»   » ఈ వారం భాక్సాఫీస్ : రెండు తప్ప మిగతావన్ని తుస్సే

ఈ వారం భాక్సాఫీస్ : రెండు తప్ప మిగతావన్ని తుస్సే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొన్న శుక్రవారం దాదాపు 14సినిమాలు టాలీవుడ్ భాక్సాఫీస్ వద్ద విడుదల అయ్యాయి. అయితే అన్నీ చిన్న సినిమాలే. వీటిలో రకరకాల జానర్స్ ఉన్నా రెండు సినిమాలు మాత్రమే ప్రేక్షకుడి చేత మంచి మార్కులు వేయించుకున్నాయి.

ఆ రెండు సినిమాలు మరేవో కాదు..టెర్రర్, క్షణం. అలాగే మరో విశేషం ఏమిటీ అంటే ఈ రెండు సినిమాలు కూడా ధ్రిల్లర్ జానర్ లో వచ్చినవి కావటం. ఈ రెండు సినిమాలు ఓపినింగ్స్ పెద్దగా లేకపోయినా కేవలం మౌత్ టాక్ , సక్సెస్ మీట్ లతో వచ్చే న్యూస్ లతో ముందుకు వెళ్తున్నాయి.


ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల కలెక్షన్స్ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. ఫస్ట్ వీకెండ్ లో డీసెంట్ ఫిగర్స్ కలెక్ట్ చేసాయి. ఈ సినిమాలు మరిన్ని స్క్రీన్స్ పెంచటం కూడా జరిగింది.


Kshanam and Terror managed to garner positive response

క్షణం చిత్రం సీట్ ఎడ్జ్ సస్పెన్స్ ధ్రిల్లర్ అయితే టెర్రర్ సినిమా క్రైమ్ డ్రామా. రెండు సినిమాలకు ప్లస్ ఎలిమెంట్..గ్రిప్పింగ్ నేరేషన్. రెండు చిత్రాల్లో చెప్పుకోదగ్గ కాస్టింగ్ లేకపోవటం తో కేవలం సినిమా బాగుందనే టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత మాత్రమే ప్రేక్షకుడు ధియేటర్స్ కు వెళ్లటానికి ఇంట్రస్ట్ చూపెడుతున్నాడు.


మరో ప్రక్క అంతకు ముందు రిలీజైన కృష్ణాష్టమి, కృష్ణగాడి వీర ప్రేమ గాధ చిత్రాలు కూడా అలాగే వీకెండ్స్ లో ఓకే అనిపించుకుంటూ ముందుకు సాగుతున్నాయి. రెండూ పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలు కావటంతో మాగ్జిమం ధియోటర్స్ లో అవే ఉన్నాయి. అదే సమయంలో హిట్ టాక్ తెచ్చుకున్న మలుపు చిత్రం కూడా బాగానే ఆడుతోంది.


ఏదిఏమైనా.. ఈ ఏడాది చిన్న సినిమాలకు థియేటర్ల దొరకడం అనుకూలంగా మారిందనే చెప్పాలి. దాదాపు 14 సినిమాలు క్రిందటి వారం రిలీజ్ అయ్యియి. అందులో ఏడు స్ట్రెయిట్‌ చిత్రాలు, రెండు ఆంగ్ల చిత్రాలు, నాలుగు హిందీ చిత్రాలు, ఒక తమిళ చిత్రం విడుదలకావడం విశేషం.

English summary
Last Friday,only two films – Kshanam and Terror managed to garner positive response from moviegoers and critics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu