twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మహర్షి’ 11 డేస్ కలెక్షన్ రిపోర్ట్: పరిస్థితేంటి? రూ. 200 కోట్లు సాధ్యమేనా?

    |

    సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన 'మహర్షి' చిత్రం రెండో వారంలో సైతం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. సెకండ్ వీక్ రిలీజైన అల్లు శిరీష్ 'ఎబిసిడి' మూవీ 'మహర్షి' వసూళ్లపై ఏమాత్రం ప్రభావం చూపలేక పోయాయి. ఆదివారంతో విజయవంతంగా 11 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 170 కోట్లకు చేరువైంది.

    తొలి వారం తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 80 శాతం థియేటర్లలో 'మమర్షి' చిత్రాన్ని ప్రదర్శించారు. అయితే రెండో వారం 'ఎబిసిడి' రాకతో కొన్ని థియేటర్లకు గండి పడింది. ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులంతా 'మహర్షి' వైపే మొగ్గు చూపుతున్నారు.

    సెకండ్ వీకెండ్ అదుర్స్

    సెకండ్ వీకెండ్ అదుర్స్

    సెకండ్ వీకెండ్ ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు రెస్టాఫ్ ఇండియాలో మంచి ఆక్యుపెన్సీ సాధించింది. రెండో వారాంతమైన శని, ఆదివారాల్లో రూ. 15.65 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో 11 రోజుల టోటల్ గ్రాస్ రూ. 166.10 కోట్లకు చేరుకుంది.

    తెలుగు రాష్ట్రాల్లో సూపర్ రికవరీ

    తెలుగు రాష్ట్రాల్లో సూపర్ రికవరీ

    ఇక తెలుగు రాష్ట్రాల్లో ‘మహర్షి' చిత్రం 11 రోజుల్లో రూ. 72.79 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్ర రైట్స్ ఏపీ, తెలంగాణా అన్ని ఏరియాలు కలిపి రూ. 76 కోట్లకు అమ్మారు. ఇప్పటికే రూ. 72 కోట్లకుపైగా వసూలు చేయడంతో దాదాపు 95 శాతం డిస్ట్రిబ్యూటర్ల పెట్టుబడి రికవరీ అయినట్లయింది.

    రెస్టాఫ్ ఇండియాలో లాభాల బాటలో..

    రెస్టాఫ్ ఇండియాలో లాభాల బాటలో..

    కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో ‘మహర్షి'పై డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఇప్పటికే తిరిగి రావడంతో పాటు లాభాల బాటలో ఉన్నారు. అయితే యూఎస్ఏలో మాత్రం ఈ చిత్రం వసూళ్ల విషయంలో వెనక బడింది. ఇక్కడ 2 మిలియన్ డాలర్ అందుకుంటుందనే అంచనాలను రీచ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. రూ. 14 కోట్లకు ఓవర్సీస్ రైట్స్ అమ్మగా ఇప్పటి వరకు రూ. 12 కోట్లు కూడా రాలేదు.

    ఏపీ, తెలంగాణ టాప్ 5లో చోటు

    ఏపీ, తెలంగాణ టాప్ 5లో చోటు

    ‘మహర్షి' తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు రూ. 72.79 కోట్ల షేర్ వసూలు చేయడం ద్వారా టాప్-5లో చోటు దక్కించుకుంది. బాహుబలి 2, బాహుబలి, రంగస్థలం, ఖైదీ నెం.150 చిత్రాల తర్వాతి స్థానంలో ఉంది. మరి ఫుల్ రన్‌లో రంగస్థలం, ఖైదీ నెం.150 అధిగమిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

    రూ. 200 కోట్ల వసూళ్లు సాధ్యమేనా?

    రూ. 200 కోట్ల వసూళ్లు సాధ్యమేనా?

    మహేష్ బాబు గత చిత్రం ‘భరత్ అనే నేను' రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ‘మహర్షి' గ్రాస్ రూ. 166.10 కోట్లకు రీచ్ అయింది. ఫుల్ రన్‌లో రూ. 200 కోట్లను అందుకోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

    English summary
    Maharshi has recovered 95.77 per cent of the investment of the distributors, who shelled out Rs 76 crore on its theatrical rights for Andhra Pradesh and Telangana. The PRO tweeted, "#Maharshi Nizam 11th day share - 1.33 Cr 11 days share - 25.40 Crs #Maharshi AP, Telangana 11 Days Share - 72.79 Crs."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X