»   » 'మగధీర' రీమేక్ చేస్తున్నారు

'మగధీర' రీమేక్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రాజమౌళి చిత్రాలు వరసగా ఇతర భాషల్లోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బెంగాళి సిని పరిశ్రమ దృష్టి 'మగధీర' పై పడింది. ఈ చిత్రాన్ని రాజ్ చక్రవర్తి టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు. దేవ్,మిమి చక్రవర్తి ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఇందుకోసం హీరో దేవ్..సిక్స్ ప్యాక్ చేసి,గుర్రపు స్వారీ నేర్చుకున్నాడు. అక్కడ దేవ్ ..హైయిస్ట్ రెమ్యునేషన్ తీసుకుంటూ ఓ వెలుగు వెలుగుతున్నారు. ఈ చిత్రంతో ఘన విజయం సాధిస్తాననే నమ్మకంతో ఉన్నాడు.

మహేష్ బాబు 'దూకుడు' సైతం బెంగాల్ లోకి రీమేక్ చేసారు. ఆ చిత్రం అక్కడా రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోయింది. 2012 దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం అక్కడ కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ చిత్రం బెంగాళ్ వెర్షన్ టైటిల్ ఛాలెంజ్ 2. బెంగాళ్ సినీ చరిత్రలోనే తొలిసారిగా 270 థియోటర్లలలో విడుదలైంది. త్వరలో ఎబ్రాడ్ లోనూ విడుదల చేసి విజయం సాధించారు. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజులకే బడ్జెట్ లోని ఎనభై శాతం రికవరీ అయ్యిందని అన్నారు. దాంతో అక్కడ నిర్మాతల దృష్టి తెలుగు రీమేక్ లపై పడింది.

Magadheera re-make in Bengali

2012 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించిన 'బిజినెస్‌మేన్' చిత్రం బెంగాలీలో పునర్నిర్మాణమైంది. 'బాస్' పేరుతో తయారైన ఈ చిత్రం అక్కడా మంచి విజయం సాధించింది. బెంగాలి 'బిజినెస్‌మేన్'లో జీత్, శుభశ్రీ గంగూలీ హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ద్వారా నృత్య దర్శకుడు బాబా యాదవ్ దర్శకునిగా పరిచయయ్యారు. ఈ జీత్ ఇంతకుముందు తెలుగులో వీరు.కె తీసిన 'చందు' సినిమాలో హీరోగా చేశాడు. రిలయన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇటీవలి కాలంలో రెడి, దూకుడు,కృష్ణ ఇలా చాలా తెలుగు సినిమాలు బెంగాలీలో రీమేక్ అయ్యి మంచి విజయం సాధించాయి. ఇలా వరసగా రీమేక్ లు అవుతూండటంతో ... మనకు కొత్త మార్కెట్ తయారవుతుందని టాలీవుడ్ ప్రముఖులు ఆనందపడుతున్నారు.

English summary
‘Magadheera’ is getting re-made in various languages. Now this film is getting re-made in Bengali titled as Raj Chakraborthy. Dev,Mimi Chakraborthy are starring in the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu