ టెలివిజన్ సంస్థ రైట్స్ రూ. 13 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఎవరు కొన్నారు అనేది ఇంకా అఫీషియల్ గా బయటకు రాలేదు.

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ స్వయంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 60 ఏళ్ల వయసున్న మెగాస్టార్ చిరంజీవి ఈ తరం యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా స్టైలిష్ గా, ఎనర్జిటిక్ గా అభిమానుల ముందుకు వస్తున్నారు.

ఇప్ప‌టికే టీజ‌ర్లు, మేకింగ్ వీడియో స‌హా అమ్మ‌డు లెట్స్ డు కుమ్ముడు ఆడియో సాంగ్‌కి ప్రేక్ష‌కాభిమానుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. జ‌న‌వ‌రి 4న విజ‌య‌వాడలో ఖైదీనంబ‌ర్ 150 ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ అభిమానులు, సినీప్ర‌ముఖుల మ‌ధ్య‌ గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది.

2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీ

2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీ

ఈ విష‌యాన్ని చిత్ర‌నిర్మాత మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ అధికారికంగా ప్ర‌క‌టించారు. 2017 మోస్ట్ ఎవైటింగ్ మూవీ `ఖైదీనంబ‌ర్ 150` కొత్త సంవ‌త్స‌రాన్ని కొత్త‌గా ప్రారంభించ‌బోతున్న సంద‌ర్భంగా చిత్ర‌నిర్మాత చ‌ర‌ణ్ ప్రేక్ష‌కాభిమానుల‌కు క్రిస్మ‌స్, కొత్త‌సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలిపారు. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ కంపెనీ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టిస్తున్నారు. ర‌త్న‌వేలు ఛాయాగ్ర‌హ‌ణం, దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు త‌రుణ్ అరోరా విల‌న్ పాత్ర‌లో న‌టిస్తున్నారు.

నా 150వ మూవీ...ఇదిరా చిరంజీవి అనేలా ఉంటుంది

నా 150వ మూవీ...ఇదిరా చిరంజీవి అనేలా ఉంటుంది

ఖైదీ నెం 150 గురించి చిరంజీవి మాట్లాడుతూ...మీరంతా గ‌ర్వించేలా.. ఇదిరా చిరంజీవి అనేలా సినిమా ఇస్తాను. ది బెస్ట్ పెర్ఫామెన్స్‌ని ఇస్తాను. ఖైదీ నంబ‌ర్ 150 ప్ర‌తి ఒక్క‌రినీ అల‌రించే చిత్ర‌మ‌వుతుంది అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

చిరంజీవి ఫ్యాన్స్ దాడి చేసి ఇష్యూని పెద్దగా చేసారు: జీవిత

చిరంజీవి ఫ్యాన్స్ దాడి చేసి ఇష్యూని పెద్దగా చేసారు: జీవిత

మెగాస్టార్ చిరంజీవి, జీవిత రాజశేఖర్ మధ్య ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదో తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. మీడియా ముఖంగా ఇరు వర్గాలు అప్పట్లో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్నారు.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

చిరు 150 ఖైదీ పుస్తకం లో ఏముంటుంది??? ఇప్పటివరకూ ఇలాంటి ప్రయోగం జరగలేదు

చిరు 150 ఖైదీ పుస్తకం లో ఏముంటుంది??? ఇప్పటివరకూ ఇలాంటి ప్రయోగం జరగలేదు

ఇప్పటికే టీజర్, మేకింగ్ వీడియోలతో ఆకట్టుకున్న ఖైదీ టీం, త్వరలో ఈ సినిమా షూటింగ్ అనుభవాలతో ఓ పుస్తకాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది.

English summary
The pre-release business of Khaidi No 150 is going on in full swing. The latest news is that the satellite rights of this film have been sold for a whopping 13 crores by a leading television channel.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu