For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SR Kalyanamandapam క్లోజింగ్ కలెక్షన్స్: సెకండ్ వేవ్ తరువాత బిగ్గెస్ట్ హిట్.. మొత్తం లాభం ఎంతంటే?

  |

  ప్రస్తుతం టాలీవుడ్ లో మెల్లగా ఒక్కొక్కటిగా సినిమాలు థియేటర్స్ లో విడుదలవుతున్నాయి. అలానే ఆడియన్స్ కూడా ఇప్పుడిప్పుడే థియేటర్స్ కి వచ్చి సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఓవైపు కరోనా మహమ్మారి వలన ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో అనే భయం అందరిలో ఉన్నప్పటికీ ఇప్పటికైతే కొంత బెటర్ కాబట్టి అందరూ ధైర్యంగా సినిమా చూసేందుకు థియేటర్స్ కు వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్లు నిర్మాతల్లో ఒక నమ్మకం ఏర్పడింది. మ్యాటర్ ఏమిటంటే, ఇటీవల చిన్న సినిమాగా విడుదలై ప్రేక్షకుల మెప్పు పొంది పెద్ద విజయం సాధించిన సినిమాల లిస్ట్ లో ఎస్ ఆర్ కళ్యాణమండపం కూడా చేరింది. ఆ సినిమా వసూళ్ల పరంగా సెకండ్ వేవ్ అనంతరం బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన సినిమా అని చెప్పవచ్చు. పాజిటివ్ టాక్ అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా కూడా మంచి ఆనందాన్ని ఇచ్చింది. సినిమా హీరో కిరణ్ అబ్బవరం కూడా చెప్పినట్లుగానే ఎంతో నమ్మకంతో హిట్ అందుకోవడం విశేషం.

  విడుదలకు ముందే మంచి క్రేజ్

  విడుదలకు ముందే మంచి క్రేజ్

  రాజావారు రాణిగారు సినిమా ద్వారా టాలీవుడ్ కి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాలో ప్రియాంక జవల్కర్ హీరోయిన్ గా నటించింది. ఈ బ్యూటీ ఇదివరకే విజయ్ దేవరకొండతో టాక్సీ వాలా వంటి సక్సెస్ ఫుల్ మూవీ లో యాక్ట్ చేసి మంచి క్రేజ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. యువ దర్శకుడు శ్రీధర్ గాదె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మించారు. ఇక ఈ మూవీ కి చేతన్ భరద్వాజ్ అందించిన సాంగ్స్ అన్ని కూడా శ్రోతలను విశేషంగా ఆకట్టుకుని సినిమాపై అందరిలో మంచి అంచనాలు క్రియేట్ చేసాయి.

  సినిమాకు అవే ప్లస్ పాయింట్స్

  సినిమాకు అవే ప్లస్ పాయింట్స్

  ఆ విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ అనంతరం రిలీజ్ అయిన ఈ సినిమా, రిలీజ్ తరువాత సూపర్ హిట్ కొట్టగా, ఇందులో విలక్షణ నటుడు సాయి కుమార్ ఒక ముఖ్య పాత్రలో కనిపించి మరింత హైప్ క్రియేట్ చేశారు. మంచి లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో కిరణ్, హీరోయిన్ ప్రియాంక ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ తో పాటు ముఖ్యంగా సాయి కుమార్ యాక్టింగ్ సినిమాకి ప్లస్ పాయింట్ అని, అలానే సినిమాని దర్శకుడు చాలా వరకు ఆకట్టుకునే విధంగా ఎంతో బాగా తీసారని ఈ మూవీపై పలువురు విశ్లేషకులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు.

  భారీగా ఓటీటీ ఆఫర్స్..

  భారీగా ఓటీటీ ఆఫర్స్..

  ఆ విధంగా చివరికి అందరి నుండి పాజిటివ్ టాక్ దక్కించుకున్న ఈ సినిమా ఓవరాల్ గా పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలను అందించినట్లు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. వాస్తవానికి ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ రూ. 4.55 కోట్లకు జరిగిందని సమాచారం. అయితే అంతకంటే ఎక్కువ తరహాలో ఈ సినిమాకు ముందుగానే మంచి ఓటీటీ ఆఫర్స్ వచ్చాయి. ఇక ధైర్యం చేసి ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాను థియేటర్స్ లో విడుదల చేయగా మొదటి రోజు నుంచి పాజిటి టాక్ అందుకుంది. మొత్తంగా దీనిని బట్టి సినిమాని కొన్న బయ్యర్లకు టోటల్ గా రూ. 3.48 కోట్ల మెగా లాభాలు దక్కాయని వారు అంటున్నారు. అయితే మొదట్లో కాస్త మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, ఆ తరువాత రివ్యూస్ తో సంబంధం లేకుంగా పలువురు ప్రేక్షకుల పాజిటివ్ మౌత్ టాక్ తో ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది.

  ఏరియాల కలెక్షన్స్ ఎంతంటే

  ఏరియాల కలెక్షన్స్ ఎంతంటే

  చిత్ర యూనిట్ మొత్తానికి కూడా మంచి పేరు తెచ్చిపెట్టిందని అలానే ఈ సినిమాతో హీరోగా కిరణ్ అబ్బవరం మరింత మంచి పేరు దక్కించుకున్నారు అనే చెప్పాలి.ఇక ఈ మూవీ ఏరియా కలెక్షన్స్ లెక్క ప్రకారం చూస్తే..నైజాం 2.79 కోట్లు, సీడెడ్ 1.67 కోట్లు, ఉత్తరాంధ్ర 0.93 కోట్లు, ఈస్ట్ 0.53 కోట్లు, వెస్ట్ 0.35 కోట్లు , గుంటూరు 0.65 కోట్లు , కృష్ణా 0.33 కోట్లు , నెల్లూరు 0.19 కోట్లు , ఏపీ, తెలంగాణ (టోటల్) 7.44 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 0.19కోట్లు, ఓవర్సీస్ 0.40 కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 8.03కోట్లు. ఈ లెక్కలను బట్టి చూస్తే ప్రస్తుత ఈ కరోనా పరిస్థితుల్లో కూడా ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా బాగానే రాబట్టినట్లు తెలుస్తోంది.

  Atharvaa Murali,Raj Kiran In Lyca Production NO 22 | Filmibeat Telugu
  మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?

  మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?

  ఫుల్ రన్ ముగిసేసరికి ఎస్ ఆర్ కళ్యాణమండపం రూ.8.03 కోట్ల షేర్ ను రాబట్టిందట. అంటే బయ్యర్లుకు రూ. 3.48 కోట్ల లాభాలు దక్కాయాని టాక్ వస్తోంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ అనంతరం పెట్టిన పెట్టుబడికి భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న మొదటి సినిమా ఇదే అని చెప్పవచ్చు. మొత్తానికి హీరో కిరణ్ అబ్బవరం చెప్పినట్లుగానే హిట్టు కొట్టేశాడు. ఇక ఇదే తరహాలో కిరణ్ మరిన్ని మంచి సినిమాలతో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం బడా నిర్మాతల నుంచి కూడా అతనికి ఆఫర్స్ అయితే వస్తున్నాయట. మరి ఆ సినిమాలు ఏ రేంజ్ లో హిట్ అవుతాయో చూడాలి.

  English summary
  Kiran abbavaram SR Kalyanamandapam closing collections,
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X