twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SRKalyanaMandapam Collections:దిమ్మతిరిగే కలెక్షన్లు..4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్, ఏకంగా అన్ని కోట్లా?

    |

    కరోనా మహమ్మారి థియేటర్లను ఎంత ప్రభావితం చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.. గత ఏడాది నుంచి రెండుసార్లు పూర్తిస్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ విధించడంతో థియేటర్లు పూర్తిస్థాయిలో మూతపడిన పరిస్థితి నెలకొంది. అయితే అప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్కి సిద్ధంగా ఉన్న సినిమాలన్నీ డిజిటల్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ వేశారు. కానీ మొదటి కరోనా వేవ్ తర్వాత వచ్చిన వకీల్ సాబ్ సినిమా తెలుగు ప్రేక్షకులకు సినిమాల మీద ఎంత ప్రేమ ఉంది అనే విషయాన్ని చాటి చెప్పింది.

    దీంతో మళ్లీ థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తూ వచ్చారు. ఇక రెండో వేవ్ కారణంగా థియేటర్లు మళ్లీ మూతపడగా జులై 30వ తేదీ నుంచి తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ థియేటర్లు ఊపందుకున్నాయి. అయితే తాజాగా ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్ రిపోర్ట్ ఎలా ఉంది అనేది పరిశీలిద్దాం.

    నాలుగో రొజుకే

    నాలుగో రొజుకే

    జులై 30వ తేదీన రెండు సినిమాలు రిలీజ్ అయినా సరే రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను థియేటర్లకు అయితే రప్పించే లేకపోయాయి.. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు దర్శక నిర్మాతలు సినిమాలు రిలీజ్ చేయాలంటే భయపడుతున్న క్రమంలో మొన్న శుక్రవారం నాడు రిలీజ్ అయిన ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా మాత్రం ప్రేక్షకులను ధియేటర్లకు రప్పించింది. స్టార్ హీరో కాదు, స్టార్ హీరో వారసుడు కాదు అయినా సరే ఈ సినిమా ఏర్పడిన పాజిటివ్ బజ్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. నాలుగో రోజుకి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడంతో ఐదు రోజులోకి విజయవంతంగా అడుగుపెట్టింది.

    బ్యాక్ గ్రౌండ్ లేకుండా

    బ్యాక్ గ్రౌండ్ లేకుండా

    అసలు ఏమాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటన మీద పిచ్చితో సినిమా రంగంలోకి ప్రవేశించిన కిరణ్ అబ్బవరం సినిమా హీరో ఎలా ఇవ్వాలో తెలియక ముందు షార్ట్ ఫిలిమ్స్ మీద దృష్టి పెట్టారు. అనేక షార్ట్ ఫిలిమ్స్ లో చేసిన ఆయన తర్వాత రాజావారు రాణి వారు అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టాడు.

    ఏ మాత్రం స్టార్ బ్యాగ్రౌండ్ లేకపోవడం కాస్త మైనస్ అయినా సరే మొదటి సినిమాతోనే కొంచెం ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇక ఆయన రెండో సినిమాగా ఎస్ ఆర్ కళ్యాణ మండపం అనే సినిమా వచ్చింది. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు నుంచే ప్రేక్షకులలో అంచనాలను రేకెత్తించింది.. అందుకు ముఖ్యమైన కారణం ఏమిటి అంటే సినిమాలోని పాటలు అనే చెప్పాలి. చైతన్య భరద్వాజ్ అందించిన సంగీతం ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు పెంచే విధంగా ఆకట్టుకుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

    కధ కూడా ఆయనదే

    కధ కూడా ఆయనదే

    మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమా కి స్వయంగా కథ స్క్రీన్ ప్లే మాటలు కూడా హీరో కిరణ్ అబ్బవరం అందించడం. డైలాగ్ కింగ్ సాయి కుమార్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాని ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రమోదు రాజు నిర్మించారు. ఇక ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ కూడా బాగానే చేసింది. ఎందుకంటే దాదాపుగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని లొకేషన్స్ లో కలుపుకుని బిజినెస్ రూ. 4.55 కోట్లు జరిగింది.

    దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 4.80 కోట్లుగా ఫిక్సైంది. ఇక, మూడు రోజుల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ. 4.06 కోట్లు షేర్ రాబట్టింది. అయితే బ్రేక్ ఈవెన్ రావాలి అంటే నాలుగు కోట్ల 80 లక్షలు వస్తే వచ్చినట్టు లెక్కలు వేశారు. రోజువారీ కలెక్షన్స్ విషయానికి వస్తే ఒకటో రోజు కోటి 41 లక్షల సాధించిన రెండో రోజు కలెక్షన్స్ 1.25Cr కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో రోజు కోటి 40 లక్షల కలెక్షన్లతో దూసుకుపోగా నాలుగో రోజు 74 లక్షల కలెక్షన్లతో నాలుగు కోట్ల 80 లక్షల సాధించి సాధించింది.

    కలెక్షన్స్ చూస్తే

    కలెక్షన్స్ చూస్తే

    నాలుగో రోజైన సోమవారం నాడు ఎస్ఆర్ కల్యాణ మండపం కలెక్షన్స్ లో డ్రాప్ కనిపించింది. ఫలితంగా నైజాంలో రూ. 23 లక్షలు, సీడెడ్‌లో రూ. 16 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 11 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 4 లక్షలు, నెల్లూరులో రూ. 2.40 లక్షలు వసూలయ్యాయి. దీంతో మొత్తంగా నాలుగో రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ. 0.74 కోట్ల షేర్‌తో పాటు రూ. 1.15 కోట్లు గ్రాస్‌ను రాబట్టిందీ చిత్రం. తద్వారా బాక్సాఫీస్‌పై సత్తా చూపించింది.

    Recommended Video

    Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
    టోటల్ గా

    టోటల్ గా

    ఎస్ఆర్ కళ్యాణమండపం' మూవీకి అన్ని ప్రాంతాల్లో మంచి కలెక్షన్లు వచ్చాయి. నాలుగు రోజులు కలిపి నైజాంలో రూ. 1.93 కోట్లు, సీడెడ్‌లో రూ. 99 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 56 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 31 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 23 లక్షలు, గుంటూరులో రూ. 44 లక్షలు, కృష్ణాలో రూ. 22 లక్షలు, నెల్లూరులో రూ. 12 లక్షలు వసూలయ్యాయి.

    దీంతో మొత్తంగా మూడో రోజులకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి రూ. 4.80 కోట్లు షేర్‌తో పాటు రూ. 7.79 కోట్లు గ్రాస్‌ ఈ మూవీ సొంతం అయింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 14 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 30 లక్షలు వసూలు చేసింది. దీంతో మొత్తంగా మూడు రోజులకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.22 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.73 కోట్లు గ్రాస్‌ వచ్చింది. దీంతో మొత్తం నలభైరెండు లక్షల లాభాల్లో ఉంది.

    English summary
    Kiran Abbavaram Now Did a Film SR Kalyanamandapam Under Sridhar Gade Direction. This Movie Collected Rs 4.80CR Share in four Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X