»   » డబ్బింగ్ చిత్రం... బిజినెస్ అదిరింది

డబ్బింగ్ చిత్రం... బిజినెస్ అదిరింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరోగా నటిస్తూ విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై విశాల్‌ నిర్మిస్తున్న చిత్రం ‘మగ మహారాజు'. సుందర్‌ సి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హన్సిక, మధురిమ, మాధవీలత హీరోయిన్స్. వైభవ్‌ ఓ కీలక పాత్ర పోషించారు. విశాల్‌ మేనత్తలుగా రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్‌ రాథోడ్‌ నటించారు. విశాల్ గత చిత్రం పూజ మంచి విజయం సాధించటంతో ‘మగ మహారాజు' మంచి బిజినెస్ జరిగింది. ఏరియా వైజ్ ఈ చిత్రం బిజినెస్ ఈ క్రింద విధంగా మారింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Maga Maharaju doing good business

ఏరియా... ఎమౌంట్ (లక్షల్లో) ..కంపెనీ


1. నైజాం Rs.1.50 గ్లోబల్ ఫిల్మ్స్

2. సీడెడ్ 0.60 లక్ష్మీ కాంత్ రెడ్డి

3. నెల్లూరు,గుంటూరు, కృష్ణా Rs.0.75 హరి పిక్చర్స్

4. పశ్చిమ గోదావరి Rs.0.10 సురేష్

5. తూర్పు గోదావరి Rs.0.15 బృందావన్ ఫిల్మ్స్

6. వైజాగ్ Rs.0.35 సురేష్

తమిళంలో రూపొంది హిట్టైన ‘ఆంబల'కు ఇది తెలుగు రూపం. ఈ చిత్రం ఫిబ్రవరి 27 న విడుదల చేయటానికి నిర్ణయించారు. ఈ చిత్రం తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతో ‘హిప్‌హాప్‌ తమిళ' సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. రమ్యకృష్ణ, విశాల్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలెట్ అంటున్నారు. 

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ విశాల్ కు అత్తగా నటించారు. వీరిద్దరూ కలిసి ఒక పాటలో సందడి చేయనున్నారు. మరో ఇద్దరు మాజీ హీరోయిన్లు ఐశ్వర్య, కిరణ్ లు సైతం విశాల్ కి అత్తలుగా నటించారు. మధురిమ, మాధవి లత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను విశాల్ తన సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.

హీరో రానా మాట్లాడుతూ... ట్రైలర్‌లో విశాల్ చాలా బాగున్నాడు. అతని చుట్టు ముగ్గురు హీరోయిన్‌లున్నారు....ఇదంతా చూసిన తరువాత సినిమాకు కావాల్సినవి అన్నీ వున్నాయన్న భావన కలిగింది. చిత్రపరిశ్రమలో వున్న హీరోల్లో వ్యక్తిగతంగా నాకు చాలా నచ్చిన వ్యక్తి విశాల్. చూడటానికి గంభీరంగా కనిపించినా అతని మనసు మాత్రం వెన్న. విశాల్ నటించి నిర్మించిన ఈ సినిమా తమిళంలో కన్నా తెలుగులో మంచి విజయాన్ని సాధించాలి అన్నారు.

విశాల్ మాట్లాడుతూ... నిర్మాతగా నా 4వ చిత్రమిది. తమిళంలో సంక్రాంతికి విడుదల చేస్తున్నాం. తెలుగులో ఇంకా తేదీ నిర్ణయించలేదు. ఈ సినిమాతో హిప్‌అప్ తమిళ ఆదిని సంగీత దర్శకుడిగా పరిచయం చేస్తున్నందుకు గర్వంగా వుంది. పాటల కంపోజింగ్ కోసం ఏ దేశమో వెళ్లకుండా కేవలం 2500 రూపాయల ఖర్చుతో చెన్నైలోనే చేశాం. ఇప్పటికే తమిళంలో ఆడియో పెద్ద హిట్ అయింది.

తెలుగు ప్రేక్షకులు ఇంతకు ముందు నా చిత్రాలని ఆదరించినట్టుగానే ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సినిమా కోసం మస్కట్‌లో ఓ పాట చేశాం. దీని కోసం ఎనిమిది కిలోమీటర్‌లు యూనిట్ అంతా నడిచివెళ్లడం జరిగింది. ఈ పాట కోసం హన్సిక చాలా సహకరించింది. సినిమాలో ఈ పాట హైలైట్‌గా నిలుస్తుంది అన్నారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో నటించడం ఆనందంగా వుందని వైభవ్ తెలిపారు.

హన్సిక మాట్లాడుతూ- సుందర్‌గారి దర్శకత్వంలో నేను చేస్తున్న మూడో సినిమా ఇది. మంచి పాత్ర ఇచ్చారు. తప్పకుండా ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలుస్తుంది అన్నారు.

English summary
Vishal, Hansika's hit Tamil film ‘Ambala’ is releasing in Telugu as ‘Maga Maharaju’. Film directed by Sundar.C is readying for grand release on Feb. 27th.
Please Wait while comments are loading...