»   » వర్మ కు సెన్సార్ ట్విస్ట్...వీరప్పన్ నో రిలీజ్

వర్మ కు సెన్సార్ ట్విస్ట్...వీరప్పన్ నో రిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ డైరక్షన్లో, జనవరి 1న ఆంటే ఈ రోజు విడుదల కావాల్సిన సినిమా కిల్లింగ్‌ వీరప్పన్‌. కాని ఈ సినిమా ఈ రోజు కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే రిలీజ్ అవుతోంది. తెలుగు వెర్షన్ రిలీజ్ అవ్వడం లేదు. దీనికి సెన్సార్ ప్రాబ్లమ్ అని రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. దానికి సంబందించిన ట్వీట్ ఇక్కడ చూడండి.

రియలిష్టిక్ గా తీసిన ఈ సినిమా స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కించిన సంగతీ తెలిసిందే. శివరాజ్‌కుమార్‌, సందీప్‌ భరద్వాజ్‌, యజ్ఞాశెట్టి, సంచారి విజయ్‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించింన ఈ సినిమా కన్నడంలో మాత్రం ఈరోజే విడుదలవుతోంది.

గందపుచెక్కల దొంగ వీరప్పన్‌ , అండర్‌ వరల్డ్‌ డాన్‌, మాఫియా డాన్‌ల కంటే కూడా వీరప్పన్‌ ఎంతో శక్తివంతుడు అని, ఆయన తిరుగులేని క్రిమినల్‌ అంటూ వీరప్పన్‌ గురించి వర్మ చెబుతు మరీ తెరకెక్కించారు.

 Killing Veerappan Telugu not relesing today

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కొన్నేళ్ళ పాటు వణికించిన డేంజరస్ క్రిమినల్ వీరప్పన్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథగా ‘కిల్లింగ్ వీరప్పన్' రూపొందింది. కర్ణాటక, తమిళనాడు, మారెడుమిల్లి ఫారెస్ట్ ఏరియాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంది.

వర్మ మాట్లాడుతూ... వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత అతడు ఎంత డేంజరస్ వ్యక్తి అనే విషయం అర్థమైందని, అలాంటి క్రిమినల్‌ను చంపిన ఓ పోలీసాఫీసర్ కథే ఈ ‘కిల్లింగ్ వీరప్పన్' అని వర్మ తెలిపారు. వీరప్పన్ గురించి తెలుసుకున్న తర్వాత మాఫియా గ్యాంగ్‌స్టర్ మర్డర్స్ లాంటివి చిన్న పిల్లల ఆటలా కనిపించాయని వర్మ తెలిపాడు.

ఒసామా బిన్ లాడెన్ కన్నా శక్తిమంతుడైన వీరప్పన్ ఎంతో మంది పోలీసులను, అడవి జంతువులను చంపి తిరుగులేని క్రిమినల్‌గా అవతరించాడని వర్మ చెప్పుకొచ్చాడు. అలాంటి క్రిమినల్‌ను చంపిన పోలీస్ కథే ‘కిల్లింగ్ వీరప్పన్'గా వర్మ తెలిపాడు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వీరప్పన్‌ను చంపే ఆఫీసర్‌గా నటించటంతో క్రేజ్ క్రియేట్ అయ్యింది. సినిమా అద్భుతంగా రూపొందనుందని ఒక ఇంటెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కిందని వర్మ ఈ సందర్భంగా గతం లో తెలిపిన సందతి తెలిసిందే.

English summary
Ram Gopal Varma's Killing Veerappan which is slated for grand release today gave last minute shock. RGV sharing the details revealed that the film's Telugu version is postponed indefinitely.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu