For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  SR Kalyanamandapam 6Days Collections: ఆరో రోజూ ఊహించని కలెక్షన్లు.. ఆ మూవీల రికార్డులు బద్దలు!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీకి ఈ మధ్య గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. కరోనా లాక్‌డౌన్ల కారణంగా సినిమా థియేటర్లు మూతపడడంతో ఆయా యాజమాన్యాలతో పాటు ఎంతో మంది నిర్మాతలను నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 30 నుంచి సినిమా హాళ్లు ఓపెన్ అయ్యాయి. ఆరోజు రెండు సినిమాలు 'తిమ్మరుసు', 'ఇష్క్' విడుదలయ్యాయి.

  అయితే, కరోనా భయానికి తోడు ఏపీలో థియేటర్లు పూర్తిగా తెరుచుకోపోవడంతో వీటికి ప్రేక్షకుల ఆదరణ లభించినా.. కలెక్షన్లు మాత్రం అంతగా రాలేదు. దీంతో కొత్త సినిమాల దర్శక నిర్మాతలు భయపడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆశలు రేపింది 'ఎస్ఆర్ కల్యాణమండపం'. ఈ మూవీ ఆరో రోజు కూడా భారీ కలెక్షన్లు సాధించింది. ఆ రిపోర్టును చూద్దాం పదండి!

  సెంటిమెంట్‌తో ‘ఎస్ఆర్ కల్యాణమండపం'

  సెంటిమెంట్‌తో ‘ఎస్ఆర్ కల్యాణమండపం'

  మొదటి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘ఎస్ఆర్ కల్యాణమండపం' అనే సినిమాతో వచ్చాడు. శ్రీధర్ గాదె తెరకెక్కించిన ఈ మూవీలో ప్రియాంక జావాల్కర్ హీరోయిన్‌. డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్రను పోషించారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రమోద్, రాజు ఈ సినిమాను నిర్మించారు.

  దీనికి హీరో కిరణ్ అబ్బవరం కథ, స్క్రీన్‌ప్లే, మాటలను అందించాడు. చైతన్ భరద్వాజ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చాడు. తండ్రి సెంటిమెంట్‌తో ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

  ఘాటు వీడియోతో షాకిచ్చిన విష్ణుప్రియ: ఓ రేంజ్‌లో రెచ్చిపోతూ అందాల ఆరబోత

  అందుకే భారీ బిజినెస్.. ఆశ్చర్యపోయారు

  అందుకే భారీ బిజినెస్.. ఆశ్చర్యపోయారు

  ఆరంభం నుంచే ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ అంచనాలను ఏర్పరచుకుంది. దీనికి కారణం ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించడమే. అంతేకాదు, వీటి వల్ల ఈ మూవీ పేరు మారుమ్రోగిపోయింది. దీంతో దీనికి బిజినెస్ కూడా ఊహించని రీతిలో జరిగింది.

  ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రానికి రూ. 4.55 కోట్ల వ్యాపారం జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. ఫలితంగా మీడియం రేంజ్ చిత్రాల మాదిరిగా ప్రీ బిజినెస్‌ను జరుపుకుని సత్తా చాటిందీ సినిమా. ఈ మొత్తాలు చూసి సినీ పెద్దలే ఆశ్చర్యపోయారు.

  మూడో రోజే టార్గెట్ డన్... ఐదు రోజులకు

  మూడో రోజే టార్గెట్ డన్... ఐదు రోజులకు

  అంచనాలకు అనుగుణంగానే ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీకి ప్రేక్షకులు అదిరిపోయే స్పందనను అందించారు. ఫలితంగా ఈ మూవీ హిట్‌ను దక్కించుకోవడంతో పాటు ఆరంభం నుంచే కలెక్షన్లను భారీగా రాబడుతోంది. ఫలితంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను మూడు రోజుల్లోనే ఫినీష్ చేసేసింది.

  ఇక, ఈ మూవీ మొదటి రోజు ఈ చిత్రం రూ. 1.41 కోట్లు, రెండో రోజు రూ. 1.25 కోట్లు, మూడో రోజు రూ. 1.40 కోట్లు, నాలుగో రోజు రూ. 74 లక్షలు, ఐదో రోజు రూ. 60 లక్షలు వసూలు చేసింది. ఫలితంగా హిట్ స్టేటస్‌ను అందుకుంది. తద్వారా బాక్సాఫీస్‌కు జీవాన్ని అందించింది.

  తల్లైనా తగ్గని రామ్ చరణ్ హీరోయిన్ రచ్చ: అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా ఫోజులు

  ఆరో రోజు ఎక్కడ? ఎంత రాబట్టిందంటే?

  ఆరో రోజు ఎక్కడ? ఎంత రాబట్టిందంటే?

  ఆరో రోజైన బుధవారం కూడా ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి స్పందన దక్కింది. ఫలితంగా నైజాంలో రూ. 15 లక్షలు, సీడెడ్‌లో రూ. 10 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 7.60 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 4.80 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 4.20 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలు వసూలయ్యాయి.

  దీంతో మొత్తంగా ఆరో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ. 45 లక్షలు షేర్‌తో పాటు రూ. 74 లక్షలు గ్రాస్‌ను రాబట్టిందీ చిత్రం. ఫలితంగా హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.

  ఆరు రోజులకు ఎక్కడ? ఎంత వచ్చింది?

  ఆరు రోజులకు ఎక్కడ? ఎంత వచ్చింది?

  మొదటి రోజు నుంచే సూపర్ రెస్పాన్స్‌ను అందుకుంటోన్న ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీకి అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి.

  ఆరు రోజులకు కలిపి నైజాంలో రూ. 2.28 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.21 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 72 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 41 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 28 లక్షలు, గుంటూరులో రూ. 53 లక్షలు, కృష్ణాలో రూ. 27 లక్షలు, నెల్లూరులో రూ. 15 లక్షలు వసూలయ్యాయి. దీంతో మొత్తంగా ఆరు రోజులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ. 5.85 కోట్లు షేర్‌తో పాటు రూ. 9.48 కోట్లు గ్రాస్‌‌ను రాబట్టిందీ సినిమా.

  ‘కార్తీక దీపం' హీరో నిరుపమ్ అరెస్ట్: ఆ ఫొటో షేర్ చేయడంతో కేసు.. విషయం చెప్పి బాధ పడిన స్టార్

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇలా

  ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లు ఇలా

  అనుకూల పరిస్థితులు లేకున్నా తెలుగు రాష్ట్రాల్లో ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ సత్తా చాటుతోంది. ఫలితంగా బాక్సాఫీస్‌లో ఓ రేంజ్‌లో హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. తద్వారా మంచి సినిమా వస్తే తెలుగు ప్రేక్షకుల ఎంతలా ఆదరిస్తారో అన్నది నిరూపించుకుంది.

  ఆరు రోజులకు కలిపి తెలుగు రాష్ట్రాల్లో రూ. 5.85 కోట్లు షేర్‌‌ను రాబట్టిన ఈ చిత్రం కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 16 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 34 లక్షలు వసూలు చేసింది. దీంతో మొత్తంగా ఆరు రోజులకు కలిపి ప్రపంచ వ్యాప్తంగా రూ. 6.35 కోట్లు షేర్‌తో పాటు రూ. 10.65 కోట్లు గ్రాస్‌ వసూలు చేసింది.

  Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
   బ్రేక్ ఈవెన్ టార్గెట్.. అప్పుడే అంత లాభం

  బ్రేక్ ఈవెన్ టార్గెట్.. అప్పుడే అంత లాభం

  ‘ఎస్ఆర్ కల్యాణమండపం' మూవీ ప్రీ రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని సినీ ఏరియాల్లో కలుపుకుని బిజినెస్ రూ. 4.55 కోట్లు జరిగింది. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. ఇక, ఆరు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ. 6.35 కోట్లు షేర్ రాబట్టింది.

  దీంతో ఇప్పటి వరకూ ఈ సినిమా రూ. 1.55 కోట్లు లాభాలను అందుకుని హిట్ చిత్రంగా నిలిచింది. తద్వారా ‘30 రోజుల్లో', ‘జాంబీరెడ్డి'ని దాటింది. రెండు కోట్ల మార్క్ దాటితే ఈ ఏడాది అత్యధిక లాభాలు అందుకున్న చిత్రాల జాబితాలో ఇది మరింత ముందుకెళ్తోంది. దీంతో ‘నాంది' రికార్డును దాటి పోతుంది.

  English summary
  Kiran Abbavaram Recently Did a Film SR Kalyanamandapam Under Sridhar Gade Direction. This Movie Collected Rs 6.35 CR Share in Six Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X