అఫీషియల్‌గా ప్రకటించిన నిర్మాత... టోటల్ వసూళ్లు రూ. 200 కోట్లు!
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాడు. ఆయన లేటెస్ట్ మూవీ 'లూసిఫెర్' రూ. 200 కోట్ల మార్కును అందుకుంది. కలెక్షన్ల విషయం అఫీషియల్‌గా వెల్లడిస్తూ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా ప్రకటన చేశారు.
రూ. 200 కోట్ల మార్కును అందుకోవడంతో 'లూసిఫెర్' చిత్రం మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇంతకు ముందు 'పులిమురుగన్' సినిమా పేరుతో ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది. మలయాళ ఇండస్ట్రీలో తొలి రూ. 100 కోట్ల మూవీగా అప్పట్లో పులిమురుగన్ చరిత్ర సృష్టించడంతో పాటు ఫుల్ రన్‌లో రూ. 165 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.

'లూసిఫెర్' చిత్రం థియేట్రికల్ రన్ పూర్తవ్వడంతో.... అమేజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేశారు. నేటి(మే 16) నుంచి ఈ చిత్రం ఈ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫాంలో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని వారు రూ. 13 కోట్లకు కొనుగోలు చేసి విడుదల చేశారు.
మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ 'లూసిఫెర్' చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంలోనే భారీ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఫలితంతో దర్శకుడిగా అతడికి డిమాండ్ మరింత పెరిగింది. పలువురు నిర్మాతలు ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
'లూసిఫెర్' కథ విషయానికొస్తే... సౌత్ కేరళలోని ఓ పొలిటీషియన్ కథ నేపథ్యంతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో మోహన్ లాల్ స్టీఫెన్ నేదుమ్‌పల్లి అనే పాత్రలో నటించాడు. ఇందులో ఇంకా వివేక్ ఒబెరాయ్, టోవినో థామస్, మంజు వారియర్, సాయి కుమార్, కళాభవన్ షాజోన్ తదితరులు నటించారు. త్వరలో ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రాబోతోంది.


Click it and Unblock the Notifications











