twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ఓవర్ సీస్ కలెక్షన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : శేఖర్ కమ్ముల సినిమాలకు మొదటి నుంచీ ఓవర్ సీస్ లో మంచి బిజినస్ జరుగుతూ వస్తోంది. తాజాగా ఆయన చిత్రం 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌' కూడా అక్కడ మంచి రేట్లుకు అమ్ముడుపోయింది. ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగానూ ఇక్కడ కన్నా చాలా బాగుంది. 51 స్క్కీన్స్ లో విడుదలైన ఈ చిత్రం 1.84 కోట్లు వీకెండ్ లో అక్కడ కలెక్టు చేసింది. కేవలం నార్త్ అమెరికాలోనే ఈ మొత్తం వచ్చిందని చెప్తున్నారు. మిగతా ఓవర్ సీస్ ఏరియాలు కూడా కలిపితే రెండు కోట్లు అవుతుందని తెలుస్తోంది.

    ఇక డిస్ట్రిబ్యూటర్స్ కోరిక మేరకు ఈ చిత్రాన్ని ట్రిమ్ చేసారు శేఖర్ కమ్ముల. సెప్టెంబర్ 14 న ఈ చిత్రం విడుదల అయిన ఈ చిత్రం ఇండియాలో మాత్రం డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే వీకెండ్ లో ఇక్కడ కూడా మంచి బిజినెస్సే చేసింది. అమిగోస్‌ క్రియేషన్స్‌ పతాకంపెై చంద్రశేఖర్‌ కమ్ముల- శేఖర్‌ కమ్ముల సంయుక్తంగా నిర్మించారు. చిత్రంలో శ్రియ,అమల,అంజలా జవేరి వంటి సీనియర్ హీరోయిన్స్ చేసారు. సినిమా గురించి శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. '' నా చిన్ననాటి నవ్వు, అమాయకత్వం, ఓల్డ్‌ స్టైల్‌ అన్నీ తెరకెక్కించే ముందు సిద్ధం చేసేందుకే 6నెలలు పట్టింది. లవ్‌, రొమాన్స్‌, అల్లరి, సెంటిమెంట్‌ అన్నీ ఉన్న ఆహ్లదకర సినిమా చేశాను. పేద్ద పేరొస్తుందని అమాయకత్వంతో తీశాను'' అన్నారు .

    అప్పుడు హ్యాపీడేస్‌ కాలేజీలో..ఇప్పుడు హ్యాపీడేస్‌ కాలనీలో! ఇది నా చిన్నతనం లాంటి సినిమా. అమాయకం.. ఆహ్లదం..అందమైన నవ్వు... అనుభూతి....ఇలా ఎన్నిటినో తెరపరిచాను ఈసారి'' అన్నారు శేఖర్‌ కమ్ముల. ఈ చిత్రంలో ఇద్దరు ఆడపిల్లల కన్నతల్లి పాత్రలో అమల నటించారు. ''ఆ పాత్ర ఎంతో స్ఫూర్తిదాయకమైంది. నేను ఒక తల్లిని కావటంతో ఆ పాత్ర నాకు దగ్గరగా ఉన్నట్లు అనిపించింది. కొద్దిసేపు మాత్రమే కనిపించే మంచి పాత్రలో నటించటం బాగుంది'' అని అమల తెలిపారు.

    సుదీర్ఘ కాలం తర్వాత కెమెరా ముందుకు రావటం గురించి ఆమె మాట్లాడుతూ ''సాంకేతికపరంగా సినీరంగం ఎంతో ఎదిగింది. దాంతో అంతా వైవిధ్యంగా కనిపించింది. అప్పట్లో మేం ఒక సన్నివేశంలో ఎలా నటించింది చూసుకోవటానికి నెల రోజులు పట్టేది. కానీ నేటి సాంకేతిక పరిజ్ఞానం వెంటనే చూసుకోవటానికి అవకాశం ఇస్తున్నది. అంతేకాక నటీనటుల నుంచి ఏం కావాలో దాన్ని చక్కగా రాబట్టే శేఖర్‌ దర్శకత్వంలో నటించటం గొప్ప అనుభవం'' అని ఆమె నవ్వుతూ చెప్పారు.

    English summary
    Sekhar Kammula's Life Is Beautiful has collected a whopping $ 3,40,458 (Rs 1.84 Crores) from 51 screens in its opening weekend. This amount is collected from North America alone. If we add the revenue from other overseas markets, and unreported screens it comes around Rs 2 Crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X