»   » ఏ సినిమా హిట్...ఏది ఫట్ ? (ట్రేడ్ టాక్)

ఏ సినిమా హిట్...ఏది ఫట్ ? (ట్రేడ్ టాక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇంతకు ముందు ఓ చిత్రం రిలీజైందంటే పాజిటివ్ టాక్ అయినా నెగిటివ్ టాక్ అయినా రావటానికి చాలా సమయం తీసుకునేది. ఈ లోగా ఆ చిత్రం స్టడిగా మినిమం కలెక్షన్స్ తో కొనసాగేది. హిట్టైతే పుంజుకునేది. ప్లాఫ్ అయితే టాక్ రావటానికి లేటు కావటంతో మెల్లిగా డ్రాప్ అయ్యేది. నిర్మాత,డిస్ట్రిబ్యూటర్స్ కు పెద్దగా నష్టం ఉండేది కాదు. కానీ పరిస్ధితి మారింది.

ఈ కాలంలో పెరిగిన సెల్ వినియోగం, సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్, వెబ్ రివ్యూలు...సినిమా ఫేట్ ని క్షణాల్లో బయిటకు చెప్పేస్తున్నాయి. సినిమా రిలీజ్ రోజు ఇంటర్వెల్ కు వచ్చేసరికే హిట్ లేదా ఫట్ అనేది బయిటకు వచ్చేస్తోంది. ఈ నేపధ్యంలో సినిమా టాక్ అనేది ప్రధానం అయ్యిపోయింది.

ఇక క్రిందటి శుక్రవారం మూడు చిత్రాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అవి కళ్యాణ్‌రామ్ హీరోగా 'ఓం', 'అల్లరి' నరేష్ 'కెవ్వుకేక', యశ్వంత్ కథానాయకుడుగా 'మేడ్ ఇన్ వైజాగ్'. ఈ మూడు చిత్రాలలో వేటి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి. అంతకు ముందు రిలీజైన చిత్రాల పరిస్ధితి ఏమిటి అనేది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

విశ్లేషణ తో కూడిన ట్రేడ్ టాక్ స్లైడ్ షో లో....

‘ఓం'

‘ఓం'

క్రిందటి వారం రిలీజైన చిత్రాల్లో ముఖ్యంగా ఇందులో చెప్పుకోవలసింది ‘ఓం'గురించి. సొంత నిర్మాణ సంస్థలో ‘ఓం త్రీడీ'ని తెరకెక్కించి కళ్యాణ్‌రామ్ పెద్ద సాహసమే చేశారు. సునీల్‌రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మూడింతల యాక్షన్‌తో సాగింది. త్రీడీ సినిమా కావడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. తెలుగు పరిశ్రమకు త్రీడీ చిత్రాలు కొత్త కాకపోయినా, పూర్తి యాక్షన్ త్రీడీ మాత్రం ఇదే కావడం గమనార్హం. అయితే మార్నింగ్ షోకే పూర్తి నెగిటివ్ రావటం మైనస్ అయ్యింది. హాలీవుడ్ చిత్రం వాంటెడ్ ఆధారంగా వచ్చిన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యింది.

‘కెవ్వుకేక'

‘కెవ్వుకేక'

రిలీజ్ కు ముందు క్రేజ్ తెచ్చుకున్న చిత్రం ‘కెవ్వుకేక'. దేవిప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లరి' నరేష్ ‘కెవ్వుకేక' కామెడీతో సా...గింది. నరేష్ చిత్రం అనేగానే మంచి ఓపెనింగ్సే వుంటాయి. కామెడీ కోసమైనా ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. ఈ చిత్రం విషయంలోనూ అదే జరిగింది. అయితే చిత్రం సెటప్ సరిగ్గా లేకపోవటంతో అనుకున్న రీతిలో కామెడీ పండించలేక చతికిల పడింది. హాలీవుడ్ చిత్రం కింగ్స్ రాన్సమ్ ఆధారంగా వచ్చిన ఈ చిత్రం ఫెయిల్యూర్ అయ్యింది.

‘మేడ్ ఇన్ వైజాగ్'

‘మేడ్ ఇన్ వైజాగ్'

శుక్రవారం విడుదలైన మరో చిత్రం ‘మేడ్ ఇన్ వైజాగ్' కూడా ఫీల్‌గుడ్ మూవీగా రూపొందింది. మరాఠి చిత్రం రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం తక్కువ బడ్జెట్ లో రూపొందినా ఆ డబ్బులు కూడా వెనక్కి రాబట్టుకునే పరిస్ధితి కనపడటం లేదు. రెండే పాత్రల మధ్య కథ నడవటం, రొమాన్స్ సీన్స్ బాగా పండకపోవటం, సెకండాఫ్ బోర్ కొట్టడం సినిమాకు మైనస్ గా మారాయి. ఈ చిత్రం కూడా పెట్టిన బడ్జెట్ కూడా వెనక్కి రాదంటున్నారు.

సాహసం

సాహసం

ఐతే, అనుకోకుండా ఒకరోజు, ప్రయాణం వంటి చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో గోపీచంద్, తాప్సీ జంటగా అంతకు ముందు వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ‘సాహసం'. అన్ని కమర్షియల్ హంగులతో గోపీచంద్‌తో దర్శకుడు గొప్ప సాహసమే చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడనే చెప్పొచ్చు. తాతల నాటి నిధికోసం ఓ సామాన్యుడు సాగించిన వేటను తెరపై దర్శకుడు తీర్చిదిద్దిన తీరు..దీనికి తోడు మాస్, యాక్షన్ అంశాలతోపాటు థ్రిల్‌ను కలిగించే సన్నివేశాలు జోడించడంతో సినిమా మంచి కలెక్షన్లనే రాబట్టుకుంటోంది.

‘పెళ్లి పుస్తకం'

‘పెళ్లి పుస్తకం'

‘సాహసం' చిత్రంతో పాటు ఈ వారం మరో చిత్రం ‘పెళ్లి పుస్తకం' కూడా విడుదలయింది. ఇది బాక్సాఫీస్ వద్ద సాదాసీదా చిత్రంగానే మిగిలిపోయింది. కలెక్షన్లు ఆశాజనంగా లేవు. కొరియా చిత్రం మై లిటిల్ బ్రైడ్ ని కాపీ కొడుతూ వచ్చిన ఈ చిత్రం ఏ యాంగిల్ లోనూ ప్రేక్షకుడుని సంతృప్తి పరచలేకపోయింది.

‘సింగం' (యముడు-2)

‘సింగం' (యముడు-2)


సూర్య నటించిన చిత్రం ‘సింగం' (యముడు-2) కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. ఇప్పటికీ బి,సి సెంటర్లలలో ఈ చిత్రం మంచి కలెక్షన్స్ నే రాబట్టుకుంటోందని చెప్తున్నారు. మొదట యావరేజ్ చిత్రం అనకున్న ఈ చిత్రం డబ్బింగ్ చిత్రమైనా స్ట్రైయిట్ చిత్రంగా కలెక్షన్స్ వసూలు చేయటం ట్రేడ్ లో ఆసక్తి కరంగా మారింది.

‘బలుపు'

‘బలుపు'

రవితేజకు చాలా కాలం తర్వాత వచ్చిన హిట్ ‘బలుపు'. ఈ చిత్రం సంబంధించి కలెక్షన్లు స్టడీగానే సాగుతున్నాయి. కామెడీ బాగా పండటం, రవితేజ గతంలోలా అదే జోష్ తో చేయటం ప్రేక్షకుడుని ఆకట్టుకుంది. మొదటి వారమే ఈ చిత్రం మంచి ఓపినింగ్స్ రప్పించుకుని, వీకెండ్స్ లో దుమ్ము రేపింది.

English summary

 Kalyan Ram's Om and Allari Naresh's Kevvu Keka fails to impress. ‘OM’ is just another loud and clichéd action drama with a very routine plot. The 3D effects do not add much value for the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu