Don't Miss!
- Sports
India vs New Zealand చివరి టీ20కి వరల్డ్ కప్ విజేతలు!
- News
సమయం లేదు మిత్రమా? అమరావతా? వైజాగా?
- Lifestyle
Garuda Purana: ఈ పనులను తప్పనిసరిగా పూర్తి చేయాలి.. లేదంటే సమస్యలు తప్పవు
- Finance
Vizag: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు.. సీఎం జగన్ పెట్టుబడుల ఆకర్షణ మంత్రం..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Love Today Collections: లవ్ టుడే సంచలనం.. 3 కోట్లకు డబుల్ కలెక్షన్లు.. నక్క తోక తొక్కిన దిల్ రాజు
గతంలో మాదిరిగా ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీ నుంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీలతో సినిమాలు పెద్దగా రావడం లేదు. దీంతో ఆ జోనర్‌లలో మూవీలను ఇష్టపడే వాళ్లు ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే ఇటీవలే కోలీవుడ్‌లో వచ్చిన చిత్రం 'లవ్ టుడే'. అక్కడ సూపర్ డూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి ఎంతో గ్రాండ్‌గా విడుదల చేశారు. ఊహించని విధంగా మన దగ్గర కూడా ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. ఈ నేపథ్యంలో 'లవ్ టుడే' మూవీ ఫుల్ రన్‌లో ఎంత వసూలు చేసిందో చూద్దాం పదండి!

లవ్ టుడే అంటూ హడావిడి
కోలీవుడ్ యంగ్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించి, హీరోగా నటించిన చిత్రమే 'లవ్ టుడే'. ఈ మూవీని అఘోరం, గణేష్, సురేష్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ఇవానా, రవీనా రవి హీరోయిన్లుగా నటించారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందించారు. సత్యరాజ్, యోగిబాబు, రాధిక శరత్ కుమార్‌లు ఈ సినిమాలో కీలక పాత్రలను చేశారు.
గృహలక్ష్మి లాస్య ఓవర్ డోస్ హాట్ షో: ఎద అందాలు చూపిస్తూ ఘోరంగా!

లవ్ టుడే బిజినెస్ డీటేల్స్
నేటి పరిస్థితులతో కూడిన లవ్ స్టోరీతో రూపొందిన 'లవ్ టుడే' తమిళంలో మంచి ఆదరణను అందుకుని విజయం సాధించింది. దీంతో ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు డబ్బింగ్ థియేట్రికల్ రైట్స్‌ను టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు రూ. 2.70 కోట్లకు కొనుగోలు చేశారు. అందుకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఆయన భారీగా రిలీజ్ చేశారు.

అలాంటి టాక్‌తోనే వసూళ్లు
తమిళంలో క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'లవ్ టుడే' మూవీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మంచి టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు కలెక్షన్లు పోటెత్తాయి. ఫలితంగా ఈ మూవీ కేవలం రెండు మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది. అలాగే రెండు వారాల పాటు ప్రభావాన్ని చూపించింది. దీంతో అన్ని ఏరియాల్లోనూ ఈ సినిమా విశేషమైన వసూళ్లను రాబట్టింది.
బ్రాలో షాకిచ్చిన డీజే టిల్లు హీరోయిన్: అలా తెగించి మరీ అందాల ఆరబోత

తెలుగులో ఎంత వచ్చింది?
విభిన్నమైన కథతో రూపొందిన 'లవ్ టుడే' మూవీకి కలెక్షన్లు మంచిగా వచ్చాయి. ఇలా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాల్లో భారీగా రాణించింది. మొత్తంగా ఇది ఫుల్ రన్‌లో నైజాంలో రూ. 7.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.48 కోట్లు, ఆంధ్రాలో రూ. 6.12 కోట్లు గ్రాస్‌ను రాబట్టింది. ఇలా మొత్తంగా రూ. 14.80 కోట్లు గ్రాస్, రూ. 7.65 కోట్లు షేర్‌ను రాబట్టింది.

మూవీకి అన్ని కోట్ల లాభాలు
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'లవ్ టుడే' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 2.70 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 3 కోట్లుగా నమోదైంది. ఇక, ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ. 7.65 కోట్లు వసూలు చేసింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 4.65 కోట్లు లాభాలను కూడా ఇది అందుకుంది.
మళ్లీ రెచ్చిపోయిన కేతిక శర్మ.. చాలీ చాలని బట్టల్లో అందాల ప్రదర్శన

నక్కతోక తొక్కిన దిల్ రాజు
తమిళంలో తెరకెక్కి భారీ హిట్ సాధించిన 'లవ్ టుడే' మూవీని నిర్మాత దిల్ రాజు తెలుగులో విడుదల చేశారు. దీనికి ఇక్కడ భారీ వసూళ్లు వస్తున్నాయి. ఫలితంగా ఇది మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాతో నిర్మాత టాలీవుడ్ దిల్ రాజుకు రూ. 5 కోట్లు వరకూ లాభాలు దక్కాయి. దీంతో ఆయన ఫుల్ ఖుషీగా ఉన్నారు.

ఆ ఓటీటీలో సందడి చేస్తూ
ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో నటించిన 'లవ్ టుడే' మూవీ థియేటర్లలో చాలా రోజుల పాటు సందడి చేసింది. దీంతో సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఈ క్రమంలోనే ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఇక్కడ కూడా దీనికి మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తమిళం కంటే తెలుగు వెర్షన్‌కు ఎక్కువ రెస్పాన్స్ వస్తుందని టాక్.