»   » 'లోఫర్' అక్కడ పెద్ద డిజాస్టర్ ?

'లోఫర్' అక్కడ పెద్ద డిజాస్టర్ ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మొన్నగురువారం విడుదలైన వరుణ్ తేజ 'లోఫర్' చిత్రం ఓవర్సీస్ లో ఘోర పరాజయం ఎదురయ్యినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. మొదటి రెండు రోజుల్లో $17,011 మాత్రమే కలెక్టు చేసినట్లు చెప్తున్నారు.
ఇండియాలో మిక్సెడ్ టాక్ నడుస్తున్నా...ఓవర్సీస్ లో మాత్రం అక్కడ కొనుక్కున్నవారికి పూర్తి నష్టాలు వస్తాయంటున్నారు. అందుకు కారణం...డివైడ్ టాక్ రావటం, రివ్యూలు ఎంకరేజింగ్ గా లేకపోవటమే కాక, మంచి ధియోటర్స్ దొరకకపోవటమే అని తెలుస్తోంది.

అదే రోజున షారూఖ్ ఖాన్ తాజా చిత్రం దిల్ వాలే, బాజీరావు మస్తాన్ చిత్రాలు భారీ ఎత్తున విడుదల అవ్వటమే కారణం అంటున్నారు. దాంతో ఓవర్ సీస్ లో ఈ చిత్రాలకే ప్రయారిటీ ఇచ్చి ఎక్కువ స్కీన్స్ కేటాయించారు. లోఫర్ కు మాత్రం చాలా తక్కువ స్క్రీన్ లు దొరకాయని చెప్తున్నారు. దాంతో కలెక్షన్స్ కూడా అందుకు తగ్గట్లే చాలా తక్కువగా ఉన్నాయంటున్నాయి. ఎన్టీఆర్ తో పూరి చేసిన టెంపర్ ని దృష్టిలో పెట్టుకుని విడుదల చేసిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్ భారీ నష్టం మూటకట్టుకోక తప్పదంటున్నారు.


Loafer a disaster in Overseas?


పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.... భర్త మీద కోపంతో తల్లి తన కొడుకుని కావాలనే లోఫర్‌గా పెంచుతుంది. టైటిల్‌ 'లోఫర్‌' అయినంత మాత్రాన సినిమా అలా ఉండదు. ఇందులో అమ్మ చని పోయిందని కొడుకు (హీరో) చెబుతాడు. కొడుకు చని పోయాడని తల్లి చెబుతుంది. తండ్రి చనిపోయాడని కొడుకు చెబుతాడు. ఒకరిపై ఒకరు ఇలా చెప్పుకుంటారు. కాని అందరూ బతికే ఉంటారు. ఒక్క మదర్‌ సెంటిమెంట్‌ తప్ప దీనికి 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి'కి పోలికే లేదు. ఇందులోని మదర్‌సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. అన్నారు.


వరుణ్ తేజ మాట్లాడుతూ... ‘‘ఇందులో నేనో దొంగని. పూరి సినిమాల్లో కథానాయకుడు ఎలా ఉంటాడో.. అంతే జోష్‌తో సాగే పాత్ర ఇది. పూరిగారు ‘లోఫర్‌' అనే టైటిల్‌ చెప్పగానే కంగారుపడిపోయా. రషెస్‌ చూసుకొన్నాక ఇదే సరైన టైటిల్‌ అనిపించింది. మదర్‌ సెంటిమెంట్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. నిజానికి అది నచ్చే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. ఒక దశలో ఈ చిత్రానికి ‘అమ్మ' అనే పేరు పెడదామనుకొన్నాం''అన్నారు .

English summary
Varun Tej 's Loafer seem to be heading towards becoming a disaster in Overseas. The movie had just grossed $17,011 in the first two days of its release.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu