»   » షాక్... అంత తక్కువ బడ్జెట్ లో తీసారా?

షాక్... అంత తక్కువ బడ్జెట్ లో తీసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పివిపి సినిమాస్, మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బేనర్ వారు సంయుక్తంగా నిర్మించిన సస్పెన్స్ డ్రామా ‘క్షణం'. అడవిశేష్, ఆదాశర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో అనసూయ భరద్వాజ సరికొత్త పాత్రలో నటించింది. జ్యోతిలక్ష్మి ఫేమ్ సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవి వర్మ ముఖ్య పాత్రలు పోషించారు. రవికాంత్ పేరెపు దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం ఈ వీకెండ్ విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

‘క్షణం' రివ్యూ


మహేష్ బాబు, సమంత ఈ సినిమాను ప్రమోట్ చేయడం, ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటం, పబ్లిసిటీ కూడా బాగా చేయడంతో మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా పెట్టిన పెట్టుబడికి మూడు నాలుగు రెట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.


Kshanam movie budget details

ఈ సినిమాను కేవలం రూ. 1 కోటి ప్రొడక్షన్ ఖర్చుతో తెరకెక్కించారు. అయితే పబ్లిసిటీ కోసం మరో కోటి రూపాయలు ఖర్చు చేసారు. ఇలా మొత్తం 2 కోట్ల బడ్జెట్ అయింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఓవరాల్ రన్ లో కనీసం 6 నుండి 8 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. శాటిలైట్ రైట్స్ రూపంలో నిర్మాతలకు మరింత ఆదాయం రాబోతోంది.


అడవిశేష్, ఆదాశర్మ, అనసూయ భరద్వాజ, సత్యదేవ్, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, రవివర్మ ప్రధాన తారాగణంగా నటించిన ఈ చిత్రానికి స్టోరీ: అడవి శేష్, ఎడిటింగ్: అర్జున్ శాస్త్రి, రవికాంత్ పేరెపు, స్క్రీన్ ప్లే: రవికాంత్ పేరెపు, అడవి శేష్, సాహిత్యం: సిరాశ్రీ, రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, డైలాగ్స్, స్క్రిప్ట్ గైడెన్స్: అబ్బూరి రవి, నిర్మాత: పరమ్ వి.పొట్లూరి, కెవిన్, అన్నె, దర్శకత్వం: రవికాంత్ పేరెపు.

English summary
Kshanam has been made with a budget of Rs 2 cr and it is expected to make around Rs 6 to 7 crores at the box office.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu