»   » నాని మూవీ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం?

నాని మూవీ వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాని హీరోగా తెరకెక్కిన చిత్రం 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ వారు నిర్మించిన సినిమా కావడం, అందాల రాక్షసి చిత్ర దర్శకుడు హనురాఘవపూడి దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఓపెనింగ్స్ పరంగా ఫర్వాలేదనిపించింది.

అయితే సినిమా విడుదలై మూడో వారంలోకి ఎంటరైనా.....ఆశించిన ఫలితాలు మాత్రం రాబట్టలేదు. నిర్మాతలకు ఈ సినిమా వల్ల కొద్దిపాటి లాభాలు మిగిలినా.....సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు మాత్రం నష్టపోయినట్లు సమాచారం.


Krishna Gaadi Veera Prama Gaadha Box Office Report

నిర్మాతలు ఈచిత్రాన్ని ప్రింట్, పబ్లిసిటీ ఖర్చులతో కలిపి ఓవరాల్ గా 14 కోట్లలో నిర్మించినట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రైట్స్, శాటిలైట్ రైట్స్(4కోట్లు), ఓవర్సీస్, ఆడియో, ఇతర అన్ని హక్కులన్నీ కలిపి మొత్తం రూ. 16.5 కోట్ల వరకు వచ్చాయి. అంటే దాదాపు 2 కోట్ల పై చిలుకు లాభం వచ్చిందన్నమాట.


అయితే సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఇప్పటి వరకు లాభాలు రాలేదని తెలుస్తోంది. అన్ని ఏరియాలు కలిపి ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ 12 కోట్లకు అమ్ముడవ్వగా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ కేవలం 10 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అంటే సినిమాను కొన్నడిస్ట్రిబ్యూటర్లకు రూ. 2 కోట్ల వరకు లాస్. మరో రెండు వారాలు సినిమా బాగా ఆడితే నష్టాల శాతం కొంతమేర తగ్గే అవకాశం ఉంది.


Krishna Gaadi Veera Prama Gaadha Box Office Report

ఓవరాల్ గా 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' చిత్రం నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టినా డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం స్పల్ప నష్టాలను మిగిల్చింది. ఈ ఎఫెక్టు తప్పకుండా నాని తర్వాతి సినిమాపై ఉంటుందని అంటున్నారు.

English summary
Krishna Gaadi Veera Prama Gaadha Box Office Report is out.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu