»   »  ‘కృష్ణార్జున యుద్ధం’ యూఎస్ఏ కలెక్షన్ రిపోర్ట్: ఎంసీఏ కంటే వెనకే....

‘కృష్ణార్జున యుద్ధం’ యూఎస్ఏ కలెక్షన్ రిపోర్ట్: ఎంసీఏ కంటే వెనకే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా 'కృష్ణార్జున యుద్ధం'. అనుపమ పరవేుశ్వరన్, రుక్సర్ మీర్ హీరోయిన్స్. మేర్లపాక గాంధీ దర్శకుడు. వెంకట్ బోయినపల్లి సమ‌ర్పణలో షైన్ స్క్రీన్స్ పతాకంపై రూపొందించారు. నాని ఒక్కో హిట్ కొడుతూ యూఎస్ఏలో తన మార్కెట్ బాగా పెంచుకున్నాడు. ఆయన హీరోగా వచ్చిన గత చిత్రాలు ఇక్కడ మంచి ఓపెనింగ్స్ సాధించాయి. తాజా చిత్రం 'కృష్ణార్జున యుద్ధం' యూఎస్ఏలో నాని గత సినిమాల కంటే గ్రాండ్‌గా విడుదలైంది.

Krishnarjuna Yuddham Cinema Review కృష్ణార్జున యుద్ధం సినిమా రివ్యూ
ఎంసీఏను బీట్ చేయలేక పోయిన 'కృష్ణార్జున యుద్ధం'

ఎంసీఏను బీట్ చేయలేక పోయిన 'కృష్ణార్జున యుద్ధం'

‘కృష్ణార్జున యుద్ధం' యూఎస్ఏలో మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ.... నాని గత చిత్రాలతో పోలిస్తే వసూళ్లు చాలా తక్కువగా నమోదయ్యాయి. నాని గత చిత్రం ‘ఎంసీఏ' వసూళ్లను బీట్ చేయడంలో ‘కృష్ణార్జున యుద్ధం' యుద్ధం విఫలమైంది.

నాని కెరీర్లోనే హయ్యెస్ట్ షోస్

నాని కెరీర్లోనే హయ్యెస్ట్ షోస్

‘కృష్ణార్జున యుద్ధం' ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ మాగ్నస్ మీడియా వారు రూ. 3.50 కోట్లకు దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని బుధవారం యూఎస్ఏలో 600 షోలు ప్రదర్శించారు. ఓపెనింగ్ డే నాని కెరీర్లోనే హయ్యెస్ట్ హయ్యెస్ట్ షోలు, స్క్రీన్లో ఈ చిత్రం విడుదలైంది.

ప్రీమియర్ షోల ద్వారా ఎంత వసూలైందంటే...

ప్రీమియర్ షోల ద్వారా ఎంత వసూలైందంటే...

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బుధవారం 148 లొకేషన్లలో ప్రదర్శించిన ప్రీమియర్ షోల ద్వారా $148,296 వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా కొన్ని స్క్రీన్లకు సంబంధించిన కలెక్షన్స్ వివరాలు బయటకు రావాల్సింది ఉంది. ఎవరాల్ రిపోర్ట్ వచ్చే సమయానికి $200,000 వసూళ్లు మించదని అంచనా.

ఎంసీఏ మూవీ టాప్

ఎంసీఏ మూవీ టాప్

ఇక నాని నటించి గత చిత్రం ‘ఎంసీఏ' ప్రమియర్ షోల ద్వారా $303k గ్రాస్ వసూలు చేసింది. ‘కృష్ణార్జున యుద్ధం' భారీ సంఖ్యలో విడుదల కావడంతో ఎంసీఏను అధిగమిస్తుందని అంతా అంచనా వేశారు, కానీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మ్యాజిక్ మార్కును అందుకోవడంలో విఫలమైంది.

English summary
Nani's Krishnarjuna Yudham opened to decent response and made a good collection at the US box office during the premiere shows on Wednesday. But the movie has failed to rake in moolah as compared to his earlier release, MCA.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X