Just In
Don't Miss!
- Sports
బుద్ధి లేనోడే గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు రూ.10 కోట్లు వెచ్చిస్తాడు: స్కాట్ స్టైరిస్
- Automobiles
ఇంటర్నేషల్ మార్కెట్లలో బజాజ్ పల్సర్ మోటార్‌సైకిళ్లకు భలే డిమాండ్!
- News
ఆ విషయంలో జగన్ సర్కార్ , నిమ్మగడ్డ ఏకాభిప్రాయం- కేంద్రం కోర్టులోకి బంతి
- Finance
ఒక్కరోజు రూ.5.2 బిలియన్ డాలర్లు నష్టపోయిన ముఖేష్ అంబానీ
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Box office: క్రాక్ లేటెస్ట్ కలెక్షన్స్.. ఇంకా లాభాల్లోకి రాలేదు.. ఆ సినిమాలు క్లిక్కయితే డేంజరే..
సోలో బ్రతుకే సో బెటర్ ఇచ్చిన బూస్ట్ బాగానే పని చేసింది. ఈ ఏడాది ఎలా గడుస్తుందో అనుకున్న సినీ నిర్మాతలకు ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే కొంత ధైర్యం వచ్చిందనే చెప్పాలి. సోలో బ్రతుకే.. మిక్సీడ్ టాక్ అందుకున్నప్పటికి మూడు కోట్ల వరకు ప్రాఫిట్స్ ను అందించింది. ఇక అందరిచూపు ఇప్పుడు రవితేజ క్రాక్ పైనే ఉంది. ఒడిదుడుకుల నడుమ విడుదలైన సినిమా ఇప్పటివరకు ఎంత రాబట్టిందనే విషయంలోకి వెళితే..
'అల్లుడు అదుర్స్' ప్రీ రిలీజ్ ఈవెంట్: స్టైలిష్ లుక్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ (ఫొటోలు)

రెండు షోలే పడినా..
క్రాక్ పక్కా మాస్ కమర్షియల్ సినిమా కావడంతో మొదటిరోజు అభిమానుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. విడుదల ఆలస్యం అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికి ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన క్రాక్ శనివారం కేవలం రెండు షోలతోనే హై రేంజ్ లో రెస్పాన్స్ అందుకుంది.

సినిమాకు అదే హెల్ప్ అయ్యింది
ఏ సినిమాకైనా సరే మొదటి రెండు షోల నుంచి వచ్చే టాక్ చాలా ప్రధానమైంది. క్రాక్ సినిమాకు కూడా అదే హెల్ప్ అయ్యింది. సినిమాకు ఓపెనింగ్స్ భారీ స్థాయిలో అందాయి. మొదట రెండు షోలకు 1 కోటికి పైగా కలెక్షన్స్ అందాయి. కేవలం 50% సిట్టింగ్ కెపాసిటీతో ఆ స్థాయిలో వసూళ్లు అందుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు.

మొదటి రోజు ఎంత వచ్చాయంటే..
మొదటి రోజు సినిమా విడుదల కాకపోవచ్చు అనే అనుమానాల వల్ల కొందరు థియేటర్స్ నుంచి వెనుదిరిగారు. లేకపోతే కలెక్షన్స్ ఇంకా హై లెవెల్లో ఉండేవి. ఇక ఆదివారం ఫుల్ షోలు నడిచాయి కాబట్టి మొదటి రోజుగా పరిగణించి లెక్కల్లోకి వెళితే.. డే 1- 6కోట్లకు పైగా షేర్స్ అందాయి. ఆ తరువాత కూడా అలానే కొనసాగింది.

రెండవరోజు ఎంతక్ వచ్చాయంటే..
అయితే సోమవారం కూడా కలెక్షన్స్ పరవాలేదు అనే విధంగా వచ్చాయి. ఏరియాల వారిగా రెండవ రోజు కలెక్షన్స్ లెక్కలు ఈ విధంగా ఉన్నాయి. నైజాంలో అత్యధికంగా 1.03కోట్లను అందుకోగా సీడెడ్ లో 61లక్షల షేర్స్ వచ్చాయి. ఈస్ట్, వెస్ట్, గుంటూరు వంటి ఏరియాల్లో కూడా మాస్ రాజా హవా గట్టిగానే కొనసాగింది. రెండవ రోజు దక్కిన మొత్తం షేర్స్ 3.15కోట్లని తెలుస్తోంది.

ఇంకా ఎంత సాధించాలి..
ఇప్పటివరకు క్రాక్ కు దక్కిన మొత్తం కలెక్షన్స్ రూ.10.61కోట్లని సమాచారం. వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన ఈ కలెక్షన్స్ సంతృప్తిని ఇచ్చినప్పటికీ ఇంకా ప్రాఫిట్ జోన్ లోకి అయితే రాలేదు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17.5కోట్లు. ఇంకా రూ6.89కోట్లు షేర్స్ సాధిస్తేనే లాభల్లోకి వచ్చినట్లు. ఇక శనివారం కూడా నాలుగు షోలు పడి ఉంటే ఈ లెక్కలు మరోలా ఉండేవి.

రానున్న రోజుల్లో.. మరింత పోటీ..
రానున్న రోజులు క్రాక్ సినిమాకు చాలా కీలకం కానున్నాయి. హిట్ టాక్ అయితే అందుకుంది కాబట్టి కలెక్షన్స్ ఇదే ఫ్లోలో ఉంటే వారంలోనే మంచి లాభాలను అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక బుధవారం మాస్టర్ సినిమా విడుదల కానుండగా ఆ తరువాత రోజు రెడ్, అల్లుడు అదుర్స్ సినిమాలు రానున్నాయి. మరి ఈ పోటీలో మాస్ రాజా సినిమా ఎంతవరకు నిలదొక్కుకుంటుందో చూడాలి.