»   » లై, జానకీ నాయక, నేనే రాజు.... మొదటి రోజు కలెక్షన్లు ఎలాఉన్నాయంటే...

లై, జానకీ నాయక, నేనే రాజు.... మొదటి రోజు కలెక్షన్లు ఎలాఉన్నాయంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

రానా-నేనే రాజు-నేనే మంత్రి, నితిన్-లై, బెల్లంకొండ శ్రీనివాస్-జయ జానకి నాయక చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. అయితే ఈ చిత్రాలపై మొదటి నుంచి విపరీతమైన క్రేజ్ పెంచుతూ ఆడియన్స్ ని తెగ ఇంప్రెస్ చేస్తూ వచ్చారు. నిన్న మొన్నటి వరకు హీరో రానా ఎన్ని రకాలుగా ప్రమోషన్ చేయాలో అన్ని రకాలుగానూ ట్రై చేసారు.

అంతెందుకు ఇప్పుడు బుల్లి తెర ప్రేక్షకులను కట్టి పడేస్తున్న 'బిగ్ బాస్ ' షో లో కూడా సందడి చేశాడు, ఇక బోయపాటి శ్రీనివాస్ తెరకెక్కించిన జయ జానకి నాయక చిత్రం కోసం ఏకంగా శ్రీనివాస్, రకూల్, కేథరిన్ ఎన్నో చానల్స్ లో చిట్ చాట్ చేస్తూ కనిపించారు. నితిన్ నటించిన 'లై' చిత్రానికైతే త్రివిక్రమ్, టాలీవుడ్ ప్రముఖులు తెగ మెచ్చకుంటూ ప్రమోట్ చేశారు.


మొదటి రోజు కలెక్షన్లు

మొదటి రోజు కలెక్షన్లు

ఈ చిత్రాల్లో నటించిన హీరోలు తమ చిత్రాలపై ఎంతో నమ్మకాన్ని కూడా పెంచుకున్నారు. ఇక లై, జయ జానకి చిత్రాలు హిట్ అయినా 45 నుంచి 50 కోట్ల వసూళ్లు సాధిస్తేనే బయ్యర్స్ ప్రాఫిట్ జోన్ కు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఈ మూడు సినిమాల మొదటి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయి అని పరిశీలిస్తే...


జయ జానకీ నాయక

జయ జానకీ నాయక

బోయపాటి శ్రీనివాస్- బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్ లో విడుదలైన సినిమా జయ జానకీ నాయక. ఎక్కువ స్క్రీన్ లు దొరక్కపోయినా, మంచి కలెక్షన్లు సాధించింది.


నైజాం 90 లక్షలు, సీడెడ్ 55, నెల్లూరు 19, గుంటూరు 49, కృష్ణ 16, వెస్ట్ 28, ఈస్ట్ 24, ఉత్తరాంధ్ర 45 లక్షలు.


Nithin LIE Movie Public Review
లై

లై

నితిన్ - హను రాఘవపూడి కాంబినేషన్ లో 14 రీల్స్ సంస్థ నిర్మించిన చిత్రం లై. ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.


నైజాం 81 లక్షలు, సీడెడ్ 42, నెల్లూరు 6, గుంటూరు 17, కృష్ణా 17, వెస్ట్ 11, ఈస్ట్ 21, ఉత్తరాంధ్ర 33 లక్షలు.


నేనే రాజు నేనే మంత్రి

నేనే రాజు నేనే మంత్రి

మిగిలిన వారి కన్నా బెటర్ గా ఎక్కువ సంఖ్యలో థియేటర్లు సాధించి తన కొడుకు రానా సినిమాను విడుదల చేయించగలిగారు. దాంతో తొలి రోజు మంచి ఫలితాలే నమోదు చేసింది. కలెక్షన్ల వివరాలు ఇలా వున్నాయి.


నైజాం 122 లక్షలు, సీడెడ్ 65 లక్షలు, నెల్లూరు 9 లక్షలు, గుంటూరు 24 లక్షలు, కృష్ణ 28 లక్షలు, పశ్చిమ 20 లక్షలు, ఈస్ట్ .35 లక్షలు, ఉత్తరాంధ్ర 68 లక్షలు.


English summary
Nithin's lie, Boyapati's Jaya Janakinayaka, Rana's Nene raju., movies first day collections
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu