»   » కృష్ణార్జున యుద్ధం తొలిరోజు కలెక్షన్లు.. కృష్ణ అండతో!

కృష్ణార్జున యుద్ధం తొలిరోజు కలెక్షన్లు.. కృష్ణ అండతో!

Subscribe to Filmibeat Telugu

నాని డ్యూయెల్ రోల్ లో నటించిన తాజా చిత్రం కృష్ణార్జున యుద్ధం ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సినీ విశ్లేషకుల నుంచి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. నాని ద్విపాత్రాభినయం చేయడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. గత 8 చిత్రాలుగా నాని పరాజయం లేకుండా దూసుకుపోతున్నాడు. కాగా కృష్ణార్జున యుద్ధం చిత్రంపై ఉన్న అంచనాలతో తొలి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న మేర్లపాక గాంధీ నానితో కృష్ణార్జున యుద్ధం చిత్రం తెరకెక్కించాడు.

Krishnarjuna Yuddham Cinema Review కృష్ణార్జున యుద్ధం సినిమా రివ్యూ
మిక్స్డ్ రివ్యూలు

మిక్స్డ్ రివ్యూలు

మంచి అంచనాలతో విడుదలైన కృష్ణార్జున యుద్ధం చిత్రానికి క్రిటిక్స్ నుంచి మిక్స్డ్ రివ్యూలు లభించాయి. అభిమానుల్లో కూడా ఈ చిత్రంపై భిన్నమైన స్పందన లభించింది.


ద్విపాత్రాభినయంలో

ద్విపాత్రాభినయంలో

జెంటిల్ మాన్ చిత్రం తరువాత నాని నటించిన మరో డ్యూయెల్ రోల్ ఫిలిం ఇది. మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.


తొలి రోజు వసూళ్లు

తొలి రోజు వసూళ్లు

కృష్ణార్జున యుద్ధం చిత్రం తొలిరోజు పరవాలేదనిపించే వసూళ్లు సాధించింది. రెండుతెలుగు రాష్ట్రలో ఈ చిత్రం 4.57 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 6 కోట్ల వరకు షేర్ రాబట్టడం విశేషం.


కృష్ణ పాత్రకు మంచి రెస్పాన్స్

కృష్ణ పాత్రకు మంచి రెస్పాన్స్

వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా వంటి చిత్రాల తరువాత మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ఇది. నానిని గాంధీ డ్యూయెల్ రోల్ లో చూపించాడు. చిత్తూరు యాసలో మాట్లాడుతూ నాని పోషించిన కృష్ణ పాత్రకు మంచి స్పందన వస్తోంది.
English summary
Krishnarjuna Yuddham first day box office collections report. Krishnarjuna Yuddham directed by Merlapaka Gandhi
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X